




Best Web Hosting Provider In India 2024

Jack Song: క్యాచీ ట్యూన్.. పవర్ ఫుల్ లైన్స్.. పాబ్లో నెరుడా అంటూ జాక్ సాంగ్ రిలీజ్.. సిద్ధు జొన్నలగడ్డ స్టెప్పులు
Jack Song: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరో సినిమాతో అభిమానులను ఎంటరటైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అతని లేటేస్ట్ మూవీ ‘జాక్-కొంచెం క్రాక్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. పాబ్లో నెరుడా అంటూ సాగుతున్న ఈ సాంగ్ క్యాచీగా, పవర్ ఫుల్ లైన్స్ తో ఉంది.

‘డీజే టిల్లు’ అంటూ వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరో కొత్త సినిమా తో ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సారి టైటిల్ తోనే వైబ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ‘జాక్-కొంచెం క్రాక్’ అంటూ ఫ్యాన్స్ ను హుషారెత్తించేందుకు మరోసారి థియేటర్లోకి వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది.
స్పానిష్ కవి
‘జాక్-కొంచెం క్రాక్’ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘పాబ్లో నెరుడా’ పవర్ ఫుల్ లైన్స్ తో సాగుతోంది. స్పానిష్ కవి అయిన పాబ్లో నెరుడా పేరుతో ఈ సాంగ్ క్యాచీగా ఉంది. హీరోను ఎలివేట్ చేసేలా పాటను రూపొందించారు. ఈ లిరికల్ వీడియోలో సిద్ధు హుషారైన స్టెప్స్ వేశాడు. జానీ మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ రాశారు.
స్టైలిష్ లుక్స్
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ అంటూ స్లైటిష్ లుక్స్ తో, డైలాగ్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసిన సిద్ధు.. జాక్-కొంచెం క్రాక్ లోనూ అంతే స్టైలిష్ గా ఉండేలా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లిరికల్ పాబ్లో నెరుడా సాంగ్ లో సిద్ధు ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. కూల్ యాటిట్యూడ్ తో స్టెప్పులు వేశాడు. ఈ సినిమాకు అచు రాజమణి మ్యూజిక్ డైరెక్టర్. పాబ్లో నెరుడాకు క్యాచీ ట్యూన్స్ అందించారు.
అప్పుడే రిలీజ్
జాక్-కొంచెం క్రాక్ సినిమకు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ అనగానే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడీ పాబ్లో నెరుడా సాంగ్ తో అంచనాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. ఈ మూవీని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో సిద్ధు క్యారక్టర్ పేరు ‘పాబ్లో నెరుడా’గా తెలుస్తోంది. యాక్షన్ కామెడీ డ్రామాగా ఈ మూవీ రెడీ అవుతోంది.
బేబీ హీరోయిన్
జాక్-కొంచెం క్రాక్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ‘బేబీ’ సినిమాతో ఈ బ్యూటీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. జాక్-కొంచెం క్రాక్ సినిమాను వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే మరో మూవీ కూడా చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ లో భాగంగా ‘టిల్లు క్యూబ్’ కూడా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.