



Best Web Hosting Provider In India 2024

Skipping Breakfast: డిన్నర్ హెవీగా తినేశామని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!
Skipping Breakfast: రాత్రి భోజనం అయిన డిన్నర్ లో ఎక్కువ వెరైటీలు ఉన్నాయని లాగించేస్తారు. దానిని సమానం చేయాలని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. ఫుడ్ తీసుకునేందుకు రోజు మొత్తంలో చాలా కీలకమైన సమయమైన బ్రేక్‌ఫాస్ట్ టైంలో తినకపోవడం ఎంతవరకూ కరెక్ట్?

మనలో చాలా మందికి ఇదే అలవాటు ఉండొచ్చు. రాత్రి డిన్నర్ ఎక్కువగా తినేశామని ఉదయాన్నే తినడం మానేయడం ఎక్కువసార్లు చూస్తుంటాం కూడా. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ అలవాటు కనిపిస్తుంటుంది. నిజంగానే బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే సెట్ అయిపోతుందా.. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? వారిచ్చే బెస్ట్ సలహా ఏంటని అడిగితే..
“రాత్రి డిన్నర్ లో ఎక్కువగా తినేసిన వారు బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం అనేది కచ్చితంగా మంచి విషయమే. దీని వల్ల మీ జీర్ణ వ్యవస్థ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేకాకుండా తిండి మానేయడం వల్ల శరీరంలోని చాలా అవయవాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ మరంత చక్కగా పని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, మెదడు పనితీరు మెరుగవుతుంది. శరీరంలోని ఇతర అవయవాలు తమను తాము రిపేర్ చేసుకోవడానికి సరైన సమయం దొరుకుతుంది. రాత్రుళ్లు లైట్ గా తినడం అనేది ఎంత మంచి విషయమో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం అనేది కూడా అంతే మంచి విషయం.” అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి బాగా లాగించేసి ఉదయం తినడం మానేస్తే కలిగే లాభాలు:
1. శరీరంలోకి కేలరీలు పెరగకపోవడం:
రాత్రుళ్లు ఎక్కువ తినేసిన వారి శరీరంలోకి కేలరీలు ఎక్కువగా సమకూరి ఉంటాయి. అదే సమయంలో ఉదయం తినడం మానేస్తే అవి సమానం అయ్యేందుకు హెల్ప్ అవుతుంది. కానీ, ఈ అలవాటును కొనసాగిస్తూ పోతే ఇది దీర్ఘకాల వ్యాధులైన ఒబెసిటీ, డయాబెటిస్, అజీర్ణ సమస్యలకు దారి తీయొచ్చు.
2. జీర్ణవ్యవస్థకు విరామం:
రాత్రి భోజనంలో ఐటెంలు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త మందగిస్తుంది. ఈ సమయంలో బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల దానికి కాస్త విరామం దొరుకుతుంది. శరీరం సహజమైన డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు తోడ్పడుతుంది. ముందుగానే మీ శరీరాన్ని లంచ్ చేయడానికి సిద్ధంగా ఉంచుతుంది.
3. ఉపవాసం:
బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొట్టడం వల్ల ఉపవాసం ఉండే సమయం పెరుగుతుంది. ఇది ఇంటర్మిటెంట ఫాస్టింగ్ లా కూడా పరిగణించొచ్చు. దీనిని బట్టి మీ శరీరం నిల్వచేసి ఉన్న శక్తిని వాడుకుంటుంది. అరుగుదలకు తోడ్పడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
4. ఆకలి సమస్య:
ఆకలిగా లేకపోవడం వల్ల కచ్చితంగా తినాల్సిన అవసరం లేదు. మీ శరీరం కోసం బ్రేక్‌ఫాస్ట్ కాస్త లైట్‌గా తీసుకుంటే సరిపోతుంది. శరీరం సమానమైన శక్తి స్థాయిలను మెయింటైన్ చేస్తుంది. ఆ తర్వాత బాగా తినేయకుండా చూసుకుంటుంది.
బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల కలిగే నష్టాలు కూడా తెలుసుకుందామా:
జీర్ణవ్వస్థపై దుష్ప్రభావం:
బ్రేక్‌ఫాస్ట్ ను రెగ్యూలర్ గా మానేసేవారికి ఈ సమస్య కలుగుతుంది. జీర్ణవ్యవస్థను దెబ్బతీసి శక్తిస్థాయిలు తగ్గిపోయేలా చేస్తుంది. మీ అరుగుదల శాతాన్ని క్రమేణా నెమ్మెదయ్యేందుకు కారణమవుతుంది.
ఆకలి కేకలు:
రాత్రి తర్వాత నుంచి లంచ్ సమయం వరకూ ఏదీ తినకపోవడం వల్ల ఆకలి సమస్య మొదలవుతుంది. ఇంతటి ఆకలితో భోజనం ముందు కూర్చొన్న వెంటనే ఒకేసారి ఫుల్లుగా లాగించేస్తాం. అదీ ఇది అనకుండా దొరికిన ప్రతీది తినాలని ప్రయత్నిస్తాం. ఫలితంగా ఎక్కువగా తినేసి బరువు పెరిగిపోతారు.
ముందు అనుకున్నట్లుగానే బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే, దుష్ప్రభవాలు కూడా ఉన్నాయి. జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఈ అలవాటు సుదీర్ఘ కాలం పాటిస్తే ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి వ్యాధులు కలిగేందుకు దారి తీస్తుందట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం