Thriller Movie: క‌న్న‌డ యాక్ష‌న్ మూవీని ఫ్రీగా చూసేయండి- ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్ – సలార్ యాక్టర్ హీరో

Best Web Hosting Provider In India 2024

Thriller Movie: క‌న్న‌డ యాక్ష‌న్ మూవీని ఫ్రీగా చూసేయండి- ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్ – సలార్ యాక్టర్ హీరో

Nelki Naresh HT Telugu
Published Mar 08, 2025 12:36 PM IST

Thriller Movie: స‌లార్ ఫేమ్ ప్ర‌మోద్ పంజు హీరోగా న‌టించిన‌ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ బాండ్ ర‌వి యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ మూవీలో కాజ‌ల్ కుంద‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

థ్రిల్లర్ మూవీ
థ్రిల్లర్ మూవీ

Thriller Movie: క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ బాండ్ ర‌వి యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్‌, స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బాండ్ ర‌విని యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన‌ట్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ క‌న్న‌డ సినిమాను ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్‌తో చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది.

9.2 రేటింగ్‌…

బాండ్ ర‌వి మూవీలో ప్ర‌మోద్ పంజు, కాజ‌ల్ కుంద‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ర‌వికాలే, శోభ‌రాజ్‌, ర‌విప్ర‌కాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్‌పి ప్ర‌జ్వ‌ల్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2022 డిసెంబ‌ర్‌లో బాండ్ ర‌వి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో మాత్రం 9.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

నో ఓటీటీ ఆఫ‌ర్స్‌…

థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చి రెండేళ్లు దాటినా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ బాండ్ ర‌వి కొనుగోలు చేయ‌లేదు. దాంతో మేక‌ర్స్ ఈ మూవీని డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాండ్ ర‌వి క‌థ ఇదే…

బాండ్ రవి ఓ అనాథ‌. డ‌బ్బు కోసం లోక‌ల్ పొలిటీషియ‌న్ చేసిన నేరాన్ని త‌న‌పై వేసుకొని జైలుకు వెళ‌తాడు. బెయిల్‌పై విడిపిస్తాన‌ని హామీ ఇచ్చిన పొలిటీషియ‌న్ బాండ్ ర‌విని మోసం చేస్తాడు. ఆ పొలిటీషియ‌న్‌పై ప‌గ‌ను పెంచుకున్న బాండ్ ర‌వి…రుద్ర‌ప్ప స‌హాయంతో జైలు నుంచి విడుద‌ల‌వుతాడు. శ్వేత అనే అమ్మాయి ప‌రిచ‌యంతో బాండ్ ర‌వి జీవితం పూర్తిగా మారిపోతుంది. రౌడీ జీవితానికి స్వ‌స్థి చెప్పి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటాడు. కానీ గ‌తం మాత్రం అత‌డిని వెంటాడుతూనే ఉంటుంది. బాండ్ ర‌విని రుద్ర‌ప్ప ఎందుకు చంపాల‌ని అనుకున్నాడు? బాండ్ ర‌వి క్రిమిన‌ల్ అనే నిజం శ్వేత‌కు తెలిసిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

మోస్తారు వ‌సూళ్లు…

క‌మ‌ర్షియ‌ల్‌గా బాండ్ ర‌వి మూవీ మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాలోని యాక్ష‌న్ ఎపిసోడ్స్ మాత్రం అభిమానుల‌ను అల‌రించాయి.

ప్ర‌భాస్ స‌లార్‌లో

బాండ్ ర‌వి మూవీలో హీరోగా న‌టించిన ప్ర‌మోద్ పంజు తెలుగులో ఓ సినిమా చేశాడు. ప్ర‌భాస్ స‌లార్ మూవీలో బాచీ మ‌న్నార్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. క‌న్న‌డంలో ర‌త్న‌న్ ప్ర‌పంచ‌, ప్రీమియ‌ర్ ప‌ద్మినితో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. క‌న్న‌డంలో సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా ప్ర‌మోద్ పంజు కెరీర్ ప్రారంభ‌మైంది. ల‌కుమి, చుక్కి, పున‌ర్ వివాహ‌, మ‌హాదేవి సీరియ‌ల్స్ చేశాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024