Star Maa Serial: స్టార్ మా సీరియల్‌లోకి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ – ట్విస్ట్ మామూలుగా లేదుగా!

Best Web Hosting Provider In India 2024

Star Maa Serial: స్టార్ మా సీరియల్‌లోకి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ – ట్విస్ట్ మామూలుగా లేదుగా!

Nelki Naresh HT Telugu
Published Mar 08, 2025 11:32 AM IST

Star Maa Serial: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విన్న‌ర్ నిఖిల్ స్టార్ మా సీరియ‌ల్ చిన్ని లోకి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ‌నివారం ఎపిసోడ్ చివ‌ర‌లో నిఖిల్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.నిఖిల్ ఎంట్రీని ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.

స్టార్ మా సీరియ‌ల్
స్టార్ మా సీరియ‌ల్

Star Maa Serial: బిగ్‌బాస్ త‌ర్వాత నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా ఆఫ‌ర్లు రావ‌డంతో నిఖిల్ సీరియ‌ల్స్‌కు దూరంగా ఉంటాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ రూమ‌ర్స్‌కు చెక్ పెడుతూ న‌టుడిగా త‌న‌కు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెర వైపే మొగ్గుచూపాడు. నిఖిల్ కొత్త సీరియ‌ల్‌పై అప్‌డేట్ వ‌చ్చేసింది. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న చిన్ని సీరియ‌ల్‌లోకి నిఖిల్ స‌డెన్‌గా ఇచ్చాడు.

శ‌నివారం ఎపిసోడ్‌లో…

చిన్ని సీరియ‌ల్ శ‌నివారం ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ చివ‌ర‌లో నిఖిల్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎపిసోడ్ చివ‌ర‌లో కావ్య‌శ్రీ స్కూల్ పిల్ల‌ల‌తో క‌లిసి బాస్కెట్‌బాల్ ఆడుతున్న‌ట్లుగా చూపించారు. స‌డెన్‌గా అక్క‌డికి కారులో నిఖిల్ రావ‌డం క‌నిపించింది. కావ్య‌శ్రీ వేసిన బాల్ దూరంగా ప‌డిపోవ‌డంతో ఆ బాల్‌ను నిఖిల్ ప‌ట్టుకున్న‌ట్లుగా చూపించారు. శ‌నివారం ఎపిసోడ్‌కు నిఖిల్ ఎంట్రీ హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ది. బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన త‌ర్వాత నిఖిల్ అంగీక‌రించిన మొద‌టి సీరియ‌ల్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ట్విస్ట్ ఊహించ‌లేదు…

ఈ ట్విస్ట్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. నిఖిల్‌, కావ్య‌ల‌ను మ‌ళ్లీ స్క్రీన్‌పై చూడ‌టం ఆనందంగా ఉందంటూ చెబుతోన్నారు. చిన్ని సీరియ‌ల్‌లో నిఖిల్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడా? గెస్ట్‌గా క‌నిపించ‌నున్నాడా అన్న‌ది మాత్రం సోమ‌వారం రివీల్ కానుంది. ఒక‌వేళ ఫుల్ లెంగ్త్ రోల్ అయితే అత‌డి క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

గోరింటాకు, అమ్మ‌కు తెలియ‌ని కోయిల‌మ్మ‌…

కావ్య‌శ్రీ, నిఖిల్ ఇదివ‌ర‌కు గోరింటాకు, అమ్మ‌కు తెలియ‌ని కోయిల‌మ్మ సీరియ‌ల్స్‌లో న‌టించారు. ఈ సీరియ‌ల్స్‌తో వీరిద్ద‌రి జోడీ ఫేమ‌స్ అయ్యింది. నిఖిల్‌, కావ్య ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా వారి ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ ప‌డిన‌ట్లు వార్త‌లొచ్చాయి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ నిఖిల్‌, కావ్య జంట‌గా క‌నిపించి బుల్లితెర ఆడియెన్స్ స‌ర్‌ప్రైజ్ చేశారు.

బిగ్‌బాస్ విన్న‌ర్‌…

ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విన్న‌ర్‌గా నిలిచాడు నిఖిల్‌. షో మొద‌టి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొన‌సాగుతూ వ‌చ్చిన నిఖిల్ చివ‌ర‌కు టైటిల్ గెలుచుకున్నాడు. నిఖిల్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన గౌత‌మ్ కృష్ణ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన నిఖిల్ 55 ల‌క్ష‌ల‌కుపైగా ప్రైజ్‌మ‌నీని ద‌క్కించుకున్న‌ది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024