Indian Overseas Bank : ప్రముఖ బ్యాంక్​లో అప్రెంటీస్​ పోస్టులు- అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​..

Best Web Hosting Provider In India 2024


Indian Overseas Bank : ప్రముఖ బ్యాంక్​లో అప్రెంటీస్​ పోస్టులు- అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​..

Sharath Chitturi HT Telugu
Published Mar 09, 2025 01:32 PM IST

Indian Overseas Bank Apprentice Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్
ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నేడు చివరి రోజు!అర్హులైన అభ్యర్థులు iob.in ఐఓబీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 750 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. మార్చ్​ 9, ఆదివారంతో ముగుస్తుంది. ఆన్​లైన్ పరీక్ష తేదీ మార్చ్​ 16, 2025గా నిర్ణయించారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద తెలుసుకోండి..

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​ అప్రెంటీస్​ పోస్టులు..

  1. అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.

2. వయస్సు

అప్లై చేస్తున్న సదరు అభ్యర్థి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్​ కేటగిరీ అభ్యర్థుల కటాఫ్​ డేట్​ 01-03-2025. ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థుల డేట్​ ఆఫ్​ బర్త్​ 01-03-1997, 01-03-2025 (రెండు కలుపుకుని)గా నిర్ణయించారు.

3. ఎంపిక ప్రక్రియ

ఆన్​లైన్ ఎగ్జామినేషన్, (వర్తించే చోట) స్థానిక భాషను పరీక్షించడం, బ్యాంక్ నిర్ణయించిన విధంగా వ్యక్తిగత ఇంటరాక్షన్ ఆధారంగా ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ జరుగుతుంది. ఆన్​లైన్ రాత పరీక్షలో 100 ప్రశ్నలు, గరిష్ఠంగా 100 మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

4. దరఖాస్తు ఫీజు

పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు రూ.472, మహిళా/ ఎస్సీ/ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.708, జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.944. దరఖాస్తు ఫీజును ఆన్​లోన్ విధానంలో చెల్లించాలి.

ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1- ఐఓబి అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కరెంట్ ఓపెనింగ్ లింక్​పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్​మెట్ 2025 లింక్​పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 4- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 5- అకౌంట్​లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.

స్టెప్​ 6- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

స్టెప్​ 7- సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.

స్టెప్​ 8- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source link