


Best Web Hosting Provider In India 2024

Jagtial Accident : జగిత్యాల జిల్లాలో బైక్ ను ఢీ కొట్టిన అడవి పంది, రైతు మృతి
Jagtial Accident : జగిత్యాల జిల్లా కొండాపూర్ లో అడవి పంది బైక్ ను ఢీకొట్టడంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన రైతు సంగ శ్రీనివాస్ రాత్రి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా..అతడు ప్రయాణిస్తున్న బైక్ అడవి పంది ఢీ కొట్టింది. రోడ్డుపై పడ్డ శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందాడు.

Jagtial Accident : జగిత్యాల జిల్లాలో అడవి పంది బైక్ ను ఢీ కొట్టడంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సంగ శ్రీనివాస్ బైక్ ను అడవి పంది ఢీ కొట్టడంతో రైతు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. గత రాత్రి పంట పొలాల వద్దకు వెళ్లిన శ్రీనివాస్ బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా దారికి అడ్డంగా అడవి పంది పరుగెత్తుకుంటూ వచ్చి బైక్ ను బలంగా కొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
అడవి పంది బైక్ ను ఢీకొట్టడంతో రైతు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంట పొలం నుంచి వేగంగా అడవి పంది రోడ్డు మీదకి రావడంతో అదే సమయంలో బైక్ పై వెళ్తున్న రైతు శ్రీనివాస్ ను సడెన్ గా ఢీ కొట్టడంతో బైక్ పై నుంచి శ్రీనివాస్ ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు నిర్థారించారు. ప్రమాదంపై వెల్గటూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్