Simple Weightloss: జిమ్ లో కష్టపడాల్సిన అవసరం లేకుండా బరువు తగ్గాలంటే ఈ 5 పనులు ప్రతిరోజూ కచ్చితంగా చేయండి

Best Web Hosting Provider In India 2024

Simple Weightloss: జిమ్ లో కష్టపడాల్సిన అవసరం లేకుండా బరువు తగ్గాలంటే ఈ 5 పనులు ప్రతిరోజూ కచ్చితంగా చేయండి

బరువు పెరగడం సులభమే కానీ ఈ పెరిగిన బరువును తగ్గించడం మాత్రం చాలా కష్టం. సులువుగా బరువు తగ్గే ఒక మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. సింపుల్ గా ఫాలో అయ్యే చిట్కాలను ఇక్కడ ఇచ్చాము. ఈ పనులు చేయడం ద్వారా కూడా అధిక బరువు పెరగకుండా అడ్డుకోవచ్చు.

 
వెయిట్ లాస్ చిట్కాలు
 

బరువు ఎంత ఈజీగా పెరుగుతారో తగ్గడ మాత్రం చాలా కష్టం. బరువు తగ్గడానికి కష్టపడటంతో పాటు డైట్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో జిమ్ చేయడం ఇష్టంలేని వారుబరువు తగ్గడానికి ఇతర మార్గాలను వెతుకుతు ఉంటారు. మీరు కూడా పెద్దగా కష్టపడకుండా బరువు తగ్గడానికి మార్గాల కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ చెప్పిన పద్దతులను పాటించండి. అదనపు బరువు పెరగకుండా ఉంటారు. ఉన్న బరువు నుంచి కొన్ని కిలోలు తగ్గించుకోవచ్చు. బరువు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఉండాలనుకునే వారు కూడా ఈ అయిదు పనులు ప్రతిరోజూ పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

 

చక్కెరకు దూరంగా ఉండండి

జంక్ ఫుడ్, స్వీట్లు తినడం మజాగా ఉంటుంది. కానీ ఈ ఆహారాలలో కేలరీలు అధికంగా ఉంటాయి. బరువును సులువుగా పెంచేస్తాయి. వీటిలో ఉండే అదనపు చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. అదనపు చక్కెర, సంతృప్త కొవ్వుతో ప్యాకేజీ చేసిన ఆహారాన్ని పరిమితం చేయడం బరువు తగ్గడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

తినే సమయంపై శ్రద్ధ వహించండి

మీరు రోజులో ఎంత త్వరగా తింటే, మీ జీవక్రియ అంత వేగంగా పనిచేస్తుంది. ఇది మీ శరీరానికి కేలరీలను బర్న్ చేయడానికి సమయం ఇస్తుంది. బరువు తగ్గడానికి ఎప్పుడూ అల్పాహారం దాటవేయవద్దు. రాత్రి ఆలస్యంగా తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎంతో మంది అర్థరాత్రి ఆహారం తింటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. అలాగే రాత్రి భోజనాన్ని ఏడుగంటలకే ముగించాలి. ఇది బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజూ ఈ ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి

ఇంట్లో వండిన ఆహారం ఆరోగ్యకరమైనది. ఇంట్లో వండిన భోజనంలో తరచుగా రెస్టారెంట్లలో లభించే వాటి కంటే తక్కువ చక్కెర, నూనె, ఉప్పు ఉంటాయి. ఇంట్లో వండిన ఆహారం తాజాగా ఉంటుంది. ఈ ఆహారం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

 

నెమ్మదిగా నమలడం ముఖ్యం

జీర్ణక్రియ మీ నోటిలో ప్రారంభమవుతుంది, మీ రుచి మొగ్గలు ఎక్కడ ఉన్నాయో అక్కడే. బరువు తగ్గాలంటే చిన్న చిన్నగా నమిలి తినాలి. నెమ్మదిగా తినడం వల్ల మీ కడుపుకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. మెదడు సంతృప్తి చెందుతుంది.

నిద్ర నాణ్యత

నిద్ర చాలా ముఖ్యం. బరువు తగ్గాలంటే కంటి నిండా నిద్రపోవడం ప్రధానం. ప్రతి రాత్రి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. మంచి నిద్ర మీ మానసిక స్థితిని, మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024