







Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller: ఓటీటీలోకి సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్- శవాలను ముట్టుకుని చంపిందెవరో చెప్పే పిల్లాడు- ఎక్కడంటే?
Touch Me Not OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టచ్ మీ నాట్ స్ట్రీమింగ్ కానుంది. టచ్ మీ నాట్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చనిపోయిన వాళ్లను ముట్టుకుని చంపింది ఎవరో చెప్పే పిల్లాడు, సైకోమెట్రిక్ కాన్సెప్ట్‌తో తీసిన టచ్ మీ నాట్ ఓటీటీ రిలీజ్ చూద్దాం.

Touch Me Not OTT Release: ఓటీటీలోకి ఎన్నో వైవిధ్యభరిత సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ జోనర్స్‌తోపాటు హరర్ సినిమాలు సైతం అలరిస్తున్నాయి.
గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా
ఇలా ఇప్పుడు తెలుగులో సరికొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. అదే టచ్ మీ నాట్. గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్‌లో హీరో నవదీప్‌తోపాటు దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు రమణ తేజ దర్శకత్వం వహించారు. ఇది వరకు ఆయన నాగ శౌర్యతో అశ్వత్థామ వంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు.
సునీత తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన టచ్ మీ నాట్ వెబ్ సిరీస్‌లో నవదీప్, దీక్షిత్ శెట్టితోపాటు కోమలి ప్రసాద్, సంచిత పూనాంచ, హర్షవర్ధన్, బబ్లూ పృథ్వీరాజ్, దేవీ ప్రసాద్, ప్రమోదిని, రాజా రవీంద్ర, శశీధర్, శివారెడ్డి, ప్రదీప్ రెడ్డి, అనీష్ కురువిల్లా, క్రితి చుక్, తైలా, ఉమాదేవి, కొమిడి విశ్వేశ్వర్, క్రాంతి, సాన్విత, సమీర్, విహర్ష్, మహీ రెడ్డి, అనీష్ రామ్, సుజాత, గీతా రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సత్య ప్రకాష్, దావూద్ దివ్య, చార్వి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
టచ్ మీ నాట్ ట్రైలర్
ఇటీవల మార్చి 19న రిలీజ్ చేసిన టచ్ మీ నాట్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా సాగింది. అత్యంత సున్నితమైన క్రైమ్ సంబంధిత విషయం చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుందని అర్థమవుతుంది. ట్రైలర్‌లో ధీక్షిత్ శెట్టి సైకోమెట్రిక్ సామర్థ్యాలు కలిగిన పాత్రలో కనిపిస్తున్నాడు.
“చనిపోయిన వాళ్లను (శవాలను) ముట్టుకుని చంపింది ఎవరో ఈ పిల్లాడు చెబుతాడా?” అనే డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అంటే, దీక్షిత్ శెట్టి చేసిన పాత్ర పోలీసులకు సహాయం చేస్తూ, బాధితుల తలలను తాకడం ద్వారా హంతకులను కనుగొనడానికి తన సైకోమెట్రీని ఉపయోగిస్తున్నట్లు చూపించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు తెలుగులో ఎలాంటి సినిమా, సిరీస్ రాలేదు.
ఒక రహస్యం, అనేక ట్విస్టులు
ఒక రహస్యం, అనేక ట్విస్ట్‌లతో సిరీస్ ముందుకు సాగుతుందని టచ్ మీ నాట్ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ రహస్యమైన క్రైమ్‌ను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు ఆ హంతకుడుని వెంబడిస్తారు? సెకోమెట్రిక్ పవర్స్ ఎలా వచ్చాయి?, అవి ఎప్పుడు పనిచేస్తాయి ఎలా వస్తాయి? వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా టచ్ మీ నాట్ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించే ఎవరైనా చావును ఎదుర్కొవాల్సి వస్తుందనేదే ఈ రహస్యమైన కేసు కథలో ప్రధాన భాగంగా తెలుస్తోంది. ట్రైలర్ మరింతగా టచ్ మీ నాట్ అంచనాలను పెంచేసింది. ఇక యూట్యూబ్‌లో టచ్ మీ నాట్ ట్రైలర్ ఆకట్టుకుంటూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
ఈ సిరీస్‌తో ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక జియో హాట్‌స్టార్‌లో టచ్ మీ నాట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ టచ్ మీ నాట్ ఓటీటీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం