Brahmanandam: 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు.. 4 మెతుకులు తిని బతుకుతానన్నాడు.. ఇది పవిత్రమైనది.. బ్రహ్మానందం కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Brahmanandam: 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు.. 4 మెతుకులు తిని బతుకుతానన్నాడు.. ఇది పవిత్రమైనది.. బ్రహ్మానందం కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Mar 20, 2025 01:02 PM IST

Brahmanandam On Saptagiri In Pelli Kani Prasad Pre Release Event: సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథఇగా హాజరైన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సప్తగిరి 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడని, ఇన్విటేషన్ లేకుండానే వచ్చినట్లు బ్రహ్మానందం తెలిపారు.

15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు.. 4 మెతుకులు తిని బతుకుతానన్నాడు.. ఇది పవిత్రమైనది.. బ్రహ్మానందం కామెంట్స్
15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు.. 4 మెతుకులు తిని బతుకుతానన్నాడు.. ఇది పవిత్రమైనది.. బ్రహ్మానందం కామెంట్స్

Brahmanandam On Saptagiri In Pelli Kani Prasad Event: సప్తగిరి హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్‌గా చేసింది.

అన్నపూర్ణ, ప్రమోదిని పాత్రలు

అన్నపూర్ణ, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించారు. దిల్ రాజు నేతృత్వంలోని ఎస్‌వీసీ పెళ్లి కాని ప్రసాద్ సినిమాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ బజ్ క్రియేట్ చేసిన పెళ్లి కాని ప్రసాద్ మూవీని మార్చి 21న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ముఖ్య అతిథులుగా

ఈ నేపథ్యంలో మార్చి 20న గ్రాండ్‌గా పెళ్లి కాని ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. పెళ్లి కాని ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చిరంజీవి గారు మొన్న

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. “అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకి రావడానికి ప్రధాన కారణం సప్తగిరి. చిరంజీవి గారు మొన్న బ్రహ్మ ఆనందం ఈవెంట్‌కి ఇన్విటేషన్ లేకుండానే నేనే వస్తానని వచ్చారు. పెద్దవాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇది. రీసెంట్‌గా ఆ విషయం నేర్చుకున్నాను కాబట్టే ఈ వేడుకకి ఏ ఇన్విటేషన్ లేకుండా వచ్చాను” అని తెలిపారు.

పిలుపులు ఉండవు

“తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. తమ్ముడు కంటే ఒక హాస్య నటుడు సినిమా హిట్ కావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇన్విటేషన్ అనేది స్నేహితుల మధ్య జరిగేది. ఆత్మీయులు మధ్య పిలుపులు ఉండవు. ఈ సినిమా కోసం సప్తగిరి చాలా శ్రమ పడ్డాడు. గత 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు” అని బ్రహ్మానందం అన్నారు.

ఇది పవిత్రమైనది

“అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి కనిపించి కనిపించని అందరి దేవుళ్లను మొక్కుకున్నాడు. విజయం సాధిస్తే సినిమాని నమ్ముకుని వచ్చిన నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతాను అని చెప్పాడు. ఈ మాట మీతో పంచుకోవాలని ఈ వేడుకకు వచ్చాను. ప్రేక్షకుల్ని పది కాలాలపాటు నవ్వించాలనే తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడుది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది” అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

మంచి జీవితాన్ని ఇవ్వాలని

“నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఉంది. తనని అప్పా అని పిలుస్తాను. ట్రైలర్‌లో ఆమెని చూశాక ఒక 40 ఏళ్ల జర్నీ గుర్తుకొచ్చింది. పెళ్లి కాని ప్రసాద్ సినిమాని మంచి హిట్ చేసి మంచి హాస్యనటుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన స్పీచ్ ముగించారు.

బ్లెస్ చేసినందుకు

ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారికి మారుతి గారికి హర్షిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా సినిమాని బ్లెస్ చేసినందుకు చాలా థాంక్యూ. మార్చి 21న సినిమా రిలీజ్ కానుంది. అందరూ థియేటర్స్‌లో తప్పకుండా చూడండి” అని పేర్కొన్నారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024