MMTS Rape Attempt: ఎంఎంటిఎస్‌ రైల్లో యువతిపై అత్యాాచార యత్నం, రైల్లోంచి దూకడంతో తీవ్ర గాయాలు…

Best Web Hosting Provider In India 2024

MMTS Rape Attempt: ఎంఎంటిఎస్‌ రైల్లో యువతిపై అత్యాాచార యత్నం, రైల్లోంచి దూకడంతో తీవ్ర గాయాలు…

Sarath Chandra.B HT Telugu Published Mar 24, 2025 08:28 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 24, 2025 08:28 AM IST

MMTS Rape Attempt: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కలకలం రేపింది. శనివారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్ వెళుతున్న రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచార యత్నం చేయడంతో తప్పించుకునేందుకు రైల్లోంచి దూకి తీవ్రంగా గాయపడింది.

ఎంఎంటిఎస్‌ రైల్లో యువతిపై అత్యాచార యత్నం
ఎంఎంటిఎస్‌ రైల్లో యువతిపై అత్యాచార యత్నం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

MMTS Rape Attempt: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ రైల్లో అనంతపురానికి చెందిన యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనతో తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైలు నుంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయపడింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి జరిగింది. యువకుడి నుంచి తప్పిం చుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సెల్‌ఫోన్‌ పాడవడంతో శనివారం ఎంఎంటిఎస్‌ రైల్లో సికింద్రాబాద్‌ వచ్చింది. ఫోన్‌ మరమ్మతు చేయించుకున్న తర్వాత మేడ్చల్‌ వెళ్లేందుకు ఎంఎంటీఎస్‌ రైల్లో బయలుదేరింది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటిఎస్‌ మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న ఇద్దరు మహిళలు అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండటంతో ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకోడానికి కదులుతున్న రైలు నుంచి బయటకు దూకింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆమె ట్రాక్‌ పై పడింది.

కొంపల్లికి సమీప ప్రాంతంలో పట్టాలపై యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 108లో యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి కోలుకున్న తర్వాత ఆమె నుంచి సమాచారం సేకరించారు. 20ఏళ్ల లోపు వయసు ఉన్న యువకుడు దాడి చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Mmts HyderabadHyderabadCrime NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024