Habits For Hair Growth: రూపాయి ఖర్చు లేకుండా జుట్టు పొడవుగా, ఒత్తుగా మారాలంటే రోజూ ఈ 5 పనులు చేయండి!

Best Web Hosting Provider In India 2024

Habits For Hair Growth: రూపాయి ఖర్చు లేకుండా జుట్టు పొడవుగా, ఒత్తుగా మారాలంటే రోజూ ఈ 5 పనులు చేయండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 24, 2025 07:30 PM IST

Habits For Hair Growth: జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? రకరకాల క్రీములు, షాంపులూ వాడినా ప్రయోజనం లేదా? అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి. వీటిని రోజూ చేశారంటే మీరు జుట్టు వద్దన్నా పెరుగుతుంది. ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించడం ఎలా?
జుట్టు రాలడాన్ని తగ్గించడం ఎలా? (Pixabay)

జుట్టు రాలడం అనేది ఈరోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న భయంకరమైన సమస్య. తల దువ్వుకున్న ప్రతిసారి వెంట్రుకలు కుప్పలు కుప్పలుగా రాలడం, చిన్నతనంలోనే బట్టతల రావడం ఇవన్నీ యూత్‌ని బాగా కలవరపెడుతున్నాయి. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు, షాంపూలను ఉపయోగిస్తున్నారు. పార్లర్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఏం చేసినా, ఎన్ని రకాల ప్రొడక్టులు ఉపయోగించినా ఆశించిన ఫలితం కనిపించడం లేదని నిరాశ పడుతున్నారు.

మీరు అలాంటి వారిలో ఒకరైతే, జుట్టు రాలిపోవడం, పలుచగా తయారవడం వంటి సమస్యలు మీకూ ఉంటే, ఈ చిట్కాలను తప్పక ప్రయత్నించండి. వీటిని పాటించారంటే రూపాయి ఖర్చు లేకుండానే ఒత్తైన, పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అందమైన, ఆరోగ్యవంతమైన ఎదుగుదలను దక్కించుకోవచ్చు. ముఖ్యంగా బట్టతల సమస్య రాకుండా చేయచ్చు. ఆడవారికి, మగవారికి, పిల్లలకూ పెద్దలకూ ప్రతి ఒక్కరికీ ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. ప్రసవం తర్వాత జుట్ట రాలడం సమస్య పెరిగిన వారు కూడాఈ చిట్కాలతో జుట్టు ఆరోగ్యాన్ని తిరిగి పొందచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ప్రతి రోజూ 5 రకాల పనులను చేయడం. వీటిని డైలీ అలవాటుగా మార్చుకోవడం.

జుట్టు ఎదుగులను పెంచే 5 రకాల అలవాట్లు..

1. హెయిర్ మసాజ్(Hair Massage):

ప్రతి రోజూ ఒక చోట ప్రశాంతంగా కూర్చుని 5 నిమిషాల పాటు తలకు చక్కగా మసాజ్ చేసుకోండి. ఇందుకోసం మీరు కొబ్బరి నూనె, ఆలోవెరా జుల్, ఆర్గాన్ ఆయిల్ వంటి మీకు నచ్చిన ఏదైనా నూనెను ఉపయోగించవచ్చు. రోజూ తలకు నూనె రాసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే వట్టి చేతులతో కూడా మర్దనా చేసుకోవచ్చు. మసాజ్ చేసే సమయంలో కుదుళ్ల మీద ఒత్తిడి పడకుండా మృదువుగా రెండు చేతులతో చేయండి. ఇలా ప్రతి రోజూ 5 నిమిషాల పాటు తలకు మసాజ్ చేసుకోవడం వల్ల తలపై రక్తప్రసరణ పెరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ బలంగా తయారై జుట్టు పెరుగదల బాగుంటుంది. వెంట్రుకలకు సరైన తేమ అంది మృదువుగా, ఒత్తుగా తయారవుతాయి.

2. హెయిర్ ట్యాపింగ్(Hair Tapping):

హెయిర్ ట్యాపింగ్ అనేది చాలా పాత పద్దతి. అయినప్పటికీ జుట్టు సమస్యలను నయం చేయడంలో ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ప్రతి రోజూ అయిదు నిమిషాల పాటు రెండు చేతులతో మృదువుగా మీ తలను కొట్టుకోవాలి(ట్యాప్ చేయాలి). ఇలా తలంతా సున్నితంగా ట్యాప్ చేసుకోవడం వల్ల తలకు, వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వెంట్రుకల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు సరిగ్గా అంది జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఎదుగుతుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

3. బ్యాక్ కోంబింగ్(Back Combing):

సాధారణంగా మనం తలను నిటారుగా పెట్టుకుని దువ్వుకుంటాం. అలా కాకుండా తలను పూర్తిగా వంచి ఉంచి, వెంట్రుకలన్నింటినీ నేలవైపుకు వేలాడదీసి, దువ్వెనను తల వెనుక నుంచి ముందుకు అంటూ ఉండాలి. దీన్నే బ్యాక్ కోంబింగ్ అంటారు. రోజుకు ఒకసారి ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చాలా సున్నితంగా బ్యాక్ కోంబింగ్ చేయడం అలవాటు చేసుకోండి. చాలా అంటే చాలా సున్నితంగా చేయాల్సి ఉంటుంది(ఏమాత్రం ఒత్తిడి పెంచినా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది).ఇలా సున్నితంగా బ్యాక్ కోంబింగ్ చేయడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

4. హెడ్ డ్రాప్(Head Drop):

హెడ్ డ్రాప్ అనేది ఒక వ్యాయామం. కానీ దీని కోసం మీరు కష్టపడాల్సిన పనే లేదు. ప్రశాంతంగా మంచి మీద పడుకుని శరీరం మొత్తాన్ని మంచి మీదే ఉంచి కేవలం తలను మాత్రం నేల వైపుకు వంచాలి. వెంట్రుకలను నేల మీదకు వేలాడేయాలి. ఇలా రోజూ 5 నిమిషాల పాటు చేశారంటే తలలో రక్తప్రసరణ పెరుగుతుంది. తల కిందికి వంచి ఉంచడం వల్ల శరీరంలోని రక్తం తలకు సరైన విధంతా చేరుతుంది. దీని వల్ల జుట్టు ఎదగడం మాత్రమే కాదు తల, మెదడు, కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.

5. ప్రాణ ముద్ర లేదా పృథ్వీ ముద్ర:

ప్రాణ ముద్ర లేదా పృథ్వీ ముద్ర ఈ రెండింటిలో ఏదో ఒక యోగాసనాన్ని మీరు ప్రతి రోజూ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి శరీరంలో జీవి శక్తిని, రక్తప్రసరణను పెంచుతాయి. జుట్టు ఎదుగుదలకు, ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు అందేలా చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మృదువైన బలమైన వెంట్రులకను మీ సొంతం చేస్తాయి. ఈ ముద్రలను చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024