






Best Web Hosting Provider In India 2024

OTT Thriller Web Series: ఓటీటీలోకి సూపర్ హిట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. ట్రైలర్‌తోనే గూస్‌బంప్స్
OTT Thriller Web Series: ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. సోమవారం (మార్చి 24) రిలీజైన ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గతేడాది రిలీజైన తొలి సీజన్ మంచి థ్రిల్ పంచగా.. ఇప్పుడు రెండో సీజన్ వస్తోంది.

OTT Thriller Web Series: టెర్రరిజం, అండర్ కవర్ ఆపరేషన్ చుట్టూ తిరుగుతూ మంచి థ్రిల్ పంచిన వెబ్ సిరీస్ అదృశ్యం ది ఇన్విజిబుల్ హీరోస్. గతేడాది ఏప్రిల్లో సోనీ లివ్ ఓటీటీలోకి తొలి సీజన్ వచ్చింది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ ను తీసుకొస్తున్నారు. తాజాగా సోమవారం (మార్చి 24) ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ తేదీ కూడా అనౌన్స్ చేశారు.
అదృశ్యం 2 వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్
అదృశ్యం ది ఇన్విజిబుల్ అనేది ఓ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. గూఢచర్యం చుట్టూ తిరిగే కథతో వచ్చి ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. గతేడాది ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు రెండో సీజన్ కూడా సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఏప్రిల్ 4 నుంచి సోనీ లివ్ లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ముప్పు మరింత పెద్దది. మిషన్ చాలా ప్రమాదకరమైనది. దీనికోసం కంటికి కనిపించని హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఐజాజ్ కాన్, పూజా గోర్ లను అదృశ్యం 2లో చూడండి. ఏప్రిల్ 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ ఆ ఓటీటీ ట్రైలర్ రిలీజ్ చేసింది.
అదృశ్యం 2 ట్రైలర్ ఎలా ఉందంటే?
అదృశ్యం 2 ట్రైలర్ లోనే ముగ్గురు ఉగ్రవాదులు కశ్మీర్ సరిహద్దు నుంచి ఇండియాలోకి చొరబడినట్లుగా చూపిస్తారు. వాళ్లు ఈసారి నవంబర్ 26, 2008 కంటే పెద్ద దాడిని చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అలాంటి ఉగ్రవాదుల ఆట కట్టించడానికి ఆ ఇన్విజిబుల్ హీరోలు రంగంలోకి దిగుతారు. ఇండియాలోని ప్రతి నగరంపైనా దాడి చేయడానికి అటు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తుంటారు.
గవర్నర్ హౌజ్, పార్లమెంట్లపై దాడి చేస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ దాడులను ఈ హీరోలు ఆపగలరా? లేదా? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటన్నది ఈ అదృశ్యం 2 వెబ్ సిరీస్ లో చూడొచ్చు. కొత్తగా ఆరు ఎపిసోడ్లు ఏప్రిల్ 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి.
అదృశ్యం వెబ్ సిరీస్ గురించి
అదృశ్యం ది ఇన్విజిబుల్ హీరోస్ పేరుతో గతేడాది ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఐజాజ్ ఖాన్, దివ్యాంకా త్రిపాఠీ లీడ్ రోల్స్ లో నటించారు. అన్షుమన్ కిశోర్ సింగ్ డైరెక్ట్ చేశాడు. రవి వర్మ, పార్వతి సెహగల్ అనే ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్ల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
వీళ్లు భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పని చేస్తూ.. వాతావరణ శాఖలో అండర్ కవర్ ఏజెంట్లుగా ఉంటారు. దేశ పౌరులను ఉగ్రవాద చర్యల నుంచి రక్షించడమే వీళ్ల పని. తొలి సీజన్ లోనే ఇలాంటి ఆపరేషన్లను చేసిన ఆ ఇద్దరూ.. ఇప్పుడు రెండో సీజన్లో మరిన్ని కొత్త సవాళ్లతో రాబోతున్నారు.
సంబంధిత కథనం