చంద్రబాబుకు పల్లెల్లో తిరిగే అర్హతే లేదు..!

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి: చంద్రబాబుకు పల్లెల్లో తిరిగే అర్హతే లేదని రాష్ట్ర అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్, వైయ‌స్‌ఆర్‌సీపీ రైతువిభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిపై ఏనాడైనా కనీసం ఆలోచన చేశావా చంద్రబాబూ..? అంటూ నిల‌దీశారు. రాష్ట్ర అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్, వైయ‌స్‌ఆర్‌సీపీ రైతువిభాగం అధ్యక్షులు   ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పల్లెల్లో తిరిగే అర్హత చంద్రబాబుకు లేదుః
చంద్రబాబును ఒక గ్రామీణ ప్రాంత రైతుగా ప్రశ్నిస్తున్నాను. మీరు 14 ఏళ్ల అధికారంలో ఉండగా హైదరాబాద్‌ను నేనే ప్రపంచ పటంలో పెట్టాను.. సెల్‌ఫోన్‌ కనిపెట్టాను.. ఐటీ తెచ్చానని, సైబరాబాద్‌ ఏర్పాటు చేశానని చెప్పుకోవడమే గానీ..  ఏరోజైనా ఒక పల్లెటూరు గురించి ఆలోచన చేశారా..? గ్రామ ప్రగతి గురించి ప్రణాళికలు రచించారా..? పల్లెల్లో ఉండే రైతు ఆత్మగౌరవం గురించి ఏరోజైనా మీకు తెలుసుకోవాలనే ఆలోచన కలిగిందా..? ఇప్పుడు మీరు మన గ్రామం.. ఆత్మగౌరవం పేరిట జిల్లాల్లో పర్యటనకు బయల్దేరుతానంటున్నారు కదా..? అసలు, మీకు పల్లెల్లో తిరిగే అర్హత ఉందా..?

బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి..ః
మీరు మీ గ్రామానికి వెళతారో.. లేదా ఏ గ్రామానికి వెళతారో వెళ్ళి, అక్కడ మొట్టమొదటగా ఆ గ్రామ రైతుల్ని కలిసి మాట్లాడండి.. మీరు  ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్లల్లో నాలుగున్నరేళ్లపాటు వృద్ధాప్య పింఛన్‌ రూ.1000 ఇచ్చానా..? లేదంటే, మీ పింఛన్‌ను పెంచానా..? లేదంటే, కొత్త పింఛన్‌ లు ఏమైనా ఇచ్చానా..? అని ప్రశ్నించండి. ఎందుకంటే, చంద్రబాబు హయాంలో కొత్త పింఛన్‌ కావాలంటే అప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న వాళ్లల్లో ఒకరు చనిపోతేనే వస్తుంది. అదేవిధంగా జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో పింఛన్‌ల పంపిణీ వ్యవస్థ ఎలా మారింది..? రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్‌ అందిస్తూ.. ఏడాదికేడాదికి పింఛన్‌ పెరిగిందా.. లేదా..? అని రైతు కుటుంబాల్ని, వృద్ధులను చంద్రబాబు అడగాల్సిందిగా కోరుతున్నాను. పరిపాలనను గ్రామాల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ మీ పరిపాలనలో ఏమైనా అమలైందా..? అని అడగండి. మీ గ్రామానికి, మీ ఇంటికి ఏరోజైనా ప్రభుత్వ మేలును అందించేందుకు అధికారులొచ్చిన సందర్భాన్ని ఆలోచన చేశానా..? ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న సచివాలయ వ్యవస్థ ఎలా వచ్చింది..? నేను తెచ్చానా.. జగన్‌మోహన్‌రెడ్డి గారు తెచ్చారా..? నాడు –నేడు కార్యక్రమం ద్వారా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యలో సమూల మార్పులు చేసింది జగన్‌గారి ప్రభుత్వమా..? కాదా..? నేనున్నప్పుడు కనీసం ప్రభుత్వ పాఠశాల గోడకు సున్నమైనా వేశానా..? విద్యార్థినులకు కనీసం బాత్రూం సదుపాయం అయినా ఏర్పాటు చేశానా..? అని గ్రామాల్లో ప్రజలను చంద్రబాబు ఆరాతీయాలని మనవి చేస్తున్నాను. అలాగే, జగనన్న ఆరోగ్యసురక్ష, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, చేయూత, ఆసరా.. వంటి కార్యక్రమాల్ని నేనెప్పుడైనా అమలు చేశానా..? అని చంద్రబాబు గ్రామాల ప్రజల్ని అడిగి తనకు తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి.

2014 మేనిఫెస్టోను చిత్తుకాగితం చేసింది నువ్వుకాదా..?
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం సంకల్పాన్ని మదిలో పెట్టుకుని విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మరి, నువ్వు ఏనాడైనా అలాంటి పేదలకు మేలుకరమైన నిర్ణయాల్ని తీసుకున్నావా..? ఎన్నికలొస్తున్నాయనగా, ఆఖరున  ఒకట్రెండు నెలలపాటు అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ఖాతాల్లో రూ.2వేల మాత్రమే వేశాను గానీ.. జగన్‌ గారు అధికారంలోకి వచ్చాక రైతుభరోసా పేరిట ప్రతి ఏటా మీ ఖాతాల్లో డబ్బు జమచేశాడా ..? లేదా.? అని రైతుల్ని అడగండి. 2014 ఎన్నికల మీ మ్యానిఫెస్టోను చూపించి.. అందులో ఉన్న హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందా..? లేదా..? అని ఎవరినైనా అడగండి. ఆనాడు నేను మ్యానిఫోస్టోలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా.. టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి కూడా ఆ మ్యానిఫెస్టోను తొలగించానా…లేదా..? అని మీకుమీరు ప్రశ్నించుకోండి. వీటన్నింటిపై మీరు వాస్తవాల్ని తెలుసుకోని ప్రజల మైండ్‌సెట్‌ ఏంటో అర్ధం చేసుకోవాలని చంద్రబాబుకు హితవు చెబుతున్నాను.
– అధికారంలో ఉండగా, రాష్ట్రంలోని ఎంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారో.. ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకో చంద్రబాబూ..? అదే గ్రామాల్లో జగన్ గారి ప్రభుత్వంలో అర్హులైనవారందరికీ ఇంటిస్థలం పంపిణీ చేశారా..లేదా..? ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం పూర్తయి కొలిక్కివచ్చాయని నిజాల్ని ఒప్పుకునే దమ్ముందా..? అని సవాల్‌ విసురుతున్నాను. గ్రామాల్లోకి వెళ్లి పెయిడ్‌ ఆర్టిస్టుల్ని పెట్టుకుని అహంకారంతో విర్రవీగకుండా.. జగన్‌ గారి పాలనలో ప్రజల మేలుపై వాస్తవాల్ని గ్రహించాలని కోరుతున్నాను.

బాబు హయాంలో ‘పల్లె కన్నీరు పెట్టింది..
గోరేటి వెంకన్న ‘పల్లెకన్నీరు పెడుతుంది..’ అనే పాట ఎవరినుద్దేశించి పాడారో.. ఒక్కసారి చంద్రబాబు గుర్తుచేసుకోవాలి. ఆయన ఆ పాట రాయడంలో, పాడటంలోనూ అంతరార్థం మీ దుర్మార్గ పరిపాలనను ఎండగట్టమేనని గ్రహించాలి. వైఎస్ఆర్ గారు ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే, కరెంటు తీగలమీద బట్టలారేసుకోండని మీరు చాలా అహంకారంతో మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతాయన్నారు. విద్యుత్‌ఛార్జీలపై ఉద్యమించిన రైతులపై బషీర్ బాగ్‌లో కాల్పులు చేయించావు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారనుకుని మీరు గ్రామాలకు బయల్దేరుతున్నారు కనుక వారందర్నీ మీ పాలనపై, జగన్‌గారి నాలుగున్నరేళ్ల పాలనపై.. అంతకు ముందు ఐదేళ్ల మహానేత వైఎస్‌ఆర్‌ పాలనపై ప్రశ్నలడిగి వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. గతంలో మీ పాలనలో ప్రజలెదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలపై  మీకు ప్రజలు తప్పకుండా తగిన బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను.

కృష్ణా, గోదావరి డెల్టాలో తుపాను ముందస్తు చర్యలుః
ఈ ఏడాది ఖరీఫ్‌లో అదృష్టవశాత్తూ కృష్ణాగోదావరి డెల్టాలో ధాన్యం బ్రహ్మండంగా పండింది. ఎకరాకు 38 బస్తాల నుంచి 45 బస్తాల మధ్యలో దిగుబడులొచ్చాయి. 2019–20లో జగన్‌గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది ధాన్యం దిగుబడులు బాగా పెరిగాయి. రైతులకు లబ్ధికలగాలంటే సాగువిస్తీర్ణం పెరగ్గానే సరిపోదు. పంట దిగుబడులు పెరగాలి. ఆమేరకు ఈ ఏడాది కూడా పంట దిగుబడులు పెరిగాయి. ధాన్యానికీ మంచి ధర మార్కెట్‌లో ఉంది. బిపీటీ సన్నబియ్యం ధర రూ.1700 నుంచి రూ.1750 దాకా నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. రైతులు సంతోషంగా కోతలు మొదలుపెట్టే సమయానికి దురదృష్టవశాత్తూ మిగ్‌జాం తుపాను ప్రభావం చూపింది. కృష్ణాగోదావరి డెల్టా రైతుల ఆశలపై ఈ తుపాను నీళ్లుజల్లడం చాలా బాధాకరం. కోతలప్పుడు తుపానులు సంభవిస్తే రైతులకు ఎంతగానో మానసిక సంఘర్షణ కలుగుతుందన్నది వాస్తవం. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుపాను మొదలైన రోజునుంచే జిల్లాలకు ప్రత్యేకాధికారుల్ని నియమించి ఎప్పటికప్పుడు రైతుల్ని అప్రమత్తం చేసి, పంటధాన్యం కాపాడే జాగ్రత్తలు ముందుగానే తీసుకుంది.

రోజుకు 45వేల టన్నులకు తగ్గకుండా ఆన్‌లైన్‌లో ధాన్యం సేకరణః
కోతలు కోసిన రైతులు ధాన్యం విషయంలో నష్టపోకుండా.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఈనెల మూడోతేదీన తుపాను మొదలైనప్పటికీ, నాలుగు, ఐదు, ఆరు తేదీల్లోనూ ఒక పక్క వర్షాలు కురుస్తున్నా ఆన్‌లైన్‌లో రోజుకు 45వేల టన్నులకు తగ్గకుండా ధాన్యం సేకరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లోనూ ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఏదేఏమైనా ప్రకృతి విపత్తుల్లోనూ రైతులు నష్టపోకుండా వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను.

పంటల నష్టపరిహారంపై చంద్రబాబు విషప్రచారం
రైతుల్ని ఆపదలో ఆదుకునే విషయంలో మహానేత వైఎస్‌ఆర్‌ గారు తర్వాత, వారి తనయులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందంజలో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల్లో ఆత్మస్థైర్యం కలిగించాలే గానీ వారిలో ఆందోళన కలిగించే అంశాలపై విషప్రచారం రాజకీయ నేతలకు ఏమాత్రం సబబుకాదు. చంద్రబాబు తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టపరిహారంపై మాట్లాడుతూ.. తాను తిత్లీ తుపానప్పుడు హెక్టారుకు రూ.20వేల చొప్పున వరికి నష్టపరిహారం ఇవ్వాలని జీవో ఇచ్చినట్లు చెబుతున్నాడు. నిజానికి, తిత్లీలో నష్టపోయిందంతా ఉద్దానం ప్రాంతంలో ఉద్యానవన పంటలు మాత్రమే గానీ అప్పట్లో వరి పెద్దగా నష్టపోలేదు. అంటే, మీరు నష్టపోని పంటకు హెక్టారుకు రూ.20వేలు ఇచ్చామని.. దాన్నే ప్రస్తుతం అమలు చేయాలనడం చాలా విడ్డూరంగా ఉంది.  ఆనాడు చంద్రబాబు ఆదుకోకపోతే.. తిత్లీలో నష్టపోయిన ఉద్యానవన పంటల రైతులకు జగన్‌మోహన్‌రెడ్డి గారు అధికారంలోకొచ్చాక రూ.182.63 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేశారు.

ఎల్లోమీడియా పిచ్చిరాతలు సరికాదుః
2018–19లో ఖరీఫ్‌లో 345 కరువు మండలాలు, అదే రబీలో 257 కరువు మండలాల్ని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఆయన అధికారం ఉన్నప్పుడు ఆ కరువు మండలాల్లో ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించకుండా ఎగ్గొట్టాడు. అదే జగన్‌ గారి ప్రభుత్వం వచ్చాక ఏ పంట నష్టపోతే.. ఆ పంట కాలం ముగిసేలోగా హెక్టారుకు రూ.17వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తోంది. కనుక, ఎల్లోమీడియా చంద్రబాబుకు భజనచేస్తూ.. ఆయన హయాంలో ఎగ్గొట్టిన వాటిని, ఇవ్వని పరిహారాన్ని వదిలేసి జగన్‌ గారి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలకు ఒడిగడుతున్నాయి. ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు కూడా వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. అంతేగానీ, బాధల్లో ఉన్న రైతుల ఆత్మగౌవరం దెబ్బతీసే విధంగా కథనాల్ని అల్లి ప్రచారంలోకి తీసుకురాకూడదని హెచ్చరిస్తున్నాను.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *