




ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.02-9-2022(శుక్రవారం) ..
నందిగామ లో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి ..
గాంధీ సెంటర్ లో మహానేత విగ్రహానికి – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కులమతాలకు తావివ్వకుండా, తన మన భేదం చూపకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ..
ఆరోగ్యశ్రీ పథకం తో నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి ప్రజల హృదయాల్లో ఆరోగ్య ప్రదాతగా నిలిచిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ..
రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ,ఆరోగ్యశ్రీ ,108- 104 ,వృద్ధాప్య ,వితంతు ,వికలాంగ పెన్షన్ సౌకర్యం కల్పించిన తెలుగు వారి గుండె చప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ..
తండ్రికి తగ్గ తనయుడిగా నేడు గొప్ప సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ , పట్టణ పార్టీ అధ్యక్షులు ,నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..