




ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు(పెద్దాపురం) ..
కంచికచర్ల నుంచి పెద్దాపురం వరకు నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారి పనులను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పరిశీలించారు ,ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా పెద్దాపురం గ్రామంలో నిర్మించిన సిసి రోడ్డు లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచికచర్ల నుంచి పెద్దాపురం వరకు నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని , రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా కాంట్రాక్టర్లు జాగ్రత్త వహించాలని ,గ్రామాల పరిధిలో నిర్మించనున్న సిసి రోడ్ల పనులలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రోడ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని ,నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ , గ్రామ సర్పంచ్ ,మండల పార్టీ అధ్యక్షులు ,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..