


Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 10th Episode యామినికి హ్యాండ్ ఇచ్చిన రాజ్- ఒకే గదిలో కావ్య, రామ్- భార్యాభర్తలుగా కల్యాణం- రుద్రాణి పంచ్
Brahmamudi Serial April 10th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 10 ఎపిసోడ్‌లో గుడిలో కావ్యను చూసిన యామిని రాజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. కానీ, యామినికే హ్యాండ్ ఇచ్చి కావ్యను కలుసుకుంటాడు రాజ్. ఒకే గదిలో కావ్య, రామ్ ఇరుక్కుపోతారు. అందులో సీతారాముల కల్యాణాన్ని దంపతులుగా కలిసి చేస్తారు.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో కావ్యను చూసిన యామిని ఎలాగైనా రాజ్‌ను తీసుకుని వెళ్లాలని అంటుంది. రామ్‌ను ఇక్కడికి తీసుకురావడానికి ఎంత కన్విన్స్ చేశాం. ఇప్పుడు వెళ్లిపోదాం అంటే ఏమనుకుంటాడు అని వైధేహి అంటుంది.
ఎక్కడైనా దేవుడే కదా
ఇప్పుడు రామ్ అనుకోవడం ముఖ్యం కాదు. వెళ్లడం ముఖ్యమని యామిని అంటుంది. రాజ్‌తో అత్తాపూర్‌లో శ్రీరామ నవమి గ్రాండ్‌గా జరుగుతుందట. అక్కడికి వెళ్దాం. అక్కడ మనకు తెలిసినవాళ్లు ఉన్నారు. ఇలా దూరంగా కాకుండా ముందు వరుసలో కూర్చోబెడతారట అని యామిని చెబుతుంది. దాందేముంది, దేవుడు ఎక్కడైనా దేవుడే కదా. ఇక్కడే ఉందాం అని రాజ్ అంటాడు. మనం వచ్చేదాకా వాళ్లు కల్యాణం జరిపించరట. వాళ్లు అంత అభిమానం చూపిస్తుంటే ఎలా కాదనగలం అని యామిని చెబుతుంది.
ఇంతసేపు కళావతి కోసం వెయిట్ చేశాను. కనిపించింది, సంతోషించేలోపు యామిని ఏంటీ ఇలా అంటుంది. ఇప్పుడు వెళితే కళావతిని మిస్ అవుతాను అని రాజ్ అనుకుంటాడు. చాలా దూరంగా ఉన్నాం. రాలేమని చెప్పండి అని రాజ్ అంటాడు. వాళ్లు మనకు చాలా కావాల్సినవాళ్లు, మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పూజారులే చేయిస్తారు. మనకు వాళ్లకు మంచి సంబంధాలు ఉన్నాయని యామిని తల్లిదండ్రులు అంటారు.
దాంతో యామిని వాళ్లు వెళ్తారు. మీరు ముఖద్వారం దగ్గర ఉండండి నేను పార్కింగ్‌లో ఉన్న కారు తీసుకొస్తాను అని రాజ్ చెబుతాడు. దాంతో యామిని వెళ్లిపోతున్నారు. కావ్యతో రాజ్ మాట్లాడాలని అనుకుంటాడు. కానీ, వాళ్ల ఇంట్లోవాళ్లు ఏమనుకుంటారో అని తను వచ్చేవరకు వెయిట్ చేస్తాననుకుంటాడు. కావ్యను నమ్మడానికి వీళ్లేదు బావను తీసుకొస్తాను అని యామిని వెళ్తుంది. రాజ్ ఎదురుచూస్తుంటే రుద్రాణి అటు ఇటు తిరుగుతుంటుంది.
స్టోర్ రూమ్‌లోకి
రుద్రాణి గారు బయటే ఉన్నారు. ఒకవేళ ఆయన్ను చూస్తే అని బయటకు వస్తుంది కావ్య. యామినిని చూసి రాజ్ దాక్కుంటాడు. అప్పుడే అటువైపు చూస్తుంది రుద్రాణి. రాజ్ కోసం యామిని, యామిని దూరంగా రాజ్, రుద్రాణి, రాజ్ ఎక్కడున్నారో అని కావ్య వెతుక్కుంటూ ఉంటారు. ఇంతలో కావ్యను చూసి పరుగెత్తుకుంటూ వెళ్తాడు రాజ్. కానీ, అటు నుంచి యామిని రావడంతో అయ్యో ఇటు రండి అని గుడి స్టోర్ రూమ్‌లోకి తీసుకెళ్తాడు రాజ్.
ఈయన ఇంకా వెళ్లలేదా. వెళ్లిపోయారనుకున్నానే. హో యామినికి హ్యాండ్ ఇచ్చి నన్ను కలవడానికి వచ్చారా. ఇక్కడ ఫ్యామిలీకి ఎక్కడ ఎదురుపడతారో అని టెన్షన్ పడుతుంటే నాకు సైట్ కొట్టడానికి వచ్చారా. చెబుతా మీ సంగతి అని కావ్య మనసులో అనుకుంటుంది. ఏంటండి మీ ఉద్దేశం. ఇలా చేయి పట్టుకుని గదిలోకి తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారండి అని కావ్య దబాయిస్తుంది. అంటే మీ ఇంట్లో వాళ్లు చూస్తే ఇబ్బంది అన్నారుగా. అందుకే కాస్తా ఇలా పక్కకు తీసుకొచ్చాను అని రాజ్ అంటాడు.
ఇంతలో పూజారి వచ్చి దీనికి లాక్ వేయలేదేంటీ అని ఆ స్టోర్ రూమ్‌కు తాళం వేసి వెళ్లిపోతాడు. ఇలా చేయి పట్టుకుంటే పురాణాల్లో పాణిగ్రహణం అంటారు. అంటే సగం పెళ్లి అయిపోయినట్లు. మావాళ్లు ఇది చూస్తే మావాళ్లు అలాగే అనుకుంటారుగా అని కావ్య అంటుంది. మీవాళ్లు అంత పాతకాళం మనుషులని తెలియదండి అని రాజ్ అంటాడు. దాంతో కావ్య గొడవపడుతుంది. మీరు చాలా సాఫ్ట్ అని రాజ్ అంటే.. నేను అమాయకురాలని, ఈజీగా మోసం చేయొచ్చు అనేగా ఇలా తీసుకొచ్చారు అని కావ్య అంటుంది.
మీతో ఉండాల్సి వచ్చింది
వామ్మో మీకు దండం పెడతాను. నేను వెళ్లిపోవడమే మంచిది అని రాజ్ డోర్ తీస్తే రాదు. బయట ఎవరో గడి పెట్టినట్లున్నారు అని రాజ్ అంటాడు. దాంతో అమ్మో.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒగ గదిలో ఉంటే నలుగురు ఏమనుకుంటారు. అక్కడ శ్రీరాములవారి కల్యాణం జరుగుతుంది. దానికోసం ఎంతో కష్టపడ్డాను. తీరా చూస్తే ఇలా గదిలో మీతో ఉండాల్సి వచ్చిందని కావ్య అంటుంది. రామయ్య, క్షమించయ్యా, మీ కల్యాణం చూడలేకపోతున్నా అని కావ్య మొరపెట్టుకుంటుంది.
అయ్యో కళావతి గారు మనసుంటే మార్గం ఉంటుంది అని అక్కడ ఉన్న వస్తువులు చూస్తాడు రాజ్. ఆ రాముల వారి దగ్గరికి మీరు వెళ్లడం కాదు ఆయనే మీ దగ్గరికి వస్తారు అని కళ్లు మూసుకోమంటాడు రాజ్. దాంతో కావ్య కళ్లు మూసుకుంటుంది. గదిలో ఉన్న రాముల వారి ఫొటో, పూలు, ఇతర వస్తువులతో కల్యాణంకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు రాజ్. కావ్యను కళ్లు తెరవమంటాడు రాజ్. దాంతో కళ్లు తెరిచిన కావ్య తెగ సంతోషిస్తాడు.
ఆ రాములవారు సతీసమేతంగా మీ ముందుకు వచ్చారు. ఇక కల్యాణం జరిపించడమే. అక్కడ పంతులు గారు కల్యాణం జరిపిస్తుంటే.. ఇక్కడ మీరు జరిపించండి అని రాజ్ చెబుతాడు. కావ్య కూర్చుని రాజ్‌ను కూడా కూర్చోమంటుంది. ముందు వద్దన్నా రాజ్ తర్వాత కూర్చుంటాడు. అటు దుగ్గిరాల ఫ్యామిలీ, ఇటు రాజ్ కావ్య భార్యాభర్తలుగా శ్రీరాముడి కల్యాణం జరిపిస్తారు. సరిగ్గా కల్యాణం జరిగే సమయానికి కావ్య ఎక్కడికి వెళ్లిందని అపర్ణ అడుగుతుంది.
ఎక్కడికైనా వెళ్లారా
అక్షింతలు ఇవ్వడానికి వెళ్లినట్లుంది. వస్తుందని అప్పు చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన యామిని వాళ్లతో కావ్య లేకపోవడం చూసి షాక్ అవుతుంది. అంటే, బావ, కావ్య కలిసి ఎక్కడికైనా వెళ్లారా అని కంగారుగా బయటకు వెళ్తుంది. రాజ్ కావ్య దంపతుల్లా కల్యాణం జరిపిస్తారు. దానికి కావ్య చాలా సంతోషిస్తుంది. ఇలానే ఆయనకు గతం గుర్తుకువచ్చి ఎప్పుడు నా పక్కనే ఉండేలా చేయు స్వామి అని కావ్య మొక్కుకుంటుంది.
ఎవరీవిడ, నా గతంలో ఉందా. ఎందుకు పదే పదే నాకు తనను చూడాలనిపిస్తుంది. ఎలాగైనా తనెవరో నాకు తెలిసేలా చేయు స్వామి అని రాజ్ కోరుకుంటాడు. కల్యాణం ఇద్దరు జరిపిస్తారు. కళావతి గారు మీరు హ్యాపీనా అని రాజ్ అడిగితే.. కావ్య చాలా హ్యాపీ అంటుంది. ఇంతలో పూజారి వచ్చి డోర్ లాక్ తీస్తాడు. రాజ్, కావ్య బయటకు వస్తారు. అది చూసి పంతులు షాక్ అవుతాడు. మీరేంటీ లోపల అని అడుగుతాడు. తాళాలు వేసేటప్పుడు చూసుకోరా. లోపల ఎవరున్నారో చూసుకోకుండా వేయడమేనా అని రాజ్ అంటాడు.
మీరెందుకు లోపలికి వెళ్లారు అని పంతులు అడిగితే.. చూసుకోని వేయండి అని రాజ్, కావ్య సైలెంట్‌గా బయటకు వెళ్లిపోతారు. బయటకు రాగానే యామినిని చూసి కారు తీసుకొస్తానని చెప్పి కళావతితో ఉన్నా. ఇప్పుడు యామిని చూస్తే గొడవ అవుతుందని రాజ్ యామిని దగ్గరికి వెళ్తాడు. ఏంటీ బావ కారు తెస్తానని చెప్పి గుడిలోకి వచ్చావని యామిని అడుగుతుంది. ఇందాక కూర్చున్నప్పుడు కారు కీస్ మర్చిపోయాను. కల్యాణం జరుగుతున్నప్పుడు వెళ్లొద్దని పంతులు ఆపేశారు అని రాజ్ అంటాడు.
హారతి ఇచ్చే టైమ్‌కి
నేను కల్యాణం దగ్గరికి వచ్చానే. నాకు ఎక్కడ కనిపించలేదు అని యామిని అంటే.. రాజ్ ఏదోటి కవర్ చేస్తాడు. పంతులు హారతి ఇచ్చే టైమ్‌కు కావ్య వెళ్తుంది. ఎక్కడికి వెళ్లావ్ అని కావ్యను అడుగుతుంది అపర్ణ. దేనికైనా అదృష్టం ఉండాలిగా అని రుద్రాణి అంటే.. కళ్లారా చూశాను, మనసారా ఆనందించాను. ఆ సీతారాముల వారి పెళ్లి సాక్షిగా మా ఆయన కచ్చితంగా తిరిగి వస్తారని నాకు నమ్మకం ఇచ్చారు అని కౌంటర్ వేస్తుంది కావ్య.
మహానుభావుల మాటే అనుకున్నా.. నీలాంటి వాళ్ల మాటలు కూడా అర్థం కావట్లేదు అని రుద్రాణి పంచులు వేస్తుంది. రాజ్ కారులో జీపీఎస్ పెట్టినట్లు యామిని చెబుతుంది. కావ్య ఆఫీస్‌కు రాజ్ కారు వెళ్లడం చూసి యామిని షాక్ అవుతుంది. మరోవైపు ఆఫీస్‌కు వచ్చిన రాజ్‌ను చూసి కావ్య కంగారుపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం