




Best Web Hosting Provider In India 2024

Jaat Twitter Review: జాట్ ట్విట్టర్ రివ్యూ – తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ మూవీ హిట్టా? ఫట్టా?
Jaat Twitter Review: సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ మూవీ జాట్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్ స్టైల్ మాస్ మసాలా కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?

Jaat Twitter Review: సన్నీడియోల్ హీరోగా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ మూవీ జాట్ ఏప్రిల్ 10న (నేడు) థియేటర్లలోకి వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రెజీనా, సయామీఖేర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ బాలీవుడ్ మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
యాక్షన్, ఎలివేషన్లు…
జాట్ … టిఫికల్ సౌత్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని బాలీవుడ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. ఎమోషన్స్, కథ కంటే యాక్షన్, ఎలివేషన్లను నమ్ముకొనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించాడంటూ కామెంట్స్ చేస్తోన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని అంటున్నారు.
ఫైట్స్ ఈ మూవీకి ప్లస్‌తో పాటు మైనస్‌గా మారాయని చెబుతోన్నారు. కొన్ని చోట్ల కథలో బలవంతంగా యాక్షన్ సీక్వెన్స్‌లను ఇరికించిన ఫీలింగ్ కలుగుతుందని కామెంట్లు పెడుతోన్నారు.
టాలీవుడ్ ఫ్లేవర్…
జాట్ మూవీ ప్రతి ఫ్రేమ్‌లో టాలీవుడ్ ఫ్లేవర్ కనిపిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలా కాకుండా తెలుగు డబ్బింగ్ మూవీని చూస్తున్నట్లుగా అనిపిస్తుందని అన్నాడు. రొటీన్ స్టోరీతో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడని, బాలీవుడ్‌కు ఈ కాన్సెప్ట్ కొత్త అయినా….తెలుగులో మాత్రం ఇలాంటి మాస్ మసాలా సినిమాలు చాలానే వచ్చాయని ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే యావరేజ్ అని చెబుతోన్నారు.
పైసా వసూల్ మూవీ…
సన్నీడియోల్ అభిమానులను మాత్రం జాట్ మెప్పిస్తుందని, వారికి ఫుల్ పైసావసూల్ మూవీ ఇదని మరో నెటిజన్ పేర్కొన్నాడు. సినిమా రన్‌టైమ్ రెండున్నర గంటల పైనే ఉండటం కూడా మైనస్‌గా మారిందని చెబుతోన్నారు. యాక్షన్ సన్నివేశాలకు తమన్ఇచ్చిన బీజీఎమ్ మాత్రం బాగుందనే అంటున్నారు.
వంద కోట్ల బడ్జెట్…
జాట్ మూవీలో రణదీప్ హుడా విలన్‌గా నటించాడు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు కోట్లకుపైనే జరిగాయి. ఫస్ట్ డే ఈ మూవీ పది కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
సంబంధిత కథనం