




Best Web Hosting Provider In India 2024

నాని నటించిన ఆ సినిమా చాలా ఇష్టం.. అతడితో కలిసి మూవీ చేయాలనుంది: పూజా హెగ్డే
Pooja Hegde: టాలీవుడ్ హీరో నానితో కలిసి నటించాలని ఉందని పూజా హెగ్డే చెప్పారు. నాని చేసిన చిత్రాల్లో తనకు ఏది ఎక్కువ ఇష్టమో తెలిపారు.
తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే నటించిన ‘రెట్రో’ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు పూజా. ఈ క్రమంలో టాలీవుడ్‍లో ఇంకా ఏ హీరోతో కలిసి నటించాలని అనుకుంటున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఆమె స్పందించారు.
నానితో చేయాలనుకుంటున్నా
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‍గా కొన్నేళ్లు కొనసాగారు పూజా హెగ్డే. అయితే, ఆచార్య తర్వాత తెలుగులో మళ్లీ హీరోయిన్‍గా చేయలేదు. గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న తర్వాత మరే తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. హిందీ, తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. కాగా, రెట్రో ప్రమోషన్ల కోసం హాజరైన పూజా హెగ్డేకు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్‍లో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారని క్వశ్చన్ వచ్చింది. దీనికి ‘నాని’ అని చెప్పారు పూజా. నానితో కలిసి ఏదో ఒక రోజు పని చేసేందుకు ఇష్టపడుతున్నానని తెలిపారు.
నాని చిత్రాల్లో ఇష్టమైనది..
నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రాల్లో ఏది ఎక్కువ నచ్చిందనే ప్రశ్న కూడా పూజాకు ఎదురైంది. తనకు ‘నిన్నుకోరి’ సినిమా చాలా ఇష్టమని పూజా హెగ్డే చెప్పారు. ఆ మూవీలో నాని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు.
2017లో రిలీజైన నిన్నుకోరి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వంవ వహించారు. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించడమే కాకుండా ప్రశంసలు దక్కించుకుంది. ఎమోషనల్ సీన్లలో నాని నటన మరింత మెప్పించింది.
నేచురల్ లుక్‍లో పూజా
రెట్రో సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లోనే కనిపించనున్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్లో పూజా లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌గా నటించారు సూర్య. లవ్ స్టోరీ కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.
తాను ఓ తెలుగు చిత్రానికి ఓకే చెప్పానని పూజా ఇటీవలే తెలిపారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు చెప్పలేదు. రెట్రో ప్రమోషన్ ఇంటర్వ్యూలో పూజా స్టెప్స్ వేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, బాక్సాఫీస్ వద్ద రెట్రో, హిట్ 3 పోటీ ఉండనుంది. నాని హీరోగా నటించిన హిట్ 3 కూడా మే 1నే విడుదల కానుంది. ఈ చిత్రం తమిళ డబ్బింగ్‍లోనూ రిలీజ్ అవుతుంది. రెట్రో కూడా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ పోటీ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.
కాగా, దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జయనాయగన్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‍గా చేస్తున్నారు. రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంలో స్పెషల్ సాంగ్‍లో చిందేయనున్నారు. కాంచన 4లోనూ ఈ బుట్టబొమ్మ నటించనున్నారు. తెలుగులోకి మళ్లీ ఎప్పుడు రీ-ఎంట్రీ ఇస్తారో చూడాలి.
సంబంధిత కథనం