




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హాలీవుడ్ బోల్డ్ మూవీ.. ఇంటెర్న్‌తో లేడీ సీఈవో శృంగారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Bold: బేబీగర్ల్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ హాలీవుడ్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం నాలుగు భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది.
నికోల్ కిడ్మన్, హారిస్ డికిన్సన్ ప్రధాన పాత్రలు పోషించిన బేబీగర్ల్ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. ఈ బోల్డ్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ గతేడాది డిసెంబర్లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి హలీనా రెజిన్ దర్శకత్వం వహించారు. ఈ బేబీగర్ల్ సినిమా ఇప్పుడు ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
స్ట్రీమింగ్ వివరాలివే.. తెలుగులోనూ..
బేబీగర్ల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలలకు ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది.
బేబీగర్ల్ సినిమాలో నికోల్, హారిస్‌తో పాటు ఆంటోనీ బాండెరస్, సోఫీ వైల్డ్, ఎస్తేర్ మెక్‌గ్రెగోర్, వాన్ రీలీ, విక్టర్ స్లెజాక్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెలీనా రెజిన్.. బోల్ట్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఎరోటిక్ సీన్లు ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయి.
ఇంటెర్న్‌తో సీఈవో రొమాంటిక్ ఎఫైర్
పెద్ద కంపెనీకి సీఈవో అయిన మహిళ.. తన కంటే వయసులో చిన్నవాడైన ఇంటెర్న్‌తో ఎఫైర్ పెట్టుకోవడం చుట్టూ బేబీగర్ల్ మూవీ సాగుతుంది. న్యూయార్క్ సిటీలోని ఓ పెద్ద కంపెనీకి సీఈవోగా ఉంటుంది రోమీ మాథిస్ (నికోల్ కిడ్మన్). అయితే, తన భర్త జాకోబ్ (బాండెసరస్)తో తన శృంగార జీవితంపై నిరాశగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ కంపెనీలో సామ్యుయెల్ (హారిక్ డికిన్సన్) ఓ ఇంటెర్న్‌గా చేరతాడు. ఈ క్రమంలో సామ్యుయెల్‌తో రొమాంటిక్ రిలేషన్ పెట్టుకుంటుంది రోమీ. తన కంటే వయసులో చిన్న వాడైన సామ్యుయెల్‌తో తరచూ శృంగారంలో పాల్గొంటుంది. దీంతో రోమీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? రోమీ, సామ్యుయెల్ ఎఫైర్ ఏ పరిస్థితులకు దారితీసింది? అనే అంశాలు బేబీగర్ల్ సినిమాలో ఉంటాయి.
బేబీగర్ల్ చిత్రం 20 మిలియన్ డాలర్లతో రూపొందగా.. సుమారు 64.4 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ మూవీని డేవిడ్ హినోజోసా, హలీనా రెజిన్, జులియా ఓహ్ ప్రొడ్యూజ్ చేశారు. క్రిస్టోబాల్ తాపియా డేవీర్ మ్యూజిక్ ఇచ్చారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో గత శుక్రవారం (ఏప్రిల్ 18) ఖౌఫ్ అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చింది. మోనికా పవర్, రజత్ కపూర్ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్‌కు పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం