




Best Web Hosting Provider In India 2024

OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. వరుసగా అమ్మాయిల మరణాలు.. మిస్టరీ ఏంటి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Mystery Thriller: ఓటీటీలోకి ‘అయ్యన మనే’ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. ఓ భవనంలో మిస్టరీతో సిరీస్ సాగనుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడొస్తుందంటే..
కన్నడ నటి ఖుషి రవి ప్రధాన పాత్ర పోషించిన అయ్యన మనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ కన్నడ సిరీస్‍కు రమేశ్ ఇందిర దర్శకత్వం వహించారు. రీసెంట్‍గా వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
అయ్యన మనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కన్నడలో రూపొందిన ఈ సిరీస్ ఇతర భాషల డబ్బింగ్‍లోనూ వస్తుందేమో చూడాలి.
అయ్యన మనే స్టోరీలైన్
1990ల బ్యాక్‍డ్రాప్‍లో అయ్యన మనే వెబ్ సిరీస్ సాగుతుంది. చిక్కమాగళూరూలోని ఓ పూర్వికుల భవనంలో అయ్యన మనే కుటుంబం ఉంటుంది. ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన ముగ్గురు అమ్మాయిలు వరుసగా మరణిస్తారు. వారు చనిపోయిన విషయాన్ని ఆ కుటుంబం దాచేస్తుంది. పెళ్లి చేసుకొని అదే ఇంటికి కోడలిగా వస్తుంది జాజీ (ఖుషీ రవి). అనుమానాస్పదంగా చనిపోయిన అమ్మాయిల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజాలను బయటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయిలు ఎందుకు చనిపోయారు? ఈ మిస్టరీని జాజీ ఛేదిస్తుందా? అనే విషయాలు అయ్యన మనే సిరీస్‍లో ఉంటాయి.
అయ్యన మనే సిరీస్‍లో ఖుషీ రవితో పాటు అక్ష్య నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్, రమేశ్ ఇందిర కీలకపాత్రలు పోషించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్ రమేశ్ ఇందిర. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్‍ను శృతి నాయుడు నిర్మించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ సిరీస్‍ను జీ5లో చూడొచ్చు.
జీ5 ఓటీటీలో గత వారం కింగ్‍స్టన్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. థియేటర్లలో మార్చి 7న రిలీజైన ఈ మూవీ పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. జీ5 ఓటీటీలో తమిళం, తెలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.
సంబంధిత కథనం