Janhvi Kapoor Period: మగాళ్లకు పీరియడ్స్ వస్తే న్యూక్లియర్ వార్ జరుగుతుందేమో.. జాన్వీ కపూర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Janhvi Kapoor Period: మగాళ్లకు పీరియడ్స్ వస్తే న్యూక్లియర్ వార్ జరుగుతుందేమో.. జాన్వీ కపూర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Janhvi Kapoor About Period Pain: జాన్వీ కపూర్ మగాళ్లకు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుందో చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అమ్మాయిల పీరియడ్స్ గురించి, దాంతో వచ్చే నొప్పి గురించి చులకనగా, వెటకారంగా మాట్లాడే వారికి కౌంటర్ ఇస్తూ రామ్ చరణ్ పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ ఇలా కామెంట్స్ చేసింది.

మగాళ్లకు పీరియడ్స్ వస్తే న్యూక్లియర్ వార్ జరుగుతుందేమో.. జాన్వీ కపూర్ కామెంట్స్

Janhvi Kapoor About Period Pain: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో కథానాయికగా చేస్తోంది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కూడా సినిమాలతో బిజీగా ఉంది.

పీడకలలాగే ఉంటుంది

అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పీరియడ్స్ పెయిన్ గురించి జాన్వీ కపూర్ మాట్లాడింది. పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పి ఓ పీడకలలాగే ఉంటుందన్న జాన్వీ కపూర్ అవే పీరియడ్స్ మగాళ్లకు వస్తే న్యూక్లియర్ వార్ జరుగుతుందేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అమ్మాయిల పీరియడ్స్ పెయిన్ గురించి చులకనగా, వెటకారంగా మాట్లాడే వారికి కౌంటర్ ఇస్తూ ఇలాంటి కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్.

కోపగించుకోవడం మానేయండి

“పీరియడ్స్ గురించి, ఆ సమయంలో వచ్చే నొప్పి, మూడ్ స్వింగ్స్ గురించి నేను వాదిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ, నా వరకు ఇది చాలా పెద్ద విషయం. అమ్మాయిలు కాస్తా చిరాకుగా ఉన్నారంటే వాళ్లనం కోపగించుకోవడం, తిట్టడం మానేయండి. వారి శారీరక పరిస్థితి ఎలా ఉందో ఓసారి ఆలోచించండి” అని జాన్వీ కపూర్ కోరింది.

కాస్తా సమయం ఇవ్వండి

“అమ్మాయిలు కోపంలో ఏదో అన్నారని వారిపై వెంటనే అరవకుండా వాళ్లు కుదురుకోడానికి కాస్తా సమయం ఇవ్వండి. పీరియడ్స్ వచ్చాయా, కాస్తా సమయం కావాలా అని అడిగితే వారు చెప్పకపోవచ్చు. అయితే దాని గురించి వారు ఏం చెప్పకపోవచ్చు. కానీ, మీరు ఓ నిమిషం టైమ్ ఇవ్వండి. ఎందుకంటే అమ్మాయిల్లో హార్మోనుల ప్రభావం, వారు అనుభవించే బాధ మగాళ్లకు అంత తేలికగా అర్థం కాదు” అని జాన్వీ కపూర్ చెప్పింది.

అస్సలు తట్టుకోలేరు

“కానీ, ఒక్క విషయం మాత్రం నేను పక్కాగా చెప్పగలను. ఆడవాళ్ల పీరియడ్స్ గురించి మగాళ్లు వెటకారంగా మాట్లాడుతారు, జోక్స్ వేస్తారు. కానీ, వాళ్లకు అదే నొప్పి ఉంటే ఈ పీరియడ్స్‌ను ఒక్క నిమిషం కూడా మగళ్లారు భరించలేరు. ఆ పెయిన్, మూడ్ చేంజ్, చిరాకును ఏమాత్రం తట్టుకోలేరు. ఒకవేళ మగాళ్లకు పీరియడ్స్ వస్తే న్యూక్లియర్ వార్ (అణుబాంబు యుద్ధం) కూడా జరుగుతుందేమో ఎవరికి తెలుసు” అని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

జాన్వీ కపూర్ సినిమాలు

ఇదిలా ఉంటే, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. తొలి టాలీవుడ్ మూవీ దేవరతో మంచి క్రేజ్ తెచ్చుకున్న జాన్వీ కపూర్ హిందీలో సన్నీ సంస్కారీకి తులసి కుమారి, పరమ్ సుందరి సినిమాలతో బిజీగా ఉంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024