ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. ఆ టీమ్ తో పోరుపై అనుమానాలు!

Best Web Hosting Provider In India 2024


ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. ఆ టీమ్ తో పోరుపై అనుమానాలు!

ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ సంఘం అధికార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

హెట్ మయర్, ధ్రువ్ జురెల్ (AFP)

ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధికార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సీజన్ లో లక్నో చేతిలో రాజస్థాన్ కావాలనే ఓడిందనేలా ఆయన కామెంట్లు ఉన్నాయి.

ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ ఐపీఎల్ 2025 మ్యాచ్ లో రాజస్థాన్ తరపున అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డు నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39) రాణించడంతో 181 పరుగుల ఛేదనలో 17 ఓవర్లకు రాజస్థాన్ 156/2తో నిలిచింది.

18 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో ఎనిమిది వికెట్లతో ఉన్న రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందనిపించింది. కానీ ఆ తర్వాత అంతా రివర్సైంది. లాస్ట్ ఓవర్లో హెట్ మయర్, ధ్రువ్ జురెల్ లాంటి బ్యాటర్లున్నా ఆ టీమ్ 9 పరుగులు కూడా చేయలేకపోయింది. హెట్ మయర్ ను ఔట్ చేసిన అవేశ్ ఖాన్ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడింది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.

పిల్లలు కూడా చెప్తారు

ఐపీఎల్ 2025లో లక్నోతో రాజస్థాన్ మ్యాచ్ పై జైదీప్ బిహానీ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారని న్యూస్ 18 రాజస్థాన్ ఛానెల్ వెల్లడించింది. పిల్లలు చూసినా ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో అర్థమవుతుందని, లాస్ట్ ఓవర్లో అంత తక్కువ పరుగులు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అని జైదీప్ చెప్పారని న్యూస్ 18 పేర్కొంది.

ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్

జైపూర్ లో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో రాజస్థాన్ క్రికెట్ సంఘం, జిల్లా పరిషత్ మధ్య విభేధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

“రాజస్థాన్‌ క్రికెట్ సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార కమిటీని నియమించింది. దీన్ని అయిదో సారి పొడిగించారు. మేము అన్ని పోటీలు ఎలాంటి సమస్యలు లేకుండా జరిగేలా చూస్తాం. కానీ ఐపీఎల్ వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ బరిలో దిగుతుంది. మొత్తం జిల్లా పరిషత్ మాత్రమే చూసుకుంటోంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం నుంచి మాకు ఏంఓయూ లేదని వాళ్లు చెబుతున్నారు. ఏంఓయూ లేకపోతే ఏంటీ? ప్రతి మ్యాచ్ కు జిల్లా పరిషత్ కు మీరు చెల్లిస్తున్నారు కదా’’ అని జైదీప్ ప్రశ్నించారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link