పిల్లలను సమ్మర్ క్యాంప్స్‌లో చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Best Web Hosting Provider In India 2024

పిల్లలను సమ్మర్ క్యాంప్స్‌లో చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Ramya Sri Marka HT Telugu

పిల్లల్ని సమ్మర్ క్యాంప్‌కి పంపాలని చూస్తున్నారా? ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఐడియా! అక్కడ పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తారు.కొ త్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. అయితే ఏ క్యాంప్‌ పడితే ఆ క్యాంప్‌కి పంపకూడదని గుర్తుంచుకోండి! కొన్ని విషయాలు చెక్ చేసుకుని, జాగ్రత్తలు తీసుకుని వారిని పంపించాలి. అవేంటంటే..

సమ్మర్ క్యాంప్ వల్ల కలిగే ప్రయోజనాలు

వేసవి సెలవులు రానే వచ్చాయ్. పిల్లలు ఏం చేయాలో తెలియక రోజంతా టీవీ చూస్తూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు. వారి కోసం ఏం చేయాలో, వారిని ఎలా ఆడించాలో అర్థం కాక తల్లిదండ్రులు తల పట్టుకుని కూర్చుంటారు. ఇకపై నో మోర్ బోర్ కొట్టడం! మీ పిల్లలకు ‘లెజెండరీ’ ఎక్స్‌పీరియన్స్‌ కలిగించే బెస్ట్ ఐడియాను మీ కోసం మేం పరిచయం చేస్తున్నాం. అదే సమ్మర్ క్యాంప్!

సమ్మర్ క్యాంప్స్ లో ఏమేం ఉంటాయి?

సమ్మర్ క్యాంప్స్ అంటే ఇది కేవలం కొన్ని రోజులు ఆడుకోవడం, తినడం, పడుకోవడం మాత్రమే. అదెలాగూ ఇంట్లో చేసేదే కదా ఎందుకు మనీ, టైం రెండూ వేస్ట్ చేసుకోవడం అని చాలా మంది తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. ఈ ఆలోచన చాలా తప్పు. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అలా లేవు. ఇప్పుడివి చాలా అప్‌డేట్‌గా ఉంటున్నాయి. ఈ క్యాంప్స్ మీ పిల్లలకు కేవలం హాలిడేస్ ఎంజాయ్ చేసే ప్లేస్‌ మాత్రమే కాదు, వాళ్ల లైఫ్‌లో ఒక వైల్డ్ అడ్వెంచర్ లాంటిది,కంప్లీట్ గేమ్ చేంజర్ లాంటివి. ఇక్కడ మీ పిల్లలు రకరకాల మనుషుల్ని కలుస్తారు, వాళ్లతో రియల్ కనెక్షన్స్ ఏర్పరుచుకుంటారు.

అంతేకాదు సమ్మర్ క్యాంప్స్ వల్ల స్పోర్ట్స్, ఆర్ట్స్, సైన్స్, నేచర్… ఇలా ఒకటేమిటి, బోలెడు కొత్త స్కిల్స్‌ని అన్‌లాక్ చేసుకునే ఛాన్స్ మీ పిల్లలకు దరుకుతుంది. అన్నింటిని కన్నా ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే.. మీ పిల్లలు స్క్రీన్ టైమ్‌కి ‘పర్మానెంట్ బ్రేక్’ పడుతుంది. ఆన్ లైన్ ఫ్రెండ్‌షిప్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బదులుగా ఆఫ్ లైన్ ఫ్రిండ్ షిప్, ఆక్టివిటీస్ వారిలో డెవలప్ అవుతాయి. మొత్తం మీద సమ్మర్ క్యాంప్స్ వల్ల మీ పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ రాకెట్‌లా దూసుకుపోతుంది! అన్నీ తెలుసుకున్నాక మీ పిల్లలకు కూడా సమ్మర్ క్యాంప్స్ లో చేర్చాలని అనిపిస్తుంది కదా. మంచి ఆలోచన.

తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:

అయితే మీ పిల్లలను సమ్మర్ క్యాంప్స్ లో చేర్చాలంటే, అక్కడ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే కొన్నివిషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ క్యాంప్ ట్రస్టెడ్ ది, ఎక్కడ సేఫ్టీ లెవెల్ బాగుంటాయి.. మీ పిల్లల వైబ్‌కి ఏది బాగా సూట్ అవుతుంది… ఇలాంటివన్ మీరు ముందే తెలుసుకోవాలి. సమ్మర్ క్యాంప్ అంటే జస్ట్ ఫన్ మాత్రమే కాదు, మీ పిల్లల ఫ్యూచర్‌కి ఒక ‘సూపర్ బూస్ట్’! కాబట్టి దీన్ని ఎలా ఎంచుకోవాలో, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

సమ్మర్ క్యాంప్ వల్ల కలిగే ప్రయోజనాలు:

సోషల్ స్కిల్స్ అప్ అవుతాయి:

రకరకాల మనుషులతో కలిసి తిరగడం, మాట్లాడటం, ఆడటం వల్ల అందిరితో బాగా కలిసిపోవడం నేర్చుకుంటారు. పిల్లలు సూపర్ ఫ్రెండ్లీగా తయారవుతారు!

టీమ్ వర్క్ అంటే ఏంటో తెలుస్తుంది:

కలిసి ఏదైనా టాస్క్ చేయడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఇది వాళ్లకు లైఫ్‌లో చాలా యూజ్ అవుతుంది.

కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది:

అమ్మనాన్న పక్కన లేకపోయినా వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం, డిసిషన్స్ తీసుకోవడం వారికి అలవాటవుతుంది. దీని వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

కొత్త స్కిల్స్ అన్‌లాక్:

స్పోర్ట్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, నేచర్ ట్రిప్స్ ఇలా చాలా ఉంటాయి. వాళ్లకు ఇష్టమైనది ఏదో వారికి అర్థం అవుతుంది. దేంట్లో వారు క్లిక్ అవుతారు మీకు కూడా అర్తం అవుతుంది.

ఫిట్‌గా,హెల్తీగా ఉంటారు:

ఆడుకోవడం, పరిగెత్తడం వల్ల మీ పిల్లలు ఫిట్‌గా తయారవుతారు. ఫోన్ పట్టుకుని కూర్చోవడం కంటే ఇది చాలా బెటర్ కదా!

ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్:

చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకుంటారు. లైఫ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్.

నేచర్‌తో కనెక్షన్:

కొన్ని క్యాంప్స్ నేచర్ దగ్గర ఉంటాయి. అప్పుడు చెట్లు, పుట్టలు అంటే ఏంటో తెలుస్తుంది. ఎన్విరాన్‌మెంట్‌ను లవ్ చేయడం నేర్చుకుంటారు.

స్క్రీన్ టైమ్‌కి బ్రేక్:

ఫోన్లు, ట్యాబ్‌లకు దూరంగా ఉంటారు. ఇది వాళ్ల ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు చాలా మంచిది.

గుర్తుండిపోయే మెమొరీస్:

కొత్త ఫ్రెండ్స్, ఫన్ మూమెంట్స్… ఇవన్నీ వాళ్లకు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి.

సమ్మర్ క్యాంప్‌కి పంపే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. క్యాంప్ బ్యాక్‌గ్రౌండ్, సేఫ్టీ రూల్స్:

క్యాంప్ ఎవరు రన్ చేస్తున్నారు, వాళ్ల ఎక్స్‌పీరియన్స్ ఏంటి, సేఫ్టీకి ఏం చూసుకుంటున్నారు (ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారా, ఫస్ట్ ఎయిడ్ ఉందా, ఎమర్జెన్సీ ప్లాన్స్ ఉన్నాయా) మొత్తం తెలుసుకోండి.

2. స్టాఫ్ ఎంతమంది, పిల్లలు ఎంతమంది?:

తక్కువ పిల్లలకు ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే మంచిది. చిన్న పిల్లలైతే ఇంకా కేర్ తీసుకోవాలి కదా!

3. మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా?:

క్యాంప్‌లో డాక్టర్ లేదా నర్స్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. మీ పిల్లలకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే (అలెర్జీలు, మెడిసిన్స్) వాళ్లకు చెప్పి జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి.

4. ఫుడ్, వాటర్ ఎలా ఉన్నాయి?:

ఫుడ్ నీట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. పిల్లలకు తాగడానికి మంచి నీళ్లు అందుబాటులో ఉండాలి.

5. పడుకునే ప్లేస్ సేఫ్‌గా ఉందా?:

ఓవర్ నైట్ క్యాంప్ అయితే, పిల్లలు పడుకునే రూమ్స్ సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా ఉండాలి.

6. యాక్టివిటీస్ సేఫ్‌గా ఉన్నాయా?:

స్పోర్ట్స్, వాటర్ గేమ్స్ ఏమైనా ఉంటే, వాటికి కావలసిన సేఫ్టీ గేర్ ఇస్తున్నారా, ట్రైన్డ్ వాళ్లు చూసుకుంటున్నారా లేదా అడపాదడపా వాళ్లతో మేనేజ్ చేస్తున్నారా? చెక్ చేయండి.

7. మీ పిల్లలతో మాట్లాడండి:

క్యాంప్‌కి వెళ్లడానికి వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారో అడగండి. ఏమైనా భయాలు ఉంటే వాటిని పోగొట్టండి. అక్కడ ఎలా ఉండాలో చెప్పండి. వారికి ఇష్టం లేకపోతే బలవంతంగా పంపకండి. వారిలో ఆసక్తి కలిగించిన తర్వాత పంపండి.

8. క్యాంప్‌ను ఒకసారి చూడండి (పాజిబుల్ అయితే):

క్యాంప్‌ ఎలా ఉందో డైరెక్ట్‌గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది.లేదంటే పేపర్స్ అన్ని జాగ్రత్తగా చదివిన తర్వాతే వాటి మీద సైన్ చేయండి. క్యాంప్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్‌గా చదవండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి.

9. బట్టలు, అవసరమైన వస్తువులు:

క్లైమేట్‌కు తగ్గ బట్టలు, సన్‌స్క్రీన్, క్యాప్, మస్కిటో రిపెల్లెంట్ లాంటివి పిల్లలకు ఇచ్చి పంపండం మర్చిపోకండి.

ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే, మీ పిల్లలకు సమ్మర్ క్యాంప్ ఒక సూపర్ ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది! వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు, లైఫ్‌లో ముందుకు వెళ్లడానికి ఇది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024