





Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ మూవీ.. గుండెను బరువెక్కించేలా సాగే చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT: నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ ఎమోషనల్ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
లెజండరీ డైరెక్టర్ భారతీ రాజా ప్రధాన పాత్ర పోషించిన ‘నిరమ్ మారుమ్ ఉలగిల్’ చిత్రం ఈ ఏడాది మార్చి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ ఎమోషనల్ ఆంథాలజీ డ్రామా చిత్రానికి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. గుండెను బరువెక్కించేలా భావోద్వేగాలతో ఈ చిత్రం సాగుతుంది. థియేట్రికల్ రన్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని సన్నెక్స్ట్ నేడు (ఏప్రిల్ 22) అధికారికంగా ప్రకటించింది.
ఎమోషనల్గా..
పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు, కుటుంబంలోని బంధాలు, భావోద్వేగాలు, అనుకోని పరిస్థితుల చుట్టూ నిరమ్ మారుమ్ ఉలగిల్ చిత్రం సాగుతుంది. ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉంటాయి. అన్నీ ఎమోషనల్గా సాగుతాయి. హృదయానికి తాకేలా భావోద్వేగంగా చిత్రం ఉంటుంది.
నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాలో భారతీ రాజాతో పాటు రియోరాజ్, యోగిబాబు, నాటీ సుబ్రమణియం, సాండీ మాస్టర్, విజ్ఞేశ్ కాంత్, రాశికాంత్, కనిహ, వాడివుక్కరసి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని డైరెక్టర్ బ్రిట్టో జేబీ ఎమోషనల్గా, అనుకున్న విధంగా కథలను తెరకెక్కించారు. భారతీరాజా నటన ఈ మూవీకి ఓ హైలైట్గా నిలిచింది.
నిరమ్ మారుమ్ ఉలగిల్ చిత్రాన్ని సిగ్నేచర్ ప్రొడక్షన్స్, జీఎస్ సినిమాస్ ఇంటర్నేషన్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి. దేవ్ ప్రకాశ్ రేగన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ చిత్రానికి మల్లిక అర్జున్, మణికంద రాజా సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడొచ్చు.
ఈవారమే ప్రైమ్ వీడియోలో వీర ధీర శూరన్
తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వీర ధీర శూరన్ పార్ట్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారమే స్ట్రీమింగ్కు రానుంది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 24వ తేదీన ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు రానుంది. ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ కొట్టింది.
సంబంధిత కథనం