




Best Web Hosting Provider In India 2024

TS Inter results 2025 : ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్‌లో ములుగు, మేడ్చల్ జిల్లాలు.. లాస్ట్‌లో కామారెడ్డి, మహబూబాబాద్!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతంలో.. ములుగు, మేడ్చల్ జిల్లాలు టాప్‌లో నిలిచాయి. కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలు లాస్ట్‌లో ఉన్నాయి. తాజా ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఫలితాలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ములుగు, మేడ్చల్ జిల్లాలు టాప్‌లో నిలిచాయి. అలాగే కామారెడ్డి మహబూబాబాద్ జిల్లాల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది.
సెకండ్ ఇయర్..
సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు 81.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 80.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో ఈ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మేడ్చల్ జిల్లాలో 77.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరం ఫలితాల్లో ఈ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక కామారెడ్డి జిల్లాలో కేవలం 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి లాస్ట్‌లో ఉంది.
ఫస్ట్ ఇయర్..
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాల్లో 77.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 76.36 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 70.52 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక మహబూబాబాద్ జిల్లాలో కేవలం 48.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఈ జిల్లా లాస్ట్‌లో ఉంది.
బాలికలదే పైచేయి..
ఓవరాల్‌గా మొదటి సంవత్సరం ఫలితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండవ సంవత్సరం ఫలితాల్లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి బాలురు కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 22 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు వెల్లడించింది.
కనీసం 35 శాతం..
ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. రెండు సంవత్సరాలకు మొత్తంగా 1000 మార్కులకు 350 మార్కులు సాధించాలి. బ్లైండ్, డెఫ్, డంబ్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు 25 శాతంగా నిర్ణయించారు.
గ్రేడింగ్ సిస్టమ్..
A1: 91-100 మార్కులు
A2: 81-90 మార్కులు
B1: 71-80 మార్కులు
B2: 61-70 మార్కులు
C1: 51-60 మార్కులు
C2: 41-50 మార్కులు
D1: 35-40 మార్కులు
F: 35 మార్కుల కంటే తక్కువ (ఫెయిల్)
సంబంధిత కథనం
టాపిక్