





Best Web Hosting Provider In India 2024

Romantic Thriller OTT: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ – ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్
OTT: తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్రేమ దేశపు యువరాణి థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.య ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్రేమదేశపు యువరాణి థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సోమవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. సాయిసునీల్ నిమ్మల దర్శకత్వం వహించారు.
పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజు…
పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సాయిసునీల్ నిమ్మలకు డైరెక్టర్‌గా ప్రేమ దేశపు యువరాణి సెకండ్ మూవీ. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ మూవీని రిలీజ్ చేశారు. ముక్కోణపు ప్రేమకథకు ఓ థ్రిల్లర్ ఎలిమెంట్‌ను జోడించి ఈ సినిమా రూపొందింది. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
భద్రకాళి ఎవరు…
చెర్రీ బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ పూర్తిచేయడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఎలాంటి బరువుబాధ్యతలు లేకుండా జాలాయిగా తిరుగుతుంటాడు. తొలిచూపులోనే శ్రావణి అనే అమ్మాయిని చెర్రీ ఇష్టపడతాడు. ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెడతాడు. తాను రవి అనే మరో యువకుడిని ప్రేమిస్తున్నట్లు చెర్రీతో చెబుతుంది శ్రావణి.
మరోవైపు అమలాపురంలో వీరయ్య అనే రౌడీ మనుషులు వరుసగా చనిపోతుంటారు. వీరయ్య కొడుకు భైరవ్ కూడా దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? చెర్రీని ఇష్టపడ్డ వైష్ణవి అతడి ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? నిజంగానే రవిని శ్రావణి ప్రేమించిందా? వీరయ్య మనుషులపై పగను పెంచుకున్న భద్రకాళి ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
ఐఎమ్‌డీబీలో..,.
ఐఎమ్‌డీబీలో పదికిగాను ప్రేమదేశపు యువరాణి మూవీ 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు అజయ్ పట్నాయక్ మ్యూజిక్ అందించాడు.
రెడ్డిగారింట్లో రౌడీయిజం…
ప్రేమ దేశపు యువరాణితో పాటు తెలుగులో రెడ్డిగారింట్లో రౌడీయిజం, ప్రేమసాగరం, జాగ్రత్త బిడ్డ తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది ప్రియాంక రేవ్రి. హిందీలో కొన్న లో బడ్జెట్ మూవీస్‌లో కథానాయికగా కనిపించింది. ప్రేమదేశపు యువరాణి కంటే ముందే డైరెక్టర్ సాయిసునీల్ నిమ్మల వాడేనా అనే సినిమా తెరకెక్కించాడు.