





Best Web Hosting Provider In India 2024

Tasty Teja: యాక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ టేస్టీ తేజ – లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా 6జర్నీ
Tasty Teja: బిగ్‌బాస్ సీజన్ 8 ఫేమ్ టేస్టీ తేజ యాక్టర్‌గా మారాడు. 6 జర్నీ పేరుతో ఓ మూవీ చేశాడు. రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ టేస్టీ తేజ యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. 6 జర్నీ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో టేస్టీ తేజతో పాటు రవిప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, పల్లవి, రమ్యారెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బసీర్ ఆలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల 6 జర్నీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
గోవా ట్రిప్…
ఆరుగురు స్నేహితులు కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఈ జర్నీలో వారికి ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి? వారి ప్రాణాలు తీయాలని అనుకున్నది ఎవరు? ఈ స్నేహ బృందాన్ని శ్రీ రాముడు ఎలా రక్షించాడు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్‌లో చూపించారు. లవ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు అంతర్లీనంగా శ్రీరాముడి గొప్పతనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు.
టేస్టీ తేజ ఎనర్జీ…
దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ‘హీరో సమీర్‌తో పాటు రవిప్రకాష్ పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయి. టేస్టి తేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ సింహా మంచి పాటలు ఇచ్చారు. సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం అన్నారు.
విభిన్నమైన లవ్, యాక్షన్ థ్రిల్లర్‌గా 6 జర్నీ మూవీ ఆకట్టుకుంటుందని హీరో సమీర్ పేర్కొన్నారు. మాస్, క్లాస్‌తో పాటు సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు.
ఫుల్ లెంగ్త్ రోల్…
టేస్టీ తేజ మాట్లాడుతూ ‘‘ ఫస్ట్ టైమ్‌ఫుల్ లెంగ్త్ రోల్‌లో నేను నటించిన మూవీ ఇది. ఈ ప్రయాణాన్ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశామంటే కారణం డైరెక్టర్ బసీర్. నటుడిగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందనే నమ్మకముంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు.
రెండు సీజన్స్‌లో..
టేస్టీ తేజ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7తో పాటు సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సీజన్ 7లో 9వ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్‌లో టాప్ టెన్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచాడు. 90వ రోజు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
సంబంధిత కథనం