



Best Web Hosting Provider In India 2024
‘‘పో.. వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పు’’.. కశ్మీర్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదుల సందేశం
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య భారీగా ఉంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటివరకు 20 మంది వరకు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, కాల్పులు జరిపిన అనంతరం, బాధితులతో ఉగ్రవాదులు.. ‘‘పో.. వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పు’’ అన్నారు.
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పహల్గామ్ లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది పర్యాటకులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. టూరిస్టులపై కాల్పులు జరిపిన తరువాత ఉగ్రవాదులు.. బాధితులతో.. వెళ్లి ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలని అన్నారని ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక పౌరులు క్షతగాత్రులకు సహాయం చేశారు. కశ్మీర్ పర్యటనకు వచ్చిన హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
కర్నాటక వ్యాపారవేత్త మృతి
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ ఈ ఉగ్రదాడిలో మృతి చెందాడు. అతని భార్య పల్లవి ఈ దాడి గురించి వివరిస్తూ, కాల్పులు జరిపిన అనంతరం, ఉగ్రవాదులు ఈ విషయాన్ని వెళ్లి మోదీతో చెప్పాలని ఆదేశించారని ఆమె చెప్పారు. తమ చిన్న కుమారుడితో కలిసి బైసరన్ ప్రాంతాన్ని సందర్శించిన కర్ణాటక వ్యాపారవేత్త మంజునాథ్ భార్య పల్లవి ఆ భయానక అనుభవాన్ని ఈ విధంగా వివరించారు. ‘‘నేను, నా భర్త, మా అబ్బాయి ముగ్గురం కశ్మీర్ వెళ్లాం. ఇది మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగిందని నేను అనుకుంటున్నాను. మేము పహల్గాంలో ఉన్నాము. నా కళ్లముందే నా భర్తపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దాడి జరిగిన వెంటనే స్థానిక పౌరులు తనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముగ్గురు స్థానికులు నన్ను రక్షించారు’’ అని పల్లవి తెలిపారు. దాడి చేసిన వారు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆమె చెప్పారు. ‘‘ముగ్గురు, నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. నేను వారికి చెప్పాను – నన్ను కూడా చంపండి, మీరు ఇప్పటికే నా భర్తను చంపారు. దానికి సమాధానంగా వారిలో ఒకడు ‘నేను నిన్ను చంపను. ఈ విషయాన్ని వెళ్లి మోదీకి చెప్పు అన్నాడు’ అని ఆమె వివరించారు.
మాదే బాధ్యత అన్న రెసిస్టెన్స్ ఫ్రంట్
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి బాధ్యత తమదేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. చుట్టుపక్కల దట్టమైన పైన్ అడవుల నుంచి ఉగ్రవాదులు బయటకు వచ్చి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని, దీంతో తీవ్ర భయాందోళనలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం.
భద్రతాదళాల స్పందన
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సైన్యం, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో సహా భద్రతా దళాలు ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేగంగా గాలింపు చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాఫ్టర్ ను రంగంలోకి దింపగా, కొందరు బాధితులను స్థానికులు గుర్రాలపై మైదాన ప్రాంతాల నుంచి తరలించారు. కట్టుదిట్టమైన భద్రత, భద్రతపై ఆందోళన మధ్య పర్యాటక వాహనాలు ఆ ప్రాంతాన్ని వీడటం కనిపించింది.
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన రాజకీయ నేతలు
ఈ ఘటనను దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడిని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడినవారిని జంతువులుగా అభివర్ణించారు. ప్రస్తుతం జెడ్డాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ దాడిని ఖండిస్తూ భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి శ్రీనగర్ బయలుదేరారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link