జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Best Web Hosting Provider In India 2024


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Anand Sai HT Telugu

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2 మే 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ (Unsplash )

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులై టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులలో చోటు దక్కించుకున్న వారు ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ సంస్థలలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లాగిన్ అవ్వవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు, విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, కేటగిరీ సర్టిఫికేట్(వర్తిస్తే), ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 2 మే 2025గా నిర్ణయించారు.

ఫీజు వివరాలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025కి దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.3200గా నిర్ణయించారు. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,600గా ఉంది. అలాగే దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించాలి.

పరీక్ష తేదీ

ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షను ఐఐటీ కాన్పూర్ మే 18న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యేందుకు సరిగ్గా నమోదు చేసుకున్న దరఖాస్తుదారులందరికీ మే 11న అడ్మిట్ కార్డు జారీ చేస్తారు. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోగలరు.

పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. ప్రతి పేపర్ మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి.

ఎలా అప్లై చేయాలి?

1. ముందుగా జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inకి వెళ్లండి.

2. తర్వాత హోమ్‌పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఇక్కడ అడిగిన అవసరమైన వివరాలను పూరించి, ఫారమ్‌ను పూర్తి చేయండి.

4. చివరగా నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

5. భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.

Anand Sai

eMail

టాపిక్


Best Web Hosting Provider In India 2024


Source link