





Best Web Hosting Provider In India 2024

కాకరకాయ ఇలా వండారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, రెసిపీ అదిరిపోతుంది
మీరు స్టఫ్డ్ కాకరకాయను ఇలా వండారంటే చాలా రుచిగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో స్టఫ్డ్ మసాలా ఉంటుంది, రుచి అదిరిపోతుంది. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.
కాకరకాయను చూడగానే ప్రతి ఒక్కరికీ చిరాకు. దాన్ని తినేందుకు ఇష్టపడరు. పెద్దయ్యాక డయాబెటిస్ వచ్చినవారు మాత్రం కాకర కాయను ఎక్కువగా తింటూ ఉంటారు. కాకరకాయను అనేక విధాలుగా తయారు చేస్తారు, కాని చాలా మంది స్టఫ్డ్ కాకరకాయను ఇష్టపడతారు. ఇది తయారు చేయడానికి తక్కువ సమయమే పడుతుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కాకరకాయ వేపుడు రెసిపీ ఎలాగోె తెలుసుకోండి.
స్టఫ్డ్ కాకరకాయ వేపుడు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కాకరకాయ – అర కిలో
ఉల్లిపాయ – రెండు
ఆవనూనె – రెండు స్పూన్లు
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
పసుపు – పావు స్పూను
ధనియాల పొడి – పావు స్పూను
వేయించిన సోంపు – సోంపు
వేయించిన జీలకర్ర – అర స్పూను
ఎండుమిర్చి – నాలుగు
ఆమ్చూర్ పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పంచదార – అర స్పూను
కాకరకాయ వేపుడు రెసిపీ
- కాకరకాయను శుభ్రంగా కడిగి ఉప్పునీటిలో కాసేపు ఉంచాలి.
- ఇప్పుడు దాన్ని తొక్క తీసి చిన్న చిన్న గుండ్రని ముక్కలుగా కట్ చేసి గింజలను తీసేయాలి.
- ఇప్పుడు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- సమాన పరిమాణంలో కాకరకాయ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- ఆ తర్వాత కాకరకాయ, ఉల్లిపాయలను కలిపి నీళ్లలో 2 నిమిషాలు మరిగించాలి.
- కాకరకాయ మెత్తగా అయ్యాక మంట ఆపి చల్లారనివ్వాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేయాలి.
- కొద్దిగా పసుపు కలపాలి. ఇప్పుడు ఉడికించిన కాకరకాయ, ఉల్లిపాయలు వేసి కలపాలి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి.
- ఇప్పుడు అందులో వేయించిన సోంపు, జీలకర్ర వేయాలి.
- ధనియాల పొడి, ఎండుమిర్చి వేసి కలపాలి.
- ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్ పొడి కలపాలి.
- ఇప్పుడు కూరగాయలను నూనెలో బాగా వేయించాలి.
- అందులో కొద్దిగా పంచదార కలపండి . అంతే టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ అయినట్టే.
కాకరకాయతో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఆప్షన్. ఇక్కడ చేసినట్టు చేస్తే వారికి ఎంతో మేలు చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్