కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప‌కు శౌర్య‌ గ్రాండ్‌ వెల్క‌మ్- జ్యోత్స్న‌ చీటింగ్ -శ్రీధ‌ర్‌కు కావేరి ప‌నిష్‌మెంట్‌

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప‌కు శౌర్య‌ గ్రాండ్‌ వెల్క‌మ్- జ్యోత్స్న‌ చీటింగ్ -శ్రీధ‌ర్‌కు కావేరి ప‌నిష్‌మెంట్‌

 

కార్తీక దీపం 2 మే 1 ఎపిసోడ్‌లో దీప‌ను జైలుకు పంపిస్తాన‌ని డ‌బ్బులు తీసుకొని త‌న‌ను చీట్ చేసిన పోలీస్ ఆఫీస‌ర్‌పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. కార్తీక్ ఇచ్చిన దానికి పందింత‌లు డ‌బ్బు ఇస్తాన‌ని, సాక్ష్యాలు మార్చ‌మ‌ని చెబుతుంది. మంచివాళ్ల‌కు ద్రోహం చేయ‌న‌ని ఆ పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు.

 
కార్తీక దీపం 2 మే 1 ఎపిసోడ్‌
 

దీప జైలు నుంచి రిలీజ్ అవుతుంది. ఆమెను తీసుకొని ఇంటికొస్తాడు కార్తీక్‌. దీప ఆలోచ‌న‌ల్లో మునిగిపోయి ఇళ్లు వ‌చ్చిన సంగ‌తి గుర్తించ‌దు. మ‌న ఇళ్లు వ‌చ్చేసింద‌ని కార్తీక్ అంటాడు. ఇది క‌ల కాదు నిజ‌మ‌ని చెబుతాడు.దీప కోసం పూల‌ను తివాచీలా పేర్చుతుంటారు కాంచ‌న‌, శౌర్య‌. దీప‌ను చూడ‌గానే అమ్మ అని ప‌రిగెత్తుకుంటూ వ‌స్తుంది శౌర్య‌. కూతురిని చూడ‌గానే దీప ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. శౌర్య‌పై ముద్దుల వ‌ర్షం కురిపిస్తుంది.

 

మాట నిల‌బెట్టుకున్న‌…

అమ్మ‌ను తీసుకొస్తాన‌ని మాటిచ్చాను క‌దా…నాన్న మాట అన్నాడంటే అని కార్తీక్ అన‌గానే అది జ‌రిగితీరుతుంద‌ని శౌర్య చెబుతుంది. కార్తీక్‌కు థాంక్యూ చెబుతుంది. శౌర్య‌నే ఈ డెక‌రేష‌న్ చేసింద‌ని, ఇది నీ కూతురికి నీ మీద ఉన్న ప్రేమ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని కాంచ‌న చెబుతుంది.

నీ అదృష్టానికి ఎవ‌రి దిష్టి త‌గిలిందో ఏమో…సుఖంగా సాగుతున్న నీ సంసారం క‌ష్టాల్లో ప‌డింద‌ని అన‌సూయ అంటుంది. కార్తీక్ బాబు వ‌ల్లే నువ్వు తొంద‌ర‌గా రిలీజ‌య్యావ‌ని, మ‌ళ్లీ నువ్వు కోర్టు మెట్లు ఎక్క‌కూడ‌ద‌ని చెప్పి దీప‌కు దీష్టి తీస్తుంది.

పెద్ద పండ‌గ‌…

నువ్వు నాతో లేక‌పోతే ఏడుపొస్తుంద‌ని దీప‌తో శౌర్య అంటుంది. ఇక ఈ ఏడుపుల‌కు మ‌న ఇంట్లో చోటు ఉండ‌ద‌ని అన‌సూయ బ‌దులిస్తుంది. మ‌న‌కు ఈ రోజు పెద్ద పండ‌గ‌లాంటింది, విందుభోజ‌నం చేయాల్సిందే అంటుంది. భారం అంతా దిగిపోయి గుండె ఇప్పుడు తేలిగ్గా ఉంద‌ని, నా కోడ‌లు నా ఇంటికి వ‌చ్చింద‌ని కాంచ‌న అంటుంది.

దీప క్ష‌మాప‌ణ‌లు…

ద‌శ‌ర‌థ్ విష‌యంలో కాంచ‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతుంది దీప‌. అన్న‌య్య క్షేమంగా ఉన్నాడ‌ని, కానీ ఆయ‌న్ని చూడ‌లేక‌పోయాన‌నే బాధ ఉంద‌ని అంటుంది. ఆ బాధ పోవాలంటే…ఆ ఇంటి మ‌నుషుల‌కు మ‌న మీద కోపం పోవాలి…అలా జ‌ర‌గాలంటే త‌ప్పు నీ వ‌ల్ల జ‌ర‌గ‌లేద‌న్న‌ది న‌మ్మాలి అని కాంచ‌న అంటుంది. మొద‌టిది పోదు…రెండోది జ‌ర‌గ‌దు అని కార్తీక్ అంటాడు.

 

తాత ఫొటో ద‌గ్గ‌ర శౌర్య దీపాలు వెలిగిస్తుంది. న‌న్ను ఈ కుటుంబానికి దూరం చేయ‌ద్ద‌ని, దీపాలు క‌లిసి వెలిగిన‌ట్లే మా జీవితాలు క‌లిసి నిల‌వాలి, వెల‌గాలి అని మ‌న‌సులో కోరుకుంటూ తండ్రి ఫొటోకు దండం పెడుతుంది దీప‌.

ఎంత‌కు అమ్ముడుపోయావు…

దీప‌ను దొంగ సాక్ష్యాల‌తో జైలుకు పంపిస్తాన‌ని డ‌బ్బులు తీసుకున్న పోలీస్ ఆఫీస‌ర్ త‌న‌ను చీట్ చేయ‌డం జ్యోత్స్న త‌ట్టుకోలేక‌పోతుంది. ఆ పోలీస్ ఆఫీస‌ర్‌ను క‌లిసి అత‌డిపై ఫైర్ అవుతుంది. ఎంత‌కు అమ్ముడుపోయావ‌ని అంటుంది. న‌న్ను నువ్వు ఇంత ధైర్యంగా నిల‌దీయ‌డానికి కార‌ణం ఇదేనా అని దీప ఇచ్చిన స్కూల్ ఆడ్మిష‌న్ లెట‌ర్‌తో పాటు ఆమె ఇచ్చిన డ‌బ్బులు తిరిగి ఇచ్చేస్తాడు.

దీప‌ను కాపాడ‌టానికి మా బావ నీకు ఎంత ఆఫ‌ర్ చేశాడు. అంత‌కు ప‌దింత‌లు ఎక్కువ డ‌బ్బులు ఇస్తాను. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో త‌ప్పు జ‌రిగింద‌ని కోర్టులో చెప్ప‌మ‌ని జ్యోత్స్న అంటుంది. అలా చెప్ప‌డం కుద‌ర‌ద‌ని పోలీస్ ఆఫీస‌ర్ చెబుతాడు.

నిజం చెబితే జైల్లో ఉంటావు…

దీప నీకు ఏమైనా చెల్లా, కార్తీక్ నీ ఫ్రెండా… అని జ్యోత్స్న‌. ఆ రెండు కాదు. మంచివాళ్ల‌కు అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిద‌ని జ్యోత్స్న‌కు వార్నింగ్ ఇస్తాడు. అమ్ముడుపోయిన నీ లాంటివాళ్ల‌తో మంచి మ‌ర్యాద ఏంటి జ్యోత్స్న‌. నేను నిజం చెబితే నువ్వు జైల్లో కూర్చుంటావ‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు.

 

నేను నిజం చెబితే నీ జాబ్ పోతుంది…ఇంట్లో కూర్చుంటావ‌ని జ్యోత్స్న ధీటుగా బ‌దులిస్తుంది. ఎక్క‌డ చెప్పుకుంటావో…ఎవ‌రితో చెప్పుకుంటావో చెప్పుకోమ‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు. మంచి వాళ్ల‌ను మోసం చేయ‌కూడ‌ద‌ని అనుకున్నాను. నా డ్యూటీ నేను చేశాన‌ని అంటాడు.

ద్రోహం చేయ‌ను…

దీప బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని, ఈ మాట‌ను అబ‌ద్ధం చేయాల‌ని , ఫోరెన్సిక్ రిపోర్టులు మార్చ‌మ‌ని పోలీస్ ఆఫీస‌ర్‌ను అడుగుతుంది. దీప బెయిల్‌ను క్యాన్సిల్ చేస్తార‌ని అంటుంది. నేను చెప్ప‌మ‌న‌ని, మంచివాళ్ల‌కు ద్రోహం చేయ‌న‌ని మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు. ఏం చేసి నీకు దీప‌, కార్తీక్ నీకు మంచి వాళ్లు అయ్యారో అది కూడా చెప్ప‌మ‌ని జ్యోత్స్న అంటుంది.

సిరిని కాపాడిన కార్తీక్‌…

పోలీస్ ఆఫీస‌ర్ కూతురు సిరికి యాక్సిడెంట్ అవుతుంది. ఆమెను కార్తీక్ హాస్పిట‌ల్‌లో చేర్చుతాడు. బ్ల‌డ్ అవ‌స‌రం కావ‌డంతో త‌న ర‌క్తం ఇచ్చి కాపాడుతాడు. త‌న కూతురు కోసం కంగారుగా హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన ఎస్ఐకి సిరిని హాస్సిట‌ల్‌లో చేర్పించి ర‌క్తం ఇచ్చి కార్తీక్ కాపాడాడ‌నే నిజం తెలుస్తుంది. నీ రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేన‌ని, జీవితాంతం గుర్తుపెట్టుకునే సాయం చేశావ‌ని కార్తీక్‌తో అంటాడు ఎస్ఐ.

దీప‌కు శౌర్య అంటే…

మీ కూతురు అనే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, నాకు ఆ వ‌య‌సు కూతురు ఉంద‌ని, సిరిని చూడ‌గానే నా కూతురు గుర్తొచ్చింది…నా కూతురు అనుకొనే కాపాడాన‌ని కార్తీక్ అంటాడు. పాప ఎవ‌రో తెలియ‌క‌పోయినా నా ఫ్రెండ్ కూతురు అని అబ‌ద్ధం చెప్పి ట్రీట్‌మెంట్ చేయించాన‌ని అంటాడు. సిరికి ఏమ‌న్న అయితే వాళ్ల అమ్మ త‌ట్టుకోలేద‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు.

 

దీప‌కు శౌర్య అంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌ల్లి కోసం శౌర్య ఎదురుచూస్తుంద‌ని కార్తీక్ అంటాడు. కార్తీక్ నా కూతురిని బ‌తికించాడు. అందుకే కార్తీక్ కోసం దీప‌ను కాపాడాల‌ని అనుకున్నాన‌ని జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఎస్ఐ గుర్తుచేసుకుంటాడు. కానీ ఆ నిజాల‌ను మాత్రం జ్యోత్స్న‌కు చెప్ప‌డు. కొన్ని ఎవ‌రికి చెప్పాల్సిన ప‌నిలేదు…ముఖ్యంగా నీ లాంటి వాళ్ల‌కు అస్స‌లు చెప్ప‌కూడ‌ద‌ని పోలీస్ ఆఫీస‌ర్ వెళ్లిపోతాడు.

చిన్న గ్యాప్ ఇచ్చా…

డ‌బ్బుకు అమ్ముడుపోయి పోలీస్ ఆఫీస‌ర్ పొగ‌రుగా మాట్లాడుతున్నాడ‌ని జ్యోత్స్న అనుకుంటుంది. త‌ప్పించుకున్నాన‌ని సంబ‌ర‌ప‌డిపోకు, ఈ గ్యాప్‌ను ఫ్యామిలీతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకో…ఇదే నీకు లాస్ట్ హ్యాపీ మూవ్‌మెంట్స్ అని దీప‌ను ఉద్దేశించి జ్యోత్స్న మ‌న‌సులో అనుకుంటుంది.

కావేరి డ్యాన్స్‌…

దీప జైలు నుంచి రిలీజైన సంగ‌తి తెలిసి కావేరి ఆనందంగా డ్యాన్స్ చేస్తుంది. ఆమె డ్యాన్స్ చూసి శ్రీధ‌ర్ షాక‌వుతాడు. ఈ ఆనందానికి కార‌ణం ఏమిట‌ని అడుగుతాడు. శ్రీధ‌ర్‌కు స్వీట్ ఇచ్చి అత‌డిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళుతుంది. ఆ త‌ర్వాత బ‌య‌ట నుంచి గ‌డియ‌పెడుతుంది.

దీప ఏ త‌ప్పు చేయ‌లేద‌ని కోర్ట్‌లో ప్రూవ్ అయ్యింద‌ని శ్రీధ‌ర్‌తో చెబుతుంది కావేరి. ఆ మాట విన‌గానే గుండె ప‌ట్టుకుంటాడు శ్రీధ‌ర్‌. గుండె ప‌గిలేంత షాకింగ్ న్యూస్ ఇద‌ని అంటాడు. దీప ఇంటికొచ్చేసిన సంగ‌తి చెప్ప‌గానే…ఇది ఇంకా హాట్ బ్రేకింగ్ న్యూస్ అని, స్వీట్ చేతిలో పెట్టి నా మాట‌ల‌తో గుండెల్లో పొడిచావ‌ని శ్రీధ‌ర్ అంటాడు.

 

శ్రీధ‌ర్‌కు ప‌నిష్‌మెంట్‌…

నేను కోడ‌లిని చూడ‌టానికి వెళ్లుతున్నాన‌ని, అప్ప‌టివ‌ర‌కు బెడ్‌రూమ్ లోప‌లే ఉండ‌మ‌ని ప‌నిష్‌మెంట్ ఇస్తుంది. మిమ్మ‌ల్ని స్వేచ్ఛ‌గా వ‌దిలేస్తే నాతో పాటు వ‌స్తారు… నానా మాట‌లు అంటారు. నాకు ఈ త‌ల‌నొప్పి అవ‌స‌ర‌మా అని భ‌ర్త‌తో కావేరి అంటుంది. అంటుంది.

గృహ‌హింస కేసు పెడ‌తా…

నువ్వు డోర్ తీయ‌క‌పోతే నీపై గృహ‌హింస కేసు పెడ‌తాన‌ని కావేరికి వార్నింగ్ ఇస్తాడు శ్రీధ‌ర్‌. నీ ద‌గ్గ‌ర ఫోన్ లేద‌ని షాకిస్తుంది. కాస్త క‌నిక‌రించ‌మ‌ని కాళ్ల‌బేరానికి వ‌స్తాడు శ్రీధ‌ర్‌. క‌నిక‌రిస్తే కాటేసే ర‌కం మీర‌ని కావేరి బ‌దులిస్తుంది. నువ్వు అక్క‌డే ఉండిపోతావా…మ‌ళ్లీ ఇంటికి రావా త‌లుపుతీయ‌వా…అప్పుడు నీకు చింత చిగురు ప‌చ్చ‌డే అని శ్రీధ‌ర్ కోపంగా అంటాడు. అయితే ప‌చ్చ‌డి చేసి పెట్టండి వ‌చ్చాకా తింటాన‌ని పంచ్ వేసి వెళ్లిపోతుంది కావేరి. న‌న్ను ర‌క్షించండి మ‌హాప్ర‌భో అని శ్రీధ‌ర్ కేక‌లు వేస్తాడు. దీప జైలు నుంచి రిలీజైతే నా లాంటి పెద్ద మ‌నిషి ప‌ల‌క‌రించ‌క‌పోతే ఎలా అని అంటాడు.

గౌత‌మ్‌తో పెళ్లి ఆపేస్తే…

స్వీట్స్ తీసుకొని దీప‌, కార్తీక్‌ల‌కు క‌లుస్తుంది కావేరి. ఆమె తెచ్చిన స్వీట్స్ తీసుకొని రూమ్‌లోకి పారిపోతుంది శౌర్య‌. శౌర్య సంతోషంగా క‌నిపించి చాలా రోజులైంది అని కాంచ‌న అంటుంది. శౌర్య‌ను ఏడిపించింది మీ నాన్నే క‌దా త‌ల్లితో కార్తీక్ అంటాడు. గౌత‌మ్‌తో పెళ్లి ఆపేస్తే ఇన్ని గొడ‌వ‌లు జ‌రిగేవి కాదు క‌దా అని అంటాడు.

 

జీవితాంతం జైలులోనే…

శ్రీధ‌ర్‌ను గ‌దిలో పెట్టి తాళం వేసి వ‌చ్చిన సంగ‌తి కాంచ‌న‌, కార్తీక్‌ల‌తో చెబుతుంది కావేరి. మంచి ప‌ని చేశాన‌ని కాంచ‌న అంటుంది. నేను వెళ్లేవ‌ర‌కు గ‌దిలో ప‌డి ఉండాల్సిందేన‌ని కావేరి అంటుంది. అంత‌లేదు అని శ్రీధ‌ర్ స‌డెన్‌గా అక్క‌డికి ఎంట్రీ ఇస్తాడు. దీప‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి తాను వ‌చ్చాన‌ని అంటాడు. జ‌రిగింది చూసి నువ్వు జైలు నుంచి రావేమో అనుకున్నా…నీ పూర్తి జీవితం జైలు గోడ‌ల‌కే అనుకున్నాన‌ని అంటాడు.

వంట‌ల‌క్క జీవిత చ‌రిత్ర‌…

నీ క‌థ‌ను న‌వ‌ల‌గా రాసి…వంట‌ల‌క్క జీవిత చ‌రిత్ర అని పేరు పెట్టి అంద‌రికి పంచాల‌ని అనుకున్నాన‌ని శ్రీధ‌ర్ అంటాడు. కార్తీక్ చీటింగ్‌లు చేసి త‌న భార్య‌ను ఇంటికి తెచ్చుకున్నాడ‌ని చెబుతుంది. ఇది బెయిల్ క‌దా…ఏ మాత్రం అటు ఇటు అయినా జైలుకు పోవాల్సిందేన‌ట‌గా అని త‌న మ‌న‌సులో ఉన్న ద్వేషం బ‌య‌ట‌పెడ‌తాడు. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగిసింది.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024