మెగా డీఎస్సీలో క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక.. అప్లై చేసుకోండి.

Best Web Hosting Provider In India 2024

మెగా డీఎస్సీలో క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక.. అప్లై చేసుకోండి.

 

ఏపీ డిఎస్సీ 2025లో భాగంగా స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మెగా డీఎస్సీలో 421 ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాలను క్రీడల కోటాలో భర్తీ చేస్తారు. స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులు మే 2 నుండి 31వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 
డిఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
 

ఏపీ డిఎస్సీ 2025లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. 421 ఉద్యోగాలను ఈ కోటాలో భర్తీ చేస్తారు. డీఎస్సీ-2025 లో భాగంగా 3శాతం క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయం లో బుధవారం విడుదల చేశారు.

 

మెగా డిఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రకటించింది. డిఎస్సీ నియామకాల్లో భాగంగా అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.

మెగా డీఎస్సీలో విడుదల చేసిన 16,347 పోస్ట్ ల్లో క్రీడల కోటా క్రింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద కేటాయించారు. స్పోర్ట్స్ కోటా కు ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేవలం అర్హులకు మాత్రమే న్యాయం జరిగిలా చర్యలు తీసుకున్నట్టు క్రీడా శాఖ మంత్రి వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు చెప్పారు.

దరఖాస్తులు ఇలా…

ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇన్సెంటీవ్ లు అందిస్తామని మంత్రి తెలిపారు. క్రీడల్లో ఫేక్ సర్టిఫికెట్లతో అర్హత పొందేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీకి అర్హులైన క్రీడాకారులు మే 2 నుండి మే 31 వరకు https://sports.ap.gov.in , https://sportsdsc.apcfss.in వెబ్‌సైట్లలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

 

మెగా డీఎస్సీలో క్రీడా కోటా క్రింద ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 333 పోస్టులు, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 30 పోస్టులు, ఏపీ ట్రైబల్ వెల్ ఫేర్ ఆశ్రమ్ పాఠశాలల్లో 22 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2 పోస్టులు, ఏపీ మోడల్ పాఠశాలల్లో 4 పోస్టులు, ఏపీ సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7 పోస్టులు, ఏపీ గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 23 పోస్టులు కేటాయించినట్లు వివరించారు.

క్రీడలలో ప్రతిభ చూపిన యువతకు నేరుగా ఉద్యోగాలు పొందేందుకు ఇది చక్కటి అవకాశమని స్థిరమైన జీవితం, గౌరవం, ఉద్యోగ భద్రత లభించేందుకు ఇది మార్గమని మంత్రి రాంప్రాసాద్ రెడ్డి తెలిపారు.

క్రీడల్ని ప్రోత్సహించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతల తెలిపారు.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024