గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: స‌త్యం ప్రాణాలు కాపాడిన మీనా -ప్ర‌భావ‌తి తిట్ల దండ‌కం-శృతి త‌ప్పుకు ర‌వికి శిక్ష‌

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: స‌త్యం ప్రాణాలు కాపాడిన మీనా -ప్ర‌భావ‌తి తిట్ల దండ‌కం-శృతి త‌ప్పుకు ర‌వికి శిక్ష‌

 

గుండె నిండా గుడి గంట‌లు మే 1 ఎపిసోడ్‌లో శృతి దోమ‌ల మందు స్ప్రే వ‌ల్ల స‌త్యం ఊపిరి పీల్చుకోవ‌డానికి ఇబ్బంది ప‌డ‌తాడు. స‌త్యాన్ని మీనా హాస్పిట‌ల్‌లో చేర్పిస్తుంది. మీనా వ‌ల్లే స‌త్యం హాస్పిట‌ల్ పాల‌య్యాడ‌ని పొర‌ప‌డ‌ని ప్ర‌భావ‌తి హాస్పిట‌ల్ అని చూడ‌కుండా తిడుతుంది.

 
గుండె నిండా గుడి గంట‌లు మే 1 ఎపిసోడ్‌

 

మ‌నోజ్ స‌ర్వ‌ర్‌గా ప‌నిచేసే రెస్టారెంట్‌కు కామాక్షితో క‌లిసి వ‌స్తుంది ప్ర‌భావ‌తి. తాను స‌ర్వ‌ర్‌గా ప‌నిచేస్తోన్న విష‌యం త‌ల్లికి తెలియ‌కుండా ఉండేందుకు తిప్ప‌లు ప‌డ‌తాడు మ‌నోజ్‌.

 

మ‌రోవైపు ఆర్డ‌ర్స్ తీసుకోకుండా మ‌నోజ్ దాక్కొని తిర‌గ‌డం ఓన‌ర్ గ‌మ‌నించి క్లాస్ పీకుతాడు. త‌ల్లి త‌న‌ను గుర్తుప‌ట్ట‌కుండా క్యాప్‌, మాస్క్ పెట్టుకొని క‌స్ట‌మ‌ర్స్ నుంచి ఆర్డ‌ర్ తీసుకుంటుంటాడు మ‌నోజ్‌.

కామాక్షి అనుమానం…

మ‌నోజ్‌కు కాల్ చేస్తుంది ప్ర‌భావ‌తి. హోట‌ల్‌లోని కౌంట‌ర్ ద‌గ్గ‌ర ఫోన్‌ మోగుతుంది. మ‌నోజ్ రింగ్‌టోన్‌లా ఉంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. కొంప‌దీసి ఈ స‌ర్వ‌ర్ మ‌నోజ్‌…మీ మ‌నోజ్‌గాడేనా అని కామాక్షి అనుమానం వ్య‌క్తం చేస్తుంది. నా కొడుకుకు స‌ర్వ‌ర్‌గా ప‌నిచేయాల్సిన క‌ర్మేమిటి?

వాడు ఎన్ని డిగ్రీలు సంపాదించాడో తెలుసా అని ప్ర‌భావ‌తి గొప్ప‌లు చెబుతుంది. ఇప్పుడే ఈ ఫోన్ సంగ‌తి ఏదో తెలుస్తాన‌ని కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేయ‌డానికి బ‌య‌లుదేరుతుంది. మ‌నోజ్ తెలివిగా మ‌రో స‌ర్వ‌ర్ ఫోన్ అది న‌మ్మిస్తాడు. తృటిలో త‌ప్పించుకుంటాడు.

మ‌నోజ్ బిల్డ‌ప్పులు..

ఆ త‌ర్వాత కిచెన్‌లోకి వెళ్లి త‌ల్లికి ఫోన్ చేస్తాడు. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో బిజీగా ఉన్నాన‌ని అబ‌ద్ధాలు చెబుతాడు. క‌స్ట‌మ‌ర్ కోసం ఓ స‌ప్ల‌య‌ర్‌కు టిఫిన్ తీసుకొని వెళుతుండ‌గా పొర‌పాటుగా సాంబ‌ర్ మ‌ర్చిపోయావ‌ని నోరు జారుతాడు మ‌నోజ్‌. సాంబార్ ఏంటి ప్ర‌భావ‌తి అనుమానంగా అడుగుతుంది. క్యాంటిన్‌లో భోజ‌నం చేస్తున్నాన‌ని అబ‌ద్ధం చెబుతాడు మ‌నోజ్‌.

తొంద‌ర‌గా ఇంటికి వెళ్ల‌మ‌ని త‌ల్లితో అంటాడు మ‌నోజ్‌. నేను బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి నీకు ఎలా తెలుసున‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఇంట్లో అయితే బాలు ఒక్క‌డిదే గొంతు వినిపించేద‌ని, ఇక్క‌డ చాలా మంది వాయిస్‌లు వినిపించ‌డంతో గెస్ చేశాన‌ని క‌వ‌ర్ చేస్తాడు మ‌నోజ్‌.

 

రోహిణి డ‌బ్బు క‌ష్టాలు…

వ‌ర్ధ‌న్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిపోయి బ్యాంకులో ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకొని అత‌డు అడిగినంత డ‌బ్బు ఇస్తుంది రోహిణి. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే నీ జీవితం వ‌డ్డీల‌కే స‌రిపోతుంద‌ని విద్య అంటుంది. ఇలా ఎన్ని రోజులు డ‌బ్బులు ఇస్తావ‌ని అడుగుతుంది. ఎలాగైనా మ‌ళ్లీ పార్ల‌ర్ కొనాల‌ని, మ‌నోజ్ మ‌ళ్లీ జాబ్ చేస్తున్నాడ‌ని విద్య‌తో అంటుంది రోహిణి. మ‌నోజ్ జాబ్ చేస్తున్నాడంటే అస్స‌లు న‌మ్మ‌కం కుద‌ర‌డం లేద‌ని విద్య అంటుంది.

బాలు, మీనా త‌ప్ప‌…

మ‌నోజ్‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చి వేరు కాపురం పెడితేనే నీ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని రోహిణికి స‌ల‌హా ఇస్తుంది విద్య‌. జాయింట్ ఫ్యామిలీలో ఉండ‌ట‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఇంట్లో ఒక్క బాలు, మీనా త‌ప్ప అంద‌రూ నాతో మంచిగా ఉంటార‌ని అంటుంది. బాలు, మీనాల‌ను ఎలాగైనా ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించేలా చేస్తాన‌ని రోహిణి అంటుంది.

దోమల మందు స్ప్రే…

శృతి డ్యూటీ నుంచి అల‌సిపోయి ఇంటికొస్తుంది. ఇంట్లో దోమ‌లు బాగా ఉండ‌టంతో మందు స్ప్రే చేస్తుంది. ఆ స్ప్రే వ‌ల్ల వ‌చ్చే వాస‌న మీనా భ‌రించ‌లేక‌పోతుంది. ఊపిరి పీల్చుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని అంటుంది. అయినా శృతి విన‌కుండా దోమల మందు స్ప్రే చేస్తునే ఉంటుంది. డ‌బ్బింగ్ స్టూడియో నుంచి అర్జెంట్ కాల్ రావ‌డంతో శృతి వెళ్లిపోతుంది.

 

హాస్పిట‌ల్ పాలైన స‌త్యం…

అప్పుడే స‌త్యం ఇంటికొస్తాడు. ఆ దోమ‌ల మందు వాస‌న భ‌రించ‌లేక‌పోతాడు. వాస‌న ఏదో తేడాగా ఉంద‌ని, ఊపిరి అంద‌డం లేద‌ని గుండె ప‌ట్టుకొని నొప్పితో విల‌విల‌లాడుతాడు స‌త్యం. మావ‌య్య‌కు ఏమైందో తెలియ‌క మీనా కంగారు ప‌డుతుంది. బాలుకు ఫోన్ చేసి మావ‌య్య‌కు ఊపిరి అంద‌డం లేద‌ని హాస్పిట‌ల్‌కు తీసుకెళుతున్నాన‌ని బాలుతో చెబుతుంది.

మీనా వ‌ల్లే సేఫ్‌…

స‌త్యాన్ని హాస్పిట‌ల్‌లో చేర్పిస్తుంది మీనా. బాలు కంగారుగా హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు. నేరుగా స‌త్యం ఉన్న ఐసీయూలో రూమ్‌లోకి వెళ‌తాడు. మా నాన్న‌కు ఏమైంద‌ని డాక్ట‌ర్‌ను అడుగుతాడు. స‌త్యానికి ఊపిరి తిత్తుల్లో దోమ‌ల మంది స్ప్రే నిండిపోయింద‌ని, హార్ట్ పేషెంట్ కావ‌డంతో ఊపిరి పీల్చుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని డాక్ట‌ర్ అంటాడు. ప్రాణాల‌కు ప్రమాద‌మేమి లేద‌ని చెబుతాడు. క‌రెక్ట్ టైమ్‌లో మీనా హాస్పిట‌ల్‌కు తీసుకురావ‌డం వ‌ల్లే స‌త్యం ప్రాణాలు నిల‌బ‌డ్డాయ‌ని డాక్ట‌ర్ అంటాడు.

రాజేష్ సాయం…

బిల్ ప‌దిహేను వేలు క‌ట్టాల‌ని న‌ర్స్ చెప్ప‌డంలో బాలు షాక‌వుతాడు. ఆ డ‌బ్బు ఎక్క‌డి తేవాలో తెలియ‌క ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. గుణ‌కు క‌ట్టాల్సిన వ‌డ్డీ డ‌బ్బుల‌ను బాలుకు ఇస్తాడు రాజేష్. బాలు వ‌ద్ద‌న్న విన‌కుండా తానే హాస్పిట‌ల్ బిల్ పే చేస్తాడు.

ప్ర‌భావ‌తి నింద‌లు…

ప్ర‌భావ‌తి గుండెలు బాదుకుంటూ హాస్పిట‌ల్‌కు వ‌స్తుంది. దోమ‌ల మందును మీనానే స్ప్రే చేసింద‌ని పొర‌ప‌డి హాస్పిట‌ల్ అని చూడ‌కుండా మీనాపై నోరు పారేసుకుంటుంది. మీ పుట్టింట్లో దోమ‌లే లేవా…దోమ‌ల మ‌ధ్యే పెరిగావు క‌దా అని నానా మాట‌లు అంటుంది. ప్ర‌భావ‌తి అరుపుల‌కు స‌త్యం స్పృహ‌లోకి వ‌స్తాడు.

 

మీనాను ఏం అన‌ద్ద‌ని అంటాడు. అస‌లు జ‌రిగిందో చెప్ప‌బోతాడు.నీకు ఊపిరి తీసుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంద‌ని, క‌ష్ట‌ప‌డి చెప్పాల్సిన ప‌నిలేద‌ని బాలు అంటాడు. మీనా సంగ‌తి తాను చూస్తాన‌ని ప్ర‌భావ‌తి కోపంగా అంటుంది. ఇది ఇల్లు కాదు హాస్పిట‌ల్ అని ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తాడు.

బాలు, ప్ర‌భావ‌తి ఎంత అడిగిన స్ప్రే కొట్టింది ఎవ‌ర‌న్న‌ది మీనా చెప్ప‌డు. అన‌వ‌స‌రంగా గొడ‌వ‌లు ఎందుక‌ని అంటుంది.

శృతి పేరు చెప్పిన మీనా…

అయినా ప్ర‌భావ‌తి విన‌కుండా మాట‌ల యుద్దం కొన‌సాగించ‌డంతో చివ‌ర‌కు శృతి దోమ‌ల మందు స్ప్రే చేసిన సంగ‌తి బ‌య‌ట‌పెడుతుంది మీనా. శృతి పేరు విన‌గానే ప్ర‌భావ‌తి, బాలు షాక‌వుతారు. శృతి బాగా చ‌దువుకున్న అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది…మ‌నం తిట్టామ‌ని శృతిపైకి అబ‌ద్దాన్ని నెట్టివేస్తుంద‌ని ప్ర‌భావ‌తి వ‌స్తుంది. శృతి నీ త‌మ్ముడు భార్య అని, ఆమె గురించి త‌ప్పుగా మాట్లాడొద్ద‌ని బాలుతో అంటుంది.

తిట్ట‌డ‌మే ముఖ్య‌మా…

ఎలా క‌నిపిస్తున్నాను మీకు, క‌నీసం మ‌నిషిగా కూడా క‌నిపించ‌లేదా…మావ‌య్య హాస్పిట‌ల్‌లో ఉంటే మ‌మ్మ‌ల్ని తిట్ట‌డ‌మే మీకు ముఖ్య‌మా అని ప్ర‌భావ‌తికి ధీటుగా బ‌దులిస్తుంది మీనా. కావాలంటే శృతికి ఫోన్ చేయ‌మ‌ని చెబుతుంది. స్ప్రే వ‌ద్ద‌ని చెప్పిన విన‌లేద‌ని మీనా అంటుంది.

హాస్పిట‌ల్ బిల్ క‌ట్టాలి…

అప్పుడే కంగారుగా మ‌నోజ్ ర‌వి హాస్పిట‌ల్‌కు వ‌స్తారు. ఈ సంగ‌తి నీ పెళ్లాన్ని అడ‌గారా లేచిపోయినోడా అని ర‌విపై ఫైర్ అవుతాడు బాలు. నువ్వు దొంగ‌పెళ్లిచేసుకొని నాన్న‌ను హాస్పిట‌ల్ పాలు చేశావు…ఇప్పుడు నా భార్య వ‌ల్ల ఇప్పుడు మ‌రోసారి నాన్న హాస్పిట‌ల్‌లో చేరాల్సివ‌చ్చింద‌ని బాలు అంటాడు. అస‌లు ఏమైంది..నాకు ఏం అర్థం కావ‌డం లేద‌ని మ‌నోజ్ అంటాడు. హాస్పిట‌ల్ బిల్ క‌ట్టాల‌ట వెళ్లి క‌ట్టు అని బాలు అన‌గానే మ‌నోజ్ సైలెంట్ అవుతాడు.

 

ర‌వికి వార్నింగ్‌…

నిన్ను, నా భార్య‌ను ఈ మ‌హాత‌ల్లి ఇంట్లోకి రానిచ్చిన రోజే చెప్పాను…మ‌ళ్లీ మీ వ‌ల్ల నాన్న‌కు ఏదైనా అయితే ఇంట్లో నుంచి వెళ్ల‌గొడ‌తాన‌ని…మూట‌ముల్లే స‌ర్ధుకొని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని ర‌వికి వార్నింగ్ ఇస్తాడు బాలు. మీరు మీ అమ్మ‌లాగే ఎవ‌రో చేసిన త‌ప్పుకు మ‌రొక‌రిని అంటే ఎలా..శృతి త‌ప్పు చేస్తే ర‌విని తిట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని బాలుతో అంటుంది మీనా.

శృతికి న‌చ్చ‌చెప్పు…

శృతి దోమ‌ల మందు స్ప్రే చేయ‌డం వ‌ల్ల ఆ పొగ ఊపిరి తిత్తుల్లో చేరి శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని ర‌వితో అంటుంది మీనా. ఇలాంటివి మీ నాన్న‌కు ప‌డ‌వ‌ని శృతికి న‌చ్చ‌చెప్ప‌మ‌ని ర‌వితో అంటుంది ప్ర‌భావ‌తి. అదే మీనా త‌ప్పు చేయ‌క‌పోయినా ఆమెపై ఇంతెత్తున ఎగిరావు క‌దా…శృతి త‌ప్పు చేసింద‌ని తెలియ‌గానే ఎందుకు మాట్లాడ‌టం లేదు అని త‌ల్లిని నిల‌దీస్తాడు బాలు. నాన్న కోలుకొని ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత ర‌వి, శృతి సంగ‌తి చెబుతాన‌ని హాస్పిట‌ల్ నుంచి వెళ్లిపోతాడు.

నేను మాట్లాడ‌గ‌ల‌ను…

మ‌ళ్లీ బాలుకు దొరికిపోయామ‌ని, ఇంట్లో ఉండ‌నిస్తాడో లేదోన‌ని ర‌వి త‌ల‌ప‌ట్టుకుంటాడు. హాస్పిట‌ల్‌లో నుంచి డిశ్చార్జ్ అయ్యి స‌త్యం ఇంటికొస్తాడు. శృతిపై బాలు ఫైర్ అవుతాడు. తండ్రిని త‌న రూమ్‌లో ప‌డుకోమ‌ని బాలు అంటాడు. బాలును ఆగ‌మ‌ని మీనా అంటుంది. నువ్వు నాన్న‌ను గ‌దిలో ప‌డుకోమ‌ని అంటున్నావు. కానీ మీనా మాత్రం ఆగ‌మ‌ని అంటుంద‌ని ప్ర‌భావ‌తి నోరు పారేసుకుంటుంది. నాకు నోరు ఉంది. నేను ఏదైనా మాట్లాడ‌గ‌ల‌ను. మంచి చెడు నాకు తెలుసు అని ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తుంది మీనా. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024