





Best Web Hosting Provider In India 2024

మైక్రోవేవ్ లో ఈ ఆహారాలు పెడితే అది పేలే అవకాశం, జాగ్రత్త పడండి
మైక్రోవేవ్ లో ఆహారాన్ని వేడి చేయడం అందరూ చేసే పేనే. ‘రెడీ టు ఈట్’ ఆహారాన్ని కూడా మైక్రోవేవ్ లో వండుతూ ఉంటారు. మైక్రోవేవ్ ఓవెన్ వినియోగదారులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలు ఇవి ఉన్నాయి. ఓవెన్ లో ఎలాంటి ఆహారాలను పెట్టకూడదో కూడా తెలుసుకోవాలి.
ఒకప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ను లగ్జరీగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. సాధారణంగా ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వంటగదిలోని నిత్యావసర వస్తువుల జాబితాలో చేరింది.
మైక్రోవేవ్ ఆహారాన్ని త్వరగా వండడం, త్వరగా వేడి చేయడం వంటి అనేక విషయాలను సులభతరం చేసింది. మైక్రోవేవ్ అనేది ఉద్యోగం చేసే ఆడవారికి ఒక వరం అనే చెప్పాలి. మైక్రోవేవ్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో, దాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
మైక్రోవేవ్ లో వంట చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. వంట కోసం అందులో ఉంచిన ఆహార పదార్థాల నుంచి అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మీరు మైక్రోవేవ్ ఉపయోగిస్తుంటే ఈ భద్రతా చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మైక్రోవేవ్ లో ఏయే వస్తువులను వండుకోవచ్చు, వేటిని వాడకూడదో తెలుసుకోండి.
డ్లను ఉడకబెట్టకూడదు
గుడ్లను మైక్రోవేవ్ లో ఎప్పుడూ ఉడకబెట్టకూడదు. గుడ్డును మైక్రోవేవ్ లో పెట్టి అది పేలుడుకు కారణమవుతుంది. గుడ్డు ఉడికించినప్పుడు, మైక్రోవేవ్ లో ఆవిరి ఏర్పడుతుంది. ఈ ఆవిరి, పీడనం కారణంగా, గుడ్డు కొన్నిసార్లు దాని షెల్ తో పాటూ పేలిపోవచ్చు. ఇది మైక్రోవేవ్ పేలడానికి కారణమవుతుంది. ఇంట్లో విద్యుత్ ప్రమాదాలకు దారి తీయవచ్చు.
స్టీలు పాత్రలను ఉంచవద్దు
స్టీలు పాత్రలను మైక్రోవేవ్ లో ఉపయోగించకూడదు. స్టీల్ పాత్రను ఉపయోగించడం వల్ల మైక్రోవేవ్ లో స్పార్క్ లు మండవచ్చు. అనేక సందర్భాల్లో, పేలుడు సంభవించే ప్రమాదం కూడా ఉండవచ్చు. కాబట్టి, మీరు మైక్రోవేవ్ లో ఏదైనా వండుతుంటే, మైక్రోవేవ్-సేఫ్ ప్లాస్టిక్ లేదా గ్లాసు పాత్రలను ఉపయోగించండి.
నీటిని వేడి చేయవద్దు
కొంతమంది నీటిని వేడి చేయడానికి మైక్రోవేవ్ ను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది నీటిని త్వరగా వేడి చేస్తుంది. మైక్రోవేవ్ లో నీటిని వేడి చేసినప్పుడు, కంటైనర్ నుండి ఆ నీరు బయట పడే ప్రమాదం ఉంది. ఇది మీ మైక్రోవేవ్ ను దెబ్బతీస్తుంది. ౌఏదైనా ప్రమాదం జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.
పాత్రలపై మూత పెట్టవద్దు
మీరు మైక్రోవేవ్ లో వంట చేస్తున్నప్పుడు లేదా ఏదైనా వేడి చేస్తున్నప్పుడు, పాత్రపై మూత పెట్టవద్దు. మీ పాత్ర ప్లాస్టిక్ లేదా గాజు అయినా, ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. వాస్తవానికి, వేడి చేసినప్పుడు, కంటైనర్ లోపల ఆవిరి విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. పాత్ర పేలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
అల్యూమినియం ఫాయిల్
అల్యూమినియం ఫాయిల్ మైక్రోవేవ్ లో ఉపయోగించడం కూడా ప్రమాదకరం. నిజానికి మైక్రోవేవ్ ఉపరితలం లోహంతోనే తయారవుతుంది. అదేవిధంగా, అల్యూమినియం ఫాయిల్ కూడా లోహంతో తయారవుతుంది. అటువంటి పరిస్థితిలో, మైక్రోవేవ్ తరంగాలు దానిని ఢీకొని మంట పుట్టడానికి కారణమవుతాయి. ఇది అగ్నిప్రమాదం లేదా పేలుడుకు దారితీస్తుంది.
టాపిక్