ఆ ఓటీటీలోనే హిట్ 3 స్ట్రీమింగ్.. భారీ రేటుకు డీల్.. వచ్చేది ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

ఆ ఓటీటీలోనే హిట్ 3 స్ట్రీమింగ్.. భారీ రేటుకు డీల్.. వచ్చేది ఎప్పుడంటే?

 

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, బీభత్సమైన వైలెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు హీరో నాని వచ్చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ 3 ఈ రోజే (మే 1) థియేటర్లకు వచ్చేసింది. ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ యాక్షన్ మోడ్ లో నాని అదరగొట్టారని చెబుతున్నారు. మరి ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుంది? ఎక్కడ చూడొచ్చంటే?

 
హిట్ 3లో నాని

అర్జున్ సర్కార్.. అంటూ థియేటర్లలో ఫ్యాన్స్ తో విజిల్ కొట్టిస్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ ఈ రోజే (మే 1) థియేటర్లకు వచ్చేసింది. బీభత్సమైన వైలెన్స్ తో రక్తపాతంతో సాగుతున్న మూవీలో నాని యాక్షన్ వేరే లెవెల్ లో ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నాని ఫుల్ ఇంటెన్సివ్ గా యాక్షన్ మోడ్ లో ఇరగదీశారని చెబుతున్నారు. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

 

ఆ ఓటీటీలోకి

నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ ఫ్యాన్స్ తో కేకేలు పెట్టిస్తోంది. ఓ వైపు ప్రోడ్యూసర్ గా వరుస హిట్లు సొంతం చేసుకుంటున్న నాని.. హీరోగానూ అదరగొడుతున్నారు. ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా హిట్ 3తో అలరిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆ రేట్ కు డీల్

నాని ‘హిట్ 3’ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ భారీగానే వెచ్చించింది. ఈ మూవీని స్ట్రీమ్ చేయడం కోసం రూ.54 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. అలాగే అయిదు వారాల ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మే 1న థియేటర్లలో రిలీజ్ అయిన హిట్ 3 మూవీ.. అయిదు వారాల తర్వాత అంటే జూన్ సెకండ్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇంటెన్సివ్ యాక్షన్

హిట్ 3 ట్రైలర్ లోనే ఈ మూవీ ఎలా ఉండబోతుందో మేకర్స్ చూపించేశారు. బీభత్సమైన వైలెన్స్, రక్తపాతంతో నాని ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ మూవీలో నాని సరసన నటించారు. శైలేష్ కొలను డైరెక్టర్. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నాని యాక్షన్ మరో లెవెల్ లో ఉందనే కామెంట్లు వస్తున్నాయి.

 

అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా కిడ్నాపర్లు, క్రిమినల్స్ ఆట కట్టించే రోల్ లో నాని అదరగొట్టేశారని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాల సినిమా అయితే హైలైట్ అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందంటున్నారు.

 

Best Web Hosting Provider In India 2024