Best Web Hosting Provider In India 2024

చిరంజీవితో సినిమా అంటే డైజెస్ట్ కావడం లేదు.. హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్‌పై హీరో నాని కామెంట్స్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3. ఇవాళ థియేటర్లలో హిట్ 3 విడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన హీరో నాని మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించడం, హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ వంటి ఇతర విశేషాలను పంచుకున్నాడు.
హీరో నాని నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. నానికి జోడీగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా ఇవాళ (మే 1) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నాడు హీరో నాని.
మ్యూజిక్ కోసం మిక్కి జే మేయర్‌ను తీసుకోవడానికి కారణం ఏమిటి?
-మిక్కి జే మేయర్ మంచి క్రాఫ్ట్ మ్యాన్, ఇప్పటివరకు మంచి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఆయన ఎప్పుడు కూడా థ్రిల్లర్ చేయలేదు. ఒకవేళ ఆయన థ్రిల్లర్ చేస్తే ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌కు ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి?
-ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంటుంది . శ్రీనిధి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ విషయాలు రివీల్ చేయకూడదు. తన సొంత సినిమా అన్నట్టుగా చాలా సపోర్టివ్‌గా ప్రమోషన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంది. తనకి ఆడియన్స్‌లో చాలా మంచి క్రేజ్ ఉంది. తను ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది.
ఇలాంటి రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం, ఆ క్యారెక్టర్ నుంచి బయటపడటం కష్టం కదా..?
-ఏదైనా ఎగ్జైట్‌మెంట్ ఉంటే కష్టం అనిపించదు. నేను నా వర్క్‌ని చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే నాకు ఇది కష్టం అనిపించదు.
హిట్ 3 సినిమా మీరే చేయడానికి కారణం ఏమిటి?
-అది సబ్జెక్టు డిమాండ్. ఈ సినిమా నేనే ఎందుకు చేశాను. ఈ సినిమా నేను చేయడానికి కారణం ఏంటనేది మీరు సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుందని భావిస్తున్నాను.
హిట్ 3కి అడ్వాన్స్ బుకింగ్స్ వైల్డ్ ఫైర్‌లాగా ఉన్నాయి. మీరు ఎలాంటి ఓపెనింగ్స్ ఎలాంటి నంబర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
-నెంబర్ గేమ్‌లో నేను కొంచెం వీక్. అయితే ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్‌కి రావడం లేదని తరచుగా వింటున్నాం. కానీ, హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ఎగ్జైట్ చేసే కంటెంట్ ఇస్తే ఆడియన్స్ కచ్చితంగా ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని నా అభిప్రాయం.
హిట్ 3లో ఎలాంటి ఎమోషన్ ఉంటుంది?
-ఈ సినిమాలో చాలా మంచి ఎమోషనల్ హై ఉంది. అది ఒక ప్రామిస్ రిలేటెడ్ ఎమోషన్. అది చాలా బ్యూటిఫుల్ హోల్డ్ అవుతుంది. అది మీరు బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
చిరంజీవి గారి అభిమాని అయిన మీరు ఆయనతో సినిమా నిర్మించడం ఎలా అనిపిస్తుంది?
-చిరంజీవి గారితో సినిమా నిర్మించడం అనేది నాకు ఇంకా డైజెస్ట్ కావడం లేదు (నవ్వుతూ). ఇదొక ప్రౌడ్ మూమెంట్.
హిట్ 3తో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నాయి ఈ పోటీని ఎలా చూస్తారు?
-అన్ని సినిమాలు బాగా ఆడితేనే మన సినిమా ఇంకా బాగా ఆడుతుంది. సినిమాలో ఉన్న అందరం అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలని కోరుకోవాలి. అన్ని సినిమాలు వాడితే అందరి బిజినెస్‌లు పైకి వెళ్తాయి. ఓవరాల్‌గా ఇండస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.