Best Web Hosting Provider In India 2024

హిందీలోకి అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ – ఒకే రోజు ఓటీటీలో రిలీజ్
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తో పాటు సాయిధరమ్‌తేజ్ విరూపాక్ష సినిమాలు హిందీలో రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు హిందీలో గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. తెలుగులో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీస్ అందుబాటులో ఉన్నాయి.
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ అల వైకుంఠపురములో, విరూపాక్ష హిందీలో రిలీజయ్యాయి. గురువారం ఈ రెండు సినిమాల హిందీ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. అల వైకుంఠపురములో, విరూపాక్ష తెలుగు వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
అల వైకుంఠపురములో…
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ 280 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సుశాంత్, నివేథా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.
తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా ఆ టైమ్ అప్పట్లో అల వైకుంఠపురములో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకిగాను తమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డును అందుకున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది కావడం గమనార్హం.
బంటు ఫ్యామిలీ కథ…
వాల్మీకి తన కొడుకు బంటును అనుక్షణం ద్వేషిస్తుంటాడు. చదువు, సంతోషాలతో పాటు ప్రతి విషయంలో కొడుకును రాజీ పడేలా చేస్తాడు. తాను వాల్మికీ బాస్ రామచంద్ర కొడుకును అనే నిజం బంటుకు తెలుస్తుంది. రామచంద్రపై ద్వేషంతో పురిటిలోనే తనను వాల్మికీ మార్చేశాడనే తెలిసి బంటు ఏం చేశాడు?
ఓ ఎంప్లాయ్‌గా రామచంద్ర కుటుంబంలోకి అడుగుపెట్టిన బంటు..ఆ ఫ్యామిలీలోని సమస్యలను ఎలా పరిష్కరించాడు. బంటు జీవితంలోకి వచ్చిన అమూల్య ఎవరు? రామచంద్ర కుటుంబాన్ని టార్గెట్ చేసిన అప్పలనాయుడు ఎవరన్నదే ఈ మూవీ కథ.
విరూపాక్ష మూవీ…
హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన విరూపాక్ష వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. విరూపాక్ష మూవీకి స్క్రీన్‌ప్లే అందిస్తూనే ఈ మూవీని అగ్ర దర్శకుడు సుకుమార్ నిర్మించారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. విరూపాక్ష మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.
రుద్రవనం మిస్టరీ…
తన తల్లితో కలిసి దేవుడి జాతర చూడటానికిఅడవి మధ్యలో ఉన్న రుద్రవనంలో అనే ఊరికి వస్తాడు సూర్య(సాయిధరమ్‌తేజ్). తొలిచూపులోనే అదే ఊరికి చెందిన నందినితో ప్రేమలోపడతాడు. అనుకోకుండా ఆ ఊరిలో ఒకరి తర్వాత మరకొరు చనిపోతుంటారు.
ఆ మరణాల్ని ఆపడానికి ఎనిమిది రోజుల పాటు ఊరిని అష్టదిగ్భందనం చేయాలని పూజారి (సాయిచంద్)నిర్ణయిస్తాడు. అష్టదిగ్భందనం కారణంగా సూర్య ఆ ఊరిలోనే ఉండిపోవాల్సివస్తుంది?వరుస హత్యల వెనకున్న మిస్టరీని సూర్య ఎలా ఛేదించాడు? ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఈ హత్యలతో నందినికి ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.