





Best Web Hosting Provider In India 2024

రాత్రి పడుకునే ముందు పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పకండి, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రలు తమ పిల్లలో కాసేపు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు ఎలాంటి విషయాలు వారితో చెప్పవచ్చో కూడా తెలుసుకోవాలి. వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూసే కొన్ని అంశాలు వారితో మాట్లాడకూడదు.
పిల్లలను సరైన పద్ధతిలో ఖచ్చితంగా చాలా సవాలుతో కూడుకున్నది. పిల్లల పెంపకం విషయంలో స్థిరమైన నియమాలు లేవు. మీరు పరిపూర్ణ తల్లిదండ్రులుగా మారడానికి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి. పిల్లలతో సమయం గడపడం మంచి పెంపకానికి అతి ముఖ్యమైన సంకేతం.
బిజీగా ఉండటం వల్ల తల్లిదండ్రులు ఎక్కువ సమయం పిల్లలతో గడపలేకపోతున్నారు. కాబట్టి కనీసం రాత్రి పడుకునే ముందు అయిన పిల్లలతో కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రలుు, పిల్లల మధ్య బంధం బలపడటానికి ఇదే సరైన సమయం.
కానీ అదే సమయంలో తెలిసో తెలియకో కొన్ని ప్రతికూల విషయాలు పిల్లలకు చెబితే అది పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు మీ బంధంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పడుకునే సమయంలో పిల్లలతో మాట్లాడకూడని అంశాల గురించి తెలుసుకోండి. ఇలాంటి విషయాలు మాట్లాడితే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
నెగిటివ్ విషయాలు వద్దు
రాత్రి పడుకునే ముందు పిల్లలతో ఎలాంటి నెగిటివ్ విషయాలు చెప్పకండి. మీరు రోజంతా వారి లోపాల గురించి లేదా వారు చేసిన తప్పుల గురించి మాట్లాడవలసి వస్తుంది. కనీసం నిద్రించే ముందు మాత్రం వాటి గురించి మాట్లాడకండి. వాస్తవానికి, పిల్లవాడు రాత్రిపూట ప్రతికూల విషయాలు వింటూ నిద్రపోతే, అతని నిద్రకు భంగం కలిగించడమే కాకుండా, ఈ ప్రతికూల విషయాలు అతని మనసులో ఉండిపోతాయి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది అతని భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుంది.
మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కాస్త కలత చెందడం సహజం. అయితే ఈ సమస్యను పిల్లల ముందు ప్రస్తావించకుండా ఉండాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పిల్లలను ఇలాంటి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మీలాగే పిల్లలకు కూడా భవిష్యత్తు గురించి భయం, ఆందోళన, ఒత్తిడి మొదలైపోతాయి. ఇలాంటివి పిల్లల సున్నితమైన మనసులకు మంచిది కాదు.
ఏడుస్తూ పడుకోబెట్టకండి
రోజంతా పిల్లలను ఎంత తిట్టినా వారిని ఏడుస్తూ పడుకోబెట్టకూడదని గుర్తుంచుకోండి. పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే, దానిని ప్రేమతో వివరించండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ, అతన్ని తిట్టడం, ఏ విధమైన శిక్షను ఇవ్వడం మానుకోండి. నిజానికి పిల్లలు ఇలా ఏడుస్తూ నిద్రపోతుంటే అది అతని మనస్సుపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఇతరులతో పోల్చకండి
పిల్లలను ఇతరులతో పోల్చడం తల్లిదండ్రులకు సర్వసాధారణమైన అలవాటు. ఇలా చేయడం ద్వారా పిల్లలను మోటివేట్ చేస్తున్నామని భావిస్తారు. కానీ ఇది విరుద్ధంగా ఉంటుంది. వేరొకరితో పోల్చడం ద్వారా మీరు పిల్లలను తక్కువగా చూసినప్పుడు, ఈ విషయాలు అతని మనస్సులో ఉండిపోతాయి. ముఖ్యంగా పడుకునే ముందు పిల్లవాడి మెదడు మీరు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె మనస్సులో తన గురించి ఒక న్యూనతా భావన ఏర్పడుతుంది.
తప్పుడు ప్రామిస్
మీరు మీ బిడ్డకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వకండి. ‘ఇలా చేస్తే నీకు పెద్ద సైకిలు కొంటా, లేదా రేపు ఆఫీసు తర్వాత సినిమాకి తీసుకెళ్తాం’ ఇలాంటి తప్పుడు ప్రామిస్ లు చేయకండి. పిల్లల మనసు ప్రశాంతంగా ఉంచడానికి, ముఖ్యంగా వారిని నిద్రించడానికి తల్లిదండ్రులు హెల్ప్ చేయాలి. కానీ పదేపదే మీరు పిల్లలకు అబద్ధం చెప్పినప్పుడు, పిల్లవాడు కూడా ఈ అలవాటును గమనిస్తాడు. అతను మీ మాటలను నమ్మడం కష్టమవుతుంది, ఇది మీ సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతను కూడా జీవితంలో అబద్ధాలు చెప్పడం, తప్పుడు వాగ్ధానాలు చేయడం మొదలుపెడతారు.