





Best Web Hosting Provider In India 2024

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 75 సినిమాలు – ప్రేమకథతో హీరోగా ఎంట్రీ – రాజధాని ఫైల్స్ డైరెక్టర్ కొత్త మూవీ ఇదే!
తెలుగులో 75కుపైగా సినిమాలు చేసిన చైల్డ్ యాక్టర్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. స్వచ్ఛమైన ప్రేమకథతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాకు రాజధాని ఫైల్స్, ఆర్‌డీఎక్స్ లవ్ సినిమాల ఫేమ్ భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రాజధాని ఫైల్స్ మూవీ ఫేమ్ భాను శంకర్ తన పంథాను మార్చి ఫస్ట్ టైమ్ స్వచ్ఛమైన ప్రేమకథతో ఓ మూవీ చేయబోతున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో సాత్విక్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
నాన్ స్టాప్ షూటింగ్…
నాన్‌స్టాప్‌గా నలభై తొమ్మిది రోజులు షూటింగ్‌ను జరిపారు. ప్రస్తుతం ఈ ప్రేమకథా చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
అచ్చ తెలుగు అమ్మాయి…
ఈ సినిమా ద్వారా అచ్చ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమె ఎవరన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. లెజెండరీ మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి కొత్త సంగీత దర్శకుడు ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిట్‌తో పాటు ఫస్ట్ లుక్, నటీనటుల వివరాలను మేకర్స్ రివీల్ చేయబోతున్నారు.
75 సినిమాలు…
చైల్డ్ యాక్టర్‌గా సాత్విక్ వర్మ తెలుగులో 75కుపైగా సినిమాలు చేశాడు. మళ్లీరావా, బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథ్‌తో పాటు పలు సినిమాల్లో హీరో చిన్ననాటి క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. భాను శంకర్ మూవీతో సాత్విక్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రాజధాని ఫైల్స్ మూవీ…
గతంలో సందేశం, సామాజిక స్పృహతో కూడిన సినిమాలు చేశాడు భాను శంకర్. ఏపీ రాష్ట్ర రాజధాని సమస్యపై భాను శంకర్ చేసిన రాజధాని ఫైల్స్ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పొలిటికల్ డ్రామా మూవీ వివాదాలతో చర్చనీయాంశంగా మారింది.
రాజధాని ఫైల్స్ కంటే ముందు రాజు మహారాజు, ఆర్‌డీఎక్స్ లవ్, సరదాగా అమ్మాయితో, ఎవరే అతగాడు లాంటి సినిమాలు చేశాడు. మొట్టమొదటి సారిగా తన పంథాను మార్చుకొని ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కనకదుర్గారావు పప్పులఈ మూవీని నిర్మిస్తోన్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు.