ఓటీటీలోకి ఇవాళ తెలుగు కామెడీ సిరీస్- బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా రెండో సీజన్- ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ తెలుగు కామెడీ సిరీస్- బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా రెండో సీజన్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వేరే లెవెల్ ఆఫీస్‌కు రెండో సీజన్‌గా రీ లోడెడ్ అంటూ వచ్చిన ఈ సిరీస్‌లో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. మరి వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ ఓటీటీ ఏంటో చూద్దాం.

ఓటీటీలోకి ఇవాళ తెలుగు కామెడీ సిరీస్- బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా రెండో సీజన్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరిగిపోయాక తెలుగులో కూడా విపరీతమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా చిన్న ఆర్టిస్ట్స్‌కి, లో బడ్జెట్ ఉన్న వాళ్లకు ఈ ఓటీటీ వేదికలు మంచి ప్లాట్‌ఫామ్స్‌గా ఉపయోగపడుతున్నాయి. కొత్త నటీనటులతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ఓటీటీల్లోకి వదులుతున్నారు.

హీరోగా అఖిల్ సార్థక్

అలా గతేడాది (2024) డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు కామెడీ వెబ్ సిరీసే వేరే లెవెల్ ఆఫీస్. ఈ సిరీస్‌లో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్, ఓటీటీ సీజన్ రన్నరప్ అఖిల్ సార్ధక్ హీరోగా చేశాడు. అఖిల్ సార్థక్‌తోపాటు ఆర్జే కాజల్, జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి, మహేష్ విట్టా, మిర్చి కిరణ్, బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగరు, స్వాతి చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సీక్వెల్‌గా రెండో సీజన్

కామెడీతో ఆకట్టుకున్న వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్‌కు సీక్వెల్‌గా రెండో సీజన్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (మే 1) వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ టైటిల్‌తో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నేటి నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రతి గురువారం సరికొత్త ఎపిసోడ్‌ను ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేయనున్నారు.

బిగ్ బాస్ నిఖిల్ ఓటీటీ ఎంట్రీ

కాగా, ఈ సీక్వెల్‌గా వచ్చిన ఈ రెండో సీజన్‌ వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్‌లో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా నటించాడు. అంటే, ఈ సిరీస్‌తోనే నిఖిల్ మలియక్కల్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సిరీస్‌పై క్యూరియాసిటీ నెలకొంది. దీనికి సంబంధించిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో జరిగే

సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉండే ప్రమోషన్స్, అప్రైజల్స్, ఇంక్రిమెంట్, లవ్, గాసిప్స్, వర్క్ వంటి అంశాలతో ఈ ట్రైలర్ సాగింది. కామెడీ, ఎమోషన్స్‌తో వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పోలూరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ సిరీస్‌ను నిర్మించారు.

నటీనటులు

జోనాథన్ అడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో నిఖిల్ మలియక్కల్‌తోపాటు అఖిల్ సార్ధక్, రీతూ చౌదరి, ఆర్జే కాజల్, 90స్ సిరీస్ ఫేమ్ వసంతిక, మిర్చి కిరణ్, స్వాతి చౌదరి, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న వేరే లెవెల్ ఆఫీస్ రీ లోడెడ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024