





Best Web Hosting Provider In India 2024

ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కన్నడ రొమాంటిక్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ – రా అండ్ రస్టిక్ థ్రిల్లర్
కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కెరెబెటే థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. గౌరి శంకర్, బిందు శివరాం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
కన్నడ మూవీ కెరెబెటే థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ రిలీజైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంటల్‌లో ఈ కన్నడ మూవీ ప్రేక్షకలు ముందుకొచ్చింది.
కెరెబెటే మూవీలో గౌరిశంకర్, బిందు శివరాం హీరోహీరోయిన్లుగా నటించారు. గోపాల్ దేశ్‌పాండే, హరిణి శ్రీకాంత్, సంపత్ కీలక పాత్రలు పోషించారు. 2024లో మార్చిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 10కిగాను 9.3 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్నది.
మల్నాడు కల్చర్…
కర్ణాటకలోకి శివమొగ్గ అనే ప్రాంతం సంస్కృతి సంప్రదాయాలను దర్శకుడు గురురాజ్ ఈ మూవీలో సహజంగా చూపించారు. మల్నాడు అనే ప్రాంతంలో ఏడాదికి ఒకసారి మత్య్సకారులు జరుపుకునే కెరెబెటేఅనే జాతర నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే స్క్రీన్‌ప్లేను సమకూర్చాడు గౌరీ శంకర్.
నాగ రివేంజ్…
నాగ చేపల వేట సిద్ధహస్తుడు. మల్నాడు ప్రాంతంలో చేపల వేటలో తనను మించిన వాడు లేడనే పేరు తెచ్చుకున్నాడు. తండ్రి విషయంలో మాత్రం ఊరి వాళ్ల నుంచి ప్రతిరోజు నాగకు అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. ఊరందరికి సమాధానం చెప్పే రోజు కోసం నాగ ఎదురుచూస్తుంటాడు. మీనా అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తన ఇంట్లో బందీస్తాడు నాగ.
తొలుత నాగను ద్వేషించిన మీనా ఆ తర్వాత అతడి మంచితనాన్ని అర్థం చేసుకొని ఇష్టపడుతుంది. అసలు మీనాను నాగ ఎందుకు కిడ్నాప్ చేశాడు? తండ్రి గురించి నాగ తెలుసుకున్న నిజం ఏమిటి? నాగ ఎందుకు జైలుకు వెళ్లాడు? కేరెబెటే పోటీలో నాగ గెలిచాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
కమర్షియల్‌గా…
కెరెబెటే కంటే ముందు రాజహంస అనే సినిమాలో హీరోగా కనిపించాడు గౌరి శంకర్. జోకాలి మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. కన్నడ స్టార్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పించింది. కానీ కమర్షియల్‌గా మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కెరెబెటే మూవీతోనే రాజ్‌గురు డైరెక్టర్‌గా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టాడు.
సంబంధిత కథనం