




Best Web Hosting Provider In India 2024

నా సర్వస్వం నువ్వే.. హ్యాపీ బర్త్‌డే మై లవ్: భార్యకు విరాట్ కోహ్లి బర్త్ డే విషెస్.. పోస్ట్ లైక్ చేసిన సమంత
భార్య అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెప్పాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. నువ్వే నా సర్వస్వం అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. అనుష్క గురువారం (మే 1) తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.
విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ స్టార్ ప్లేయర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెకు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ ఎంతో రొమాంటిక్ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమెను కౌగిలించుకున్న ఓ ఫొటోను షేర్ చేశాడు.
అనుష్కకు విరాట్ విషెస్
బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఆమె భర్త, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. గురువారం (మే 1) అనుష్క తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కోహ్లి ఓ పోస్ట్ చేశాడు. “నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్‌నర్, నా సేఫ్ స్పేస్, నా బెస్ట్ హాఫ్, నా సర్వస్వం.
మా జీవితాలకు నువ్వే దారి చూపే వెలుగువి. ప్రతి రోజూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తాం. హ్యాపీ బర్త్ డే మై లవ్” అనే క్యాప్షన్ తో కోహ్లి ఈ పోస్ట్ చేశాడు. ఇది నిమిషాల్లోనే వైరల్ అయింది. పది నిమిషాల్లోనే 15 లక్షల లైక్స్ రావడం విశేషం. అందులో సమంత రూత్ ప్రభు కూడా ఉంది.
కోహ్లి, అనుష్క గురించి..
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తొలిసారి 2013లో కలుసుకున్నారు. ఓ కమర్షియల్ షూటింగ్ లో వీళ్లు పాల్గొన్నారు. స్నేహంగా మొదలైన వీళ్ల పరిచయం తర్వాత ప్రేమగా మారింది. మొదట్లో వీళ్లు తమ రిలేషన్షిప్ ను సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాత వీళ్లు డిసెంబర్, 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లకు వామికా, అకాయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విరాట్ తో పెళ్లి తర్వాత అనుష్క క్రమంగా సినిమాలకు దూరమైంది. ఆమె చివరిగా ఐదేళ్ల కిందట షారుక్ ఖాన్ తో నటించిన జీరో మూవీలో కనిపించింది. మరోవైపు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు.. ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. 443 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉండటం విశేషం.
సంబంధిత కథనం