



Best Web Hosting Provider In India 2024
పది వేల పందెం.. ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగి యువకుడు మృతి.. 21 ఏళ్లకే నూరేళ్లు!
కొన్నిసార్లు సరదాగా చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయి. అలానే ఓ యువకుడు పది వేల రూపాయల కోసం పందెం వేసి ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగాడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 21 ఏళ్లకే నూరేళ్లు నిండాయి.
ర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్‌లో ఐదు సీసాల మద్యం తాగి 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. కార్తీక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి నీరు కలపకుండా మద్యం తాగవచ్చని 10,000 రూపాయలు పందెం వేశాడు. ఐదు ఫుల్ బాటిళ్లు తాగిన తర్వాత కార్తీక్ అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, కానీ చికిత్స ఫలించకపోవడంతో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదైంది.
21 ఏళ్ల కార్తీక్ స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం వేశాడు. దానికోసం అతను మద్యంలో నీటిని కలపకుండా నేరుగా ఐదు బాటిళ్ల తాగుతానని చెప్పాడు. తన స్నేహితులకు నీటిలో కలపకుండా ఐదు సీసాల మద్యం తాగవచ్చని తెలిపాడు. వెంకట రెడ్డి అనే స్నేహితుడు కార్తీక్ అలా మద్యం తాగితే రూ.10,000 రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు.
తాను ఎప్పుడూ మద్యం తాగడంలో విఫలం కాలేదని, నీరు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగానని చెప్పాడు కార్తీక్. తరువాత అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్పించి కాపాడమని వేడుకున్నాడు. వెంటనే అతని స్నేహితులు అతన్ని ముల్బాగల్లు ఆసుపత్రికి తరలించారు. అయితే కార్తీక్ శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రిలో మరణించాడు.
కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. గర్భవతి అవడంతో భార్యను కొన్ని రోజులు తల్లి ఇంటికి పంపించాడు. తర్వాత మద్యానికి బానిసయ్యాడు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చిన భార్య 8 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. బాధ్యతలను గ్రహించకుండా మద్యం, జూదానికి అలవాటు పడిపోయాడు కార్తీక్. ఇప్పుడు తన జీవితాన్ని కోల్పోయాడు. అతడి భార్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఇప్పుడు ఒంటరి అయింది. బిడ్డ కూడా తండ్రి లేని అనాథ అయింది.
కార్తీక్ మరణానికి ప్రమాదకరమైన రీతిలో అతిగా మద్యం సేవించడమే కారణమని తేలింది. అతిగా మద్యం సేవించేందుకు ప్రేరేపించినందుకు వెంకట రెడ్డి, సుబ్రమణితోపాటుగా మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకట రెడ్డి, సుబ్రమణిని అరెస్టు చేశారు. కానీ మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. కార్తీక్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సమీపంలోని నంగలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Best Web Hosting Provider In India 2024
Source link