కేరళ స్టైల్‌లో క్రిస్పీగా పనసకాయ చిప్స్ ఇలా చేసేయండి, ఇంట్లోనే వండుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024

కేరళ స్టైల్‌లో క్రిస్పీగా పనసకాయ చిప్స్ ఇలా చేసేయండి, ఇంట్లోనే వండుకోవచ్చు

Haritha Chappa HT Telugu

కేరళ వెళ్లిన వారికి అక్కడ ఎక్కువగా పనక కాయ చిప్స్ కనిపిస్తాయి. ఆలూ చిప్స్ లాగే జాక్ ఫ్రూట్ చిప్స్ అక్కడ ఎక్కువగా కరకరలాడించేస్తారు. ఈ చిప్స్ చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెసిపీ ఇదిగో.

పనసకాయ చిప్స్

చిప్స్ అంటే పిల్లలకు ప్రాణం. పిల్లలే కాదు పెద్దలు కూడా చిప్స్ ను ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఆలూ చిప్స్ మాత్రమే కాదు కాస్త కొత్తగా జాక్ ఫ్రూట్ చిప్స్ టేస్ట్ చూడండి. పనసకాయతో చేసే ఈ చిప్స్ ఎంతో రుచిగా ఉంటాయి.

కేరళలో ఎక్కడా చూసినా పనసకాయ చిప్స్ కనిపిస్తాయి. పనసపండు అనగానే మనకు తిరునల్వేలి, కేరళ గుర్తుకు వస్తాయి. ఆ ప్రాంతాల్లో పనస చెట్లు అధికం. అందుకే అక్కడ పనస కాయ చిప్స్ వ్యాపారం మీదే ఎక్కువ మంది ఆధారపడి బతుకుతున్నారు. ఈ పనసకాయ చిప్స్ కోసం బాగా పండినది తీసుకోకూడదు. పచ్చిగా ఉన్న పనసకాయను ఎంపిక చేసుకోవాలి.

పనసకాయ చిప్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి పనసకాయ ముక్కలు – అరకిలో

కారం – రెండు స్పూన్లు

రాక్ సాల్ట్ – రుచికి సరిపడా

నూనె – సరిపడినంత

పసుపు – అరస్పూను

పనసకాయ చిప్స్ రెసిపీ

  1. పనస కాయలోని పసుపు భాగాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నీరు, ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. కాసేపటి తరువాత చేత్తోనే పిండి ఒక ప్లేటులో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
  3. ఒక కళాయిలో చిప్స్ వేయించడానికి తగినంత నూనె వేయాలి.
  4. నూనె బాగా మరుగుతున్నప్పుడు పనస ముక్కలను తీసి చేత్తోనే పిండి నూనెలో వేయాలి.
  5. అవి బాగా వేగాక తీసి ఒక గిన్నెలో వేయాలి. వాటిలో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ పనసకాయ చిప్స్ రెడీ అయినట్టే.

ఇది కేరళలో తయారు చేసిన ప్రసిద్ధ చిరుతిండి వంటకం. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని తినవచ్చు. కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం కొద్దిగా తినడం తగ్గించాలి. మితంగా తినాలి. మీరు ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024