




Best Web Hosting Provider In India 2024

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ – సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, తేదీలివే
తెలంగాణ పదో తరగతి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. జూన్ 3 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం…. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతాయని పదో తరగతి బోర్డు ప్రకటించింది.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు – షెడ్యూల్ :
- 03 – 06 – 2025 : ఫస్ట్ లాంగ్వేజ్
- 04 – 06- 2025 : సెకండ్ లాంగ్వేజ్
- 05 – 06 – 2025 : ఇంగ్లీష్
- 06 – 06 – 2025 : మ్యాథ్స్
- 09 – 06 – 2025 : ఫిజికల్ సైన్స్
- 10 – 06 – 2025: సైన్స్, బయోలజీ
- 11 – 06 – 2025 : సోషల్ స్టడీస్
- 12 – 06 – 2025 : ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ – పేపర్ 1
- 13 – 06 – 2025 : ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ – పేపర్ 2
విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు మే 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా అనుసంధానించిన ఆన్ లైన్ లో పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీగా మే 17 ఉంది. సంబంధిత సబ్జెక్టులో పరీక్ష ప్రారంభానికి 2 రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో కూడా ఫీజు చెల్లించవచ్చు.
ఇక ఫలితాలపై రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు మే 15వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రీవెరిఫికేషన్ కోసం అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది.
ఈసారి విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 91.32 % శాతం, బాలికలు 94.26 % శాతం ఉన్నారు. మొదటి స్థానంలో మహబూబాబాద్ జిల్లా(99.29 శాతం) నిలవగా… చివరి స్థానంలో వికారాబాద్ ఉంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ పదో తరగతి – 2025 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
సంబంధిత కథనం
టాపిక్