



Best Web Hosting Provider In India 2024
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు రేపు విడుదల కాదు.. తప్పుడు ప్రచారాన్ని తోసిపుచ్చిన బోర్డు!
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో రేపే ఫలితాలు అంటూ వైరల్ అయింది. ఈ విషయాన్ని బోర్డు తోసిపుచ్చింది. రేపు 10, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయదు.
2025 సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయని పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలు, ఇతర మీడియా కథనాలకు విరుద్ధంగా సీబీఎస్ఈ బోర్డు రేపు 10, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయడం లేదు. ఫలితాల తేదీ ఇంకా ఖరారు కాలేదని, రేపు ప్రకటించే ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.
అధికారిక వెబ్‌సైట్‌లు చూడండి
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2025 అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in విడుదల కానున్నాయి. 2025 ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.
సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు ఎగ్జామ్ 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18, 2025 వరకు జరిగాయి. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలకు 24.12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి.
గత ఏడాది బోర్డు ఫలితాలు ఎలా ఉన్నాయి?
గత ఏడాది అంటే 2024లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలో 87.98 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 91.52 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం 93.60గా నమోదైంది. బాలుర కంటే 2.04 శాతం అధికంగా 94.75 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. సెంట్రల్ టిబెటన్ స్కూల్ పరిధిలోని పాఠశాలల్లో అత్యధికంగా 99.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నవోదయ విద్యాలయాల్లో 98.90 శాతం, కేంద్రీయ విద్యాలయాల్లో 98.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
సీబీఎస్ఈ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
1. ఫలితాలు వచ్చాక చెక్ చేసేందుకు ముందుగా సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in వెళ్లండి.
2. హోమ్ పేజీలో టెన్త్/12వ తరగతి పరీక్షా ఫలితాల లింక్ కనిపిస్తుంది.
3. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ రోల్ నెంబర్ సబ్మిట్ చేయండి.
4. మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుడు సమాచారాన్ని ఫాలో కావొద్దు. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లలో అప్డేట్లపై మాత్రమే ఆధారపడాలి.
Best Web Hosting Provider In India 2024
Source link