ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 ఫలితాలు విడుదల – ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 ఫలితాలు విడుదల – ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన విద్యార్థులు లాగిన్ వివరాలతో ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ ఫలితాలు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు… వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ర్యాంక్ కార్డు ఇలా చెక్ చేసుకోండి:

  1. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో ఆరో తరగతి ప్రవేశాలు(APMS – VI (Class) అని ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, కోడ్ ను ఎంట్రీ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
  4. మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

రాష్ట్రంలో మొత్తం 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఏప్రిల్‌ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా వెల్లడించారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు:

మరోవైపు మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 22వ తేదీతో పూర్తవుతుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మే 23వ తేదీన జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలను ప్రకటిస్తారు. మే 24వ తేదీన మెరిట్ జాబితాలను సిద్ధం చేస్తారు. మే 26వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితాలను ప్రదర్శిస్తారు. మే 27వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ లో తరగతులు ప్రారంభమవుతాయి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

AdmissionsEntrance TestsExamsExam ResultsAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024