అట్లీతో మూవీపై కీలకమైన అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదొక విజువల్ వండర్‌గా నిలుస్తుందన్న ఐకాన్ స్టార్

Best Web Hosting Provider In India 2024

అట్లీతో మూవీపై కీలకమైన అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదొక విజువల్ వండర్‌గా నిలుస్తుందన్న ఐకాన్ స్టార్

Hari Prasad S HT Telugu

అట్లీతో తాను తీయబోయే నెక్ట్స్ మూవీపై అల్లు అర్జున్ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. ఇదొక విజువల్ వండర్ గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ ఈవెంట్లో న్యూస్9తో మాట్లాడుతూ బన్నీ ఈ కామెంట్స్ చేశాడు.

అట్లీతో మూవీపై కీలకమైన అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదొక విజువల్ వండర్‌గా నిలుస్తుందన్న ఐకాన్ స్టార్

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. అందులోనూ అది జవాన్ లాంటి మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తమిళ డైరెక్టర్ అట్లీతో కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తన నెక్ట్స్ మూవీపై అల్లు అర్జున్ గురువారం (మే 1) స్పందించాడు. ఓ ఈవెంట్లో న్యూస్9తో అతడు మాట్లాడాడు.

ఇదొక విజువల్ వండర్

ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ను తన నెక్ట్స్ మూవీ, అట్లీతో కలిసి పని చేయడం గురించి చెప్పాల్సిందిగా అడిగారు. దీనిపై బన్నీ స్పందిస్తూ.. “అవును.. ఇది నా 22వ సినిమా. జవాన్ తోపాటు సౌత్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన అట్లీతో చేస్తున్నాను. మేమిద్దరం కలిసి పని చేస్తున్నాం.

అతడు నాకు చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నట్లు నాకు అనిపించింది. ఇండియా సినిమాలో ఓ కొత్త విజువల్ వండర్ ను తీసుకొస్తామన్న ఆశతో ఉన్నాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండే మూవీ” అని అల్లు అర్జున్ అన్నాడు.

అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

చిరంజీవి గురించి ఏమన్నాడంటే..

మెగాస్టార్ చిరంజీవే తనకు అతి పెద్ద స్ఫూర్తి అని ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్పష్టం చేశాడు. “మా అంకుల్, మెగాస్టార్ చిరంజీవి. నాకు స్నేహితుడు కూడా. నాకు అతిపెద్ద స్ఫూర్తి. నన్ను ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరు. అంతమంది స్టార్లు ఉన్న ఫ్యామిలీలో ఉన్నప్పుడు వినయం కూడా అలవడుతుంది.

కుటుంబంలో ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండటం కూడా తోడ్పడుతుంది” అని బన్నీ అన్నాడు. అల్లు అర్జున్ చివరిగా కనిపించిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1850 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని తర్వాత అతడు ఇప్పుడు అట్లీతో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ కూడా మార్చాడు. బన్నీ, అట్లీ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024