



Best Web Hosting Provider In India 2024
నో సీట్, నో ఎంట్రీ.. భారతీయ రైల్వే ప్రయాణ నిబంధనలు కఠినతరం!
భారతీయ రైల్వేలు మీ ప్రయాణ విధానాన్ని మారుస్తున్నాయి. సీట్ కన్ఫామ్ కాకుంటే రిజర్వ్డ్ బోగీల్లోకి ప్రవేశం లేదు. అంటే నో సీట్, నో ఎంట్రీ అన్నమాట.
మీరు ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీద ఆధారపడి ప్రయాణం చేస్తున్నారా? మీ ప్రయాణ ప్రణాళికలను ప్రభావితం చేసే ఒక పెద్ద మార్పును భారతీయ రైల్వే అమలు చేస్తోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఇప్పటికే రైలు ఎక్కినప్పటికీ స్లీపర్, ఏసీ బోగీల్లోకి అనుమతించరు. రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసుకున్న వారికి సాఫీగా ప్రయాణం జరిగేలా ఈ కొత్త పాలసీని రూపొందించినప్పటికీ దీనిపై భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది.
అనుమతి ఉండదు
కొన్నేళ్లుగా చాలా మంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న బెర్త్‌ను చూడటం లేదా తోటి ప్రయాణికుడిని వారి స్థలాన్ని షేర్ చేసుకోవాలని ఒప్పించడం చేస్తుంటారు. కానీ కొత్తగా అమలు చేసే నిబంధనతో ఇవేమీ కుదరవు. కన్ఫామ్ అయిన సీటు లేకుండా, రిజర్వ్డ్ కోచ్‌లలోకి మిమ్మల్ని అనుమతించరు. మీరు ఒకవేళ ఎక్కేందుకు ప్రయత్నిస్తే మీకు జరిమానా విధించే ప్రమాదం ఉంది. జనరల్ కంపార్ట్మెంట్‌కు పంపిస్తారు.
కన్ఫర్మ్ టికెట్లతో ప్రయాణికులకు అనుభవాన్ని మెరుగుపరచడం, సీటింగ్ ఏర్పాట్లపై గందరగోళం లేదా వివాదాలను తగ్గించడమే లక్ష్యమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ మిమ్మల్ని రిజర్వ్డ్ బోగీలోకి తీసుకెళ్లదు. మీరు సాధారణ కంపార్ట్మెంట్‌లో ప్రయాణించాలి లేదా మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలి.
టికెట్ కన్ఫామ్ కాకపోతే
ఆన్‌లైన్ బుకింగ్‌లకు కూడా కొత్త మార్పులు వర్తిస్తాయి. మీరు ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, తుది చార్ట్ తయారు చేసే సమయానికి టికెట్ కన్ఫామ్ కాకపోతే ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఈ చర్య చివరి నిమిషంలో గందరగోళాన్ని తొలగిస్తుంది.
ఎక్స్‌ప్రెస్‌లో ఏటీఎం
భారతీయ రైల్వే మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఏటీఎంను ప్రవేశపెట్టింది. ప్రయాణికుల ప్రయాణ సమయంలో నగదు ఉపసంహరించుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. అత్యవసరంగా నగదు అవసరం ఉన్న సమయంలో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Best Web Hosting Provider In India 2024
Source link