రేపటి నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు.. ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నా పత్రాల పంపిణీ

Best Web Hosting Provider In India 2024

రేపటి నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు.. ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నా పత్రాల పంపిణీ

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్1 మెయిన్స్‌ పరీక్షలు రేపటి నుంచి జరుగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ రిక్రూట్‌మెంట్‌లో 89 పోస్టులను భర్తీ చేస్తారు. మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి.

 
రేపటి నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలు
 

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్‌ పరీక్షలు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో జరుగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ రిక్రూట్‌మెంట్‌లో 89 పోస్టులను భర్తీ చేస్తారు. మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి.

 

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చే వారిని లోనికి అనుమతించరు.

ఏపీపీఎస్సీ టైమ్‌ టేబుల్‌

మే 3వ తేదీ… తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్

మే 4వ తేదీ.. ఇంగ్లీష్‌ క్వాలిఫైయింగ్ పేపర్

మే 5వ తేదీ.. పేపర్ 1 జనరల్ ఎస్సై వర్తమాన అంశాలు, ప్రాంతీయ అంశాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలు

మే 6వ తేదీ… పేపర్ 2 మిస్టరీ అండ్ కల్చర్‌, జాగ్రఫీ, ఇండియా – ఆంధ్రప్రదేశ్‌

మే 7వ తేదీ… పేపర్ 3 పొలిటీ, భారత రాజ్యాంగం, గవర్నెన్స్‌, లా అండ్ ఎథిక్స్‌

మే 8వ తేదీ… పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్‌

మే 9వ తేదీ… పేపర్‌ 5 సైన్స్‌ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ఇష్యూస్

నాలుగు కేంద్రాల్లో పరీక్షలు…

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు మొత్తం 4496మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. నాలుగు జిల్లాల్లో 13 కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి.

విశాఖపట్నంలో రెండు పరీక్షా కేంద్రాల్లో 1190మంది అభ్యర్థులు, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో 6 కేంద్రాల్లో 1801మంది, తిరుపతిలోని 3 కేంద్రాల్లో 911మంది, అనంతపురంలోని 2 కేంద్రాల్లో 594 మంది పరీక్షలకు హాజరవుతారు. ఏప్రిల్ 21 నుంచి పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ వెబ్‌ సైట్‌లో హాల్‌ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

 

15 నిమిషాల అదనపు సమయం…

పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 వరకు అనుమతిస్తారు. అదనంగా మరో 15 నిమిషాల పాటు అభ్యర్థుల్ని అనుమతిస్తారు. హాల్‌ టిక్కెట్‌తో పాటు పాస్‌ పోర్ట్‌, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ ధృవీకరణగా చూపాల్సి ఉంటుంది. 9.45 తర్వాత ఎవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని ఏపీపీఎస్సీకార్యదర్శి రాజబాబు సూచించారు. చివరి నిమిషంలో ఆలస్యాన్ని అనుమతించరని, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాబ్‌లతో ప్రశ్నాపత్రాలు…

ఈ సారి గ్రూప్‌ 1 మెయిన్స్‌లో ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నా పత్రాలను అందిస్తారు. ఆన్సర్‌ షీట్లపై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పెన్‌తో మాత్రమే సమాధానాలు రాయాలి. జెల్‌ పెన్‌లను అనుమతించరు. జవాబు పత్రాలను డామేజ్‌ చేసే పెన్నులను పరీక్షలకు అనుమతించరు. స్కెచ్‌ పెన్‌లను వినియోగిస్తే మాల్‌ ప్రాక్టీస్‌ గా పరిగణిస్తారు. వాటిని మూల్యంకనానికి స్వీకరించారు. ట్యాబ్‌ ద్వారా ప్రశ్నాపత్రాల గురించి మరిన్ని వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ పొరపాట్లు చేయకండి…

ఉదయం 8.30 నుంచి 9.30 గంటల్లోగా నిర్దేశించిన పరీక్షా కేంద్రా ల్లోకి అభ్యర్ధులు వెళ్లాలి. అలస్యమైతే సహేతుక కారణాలు చూపితేనే 9.45 వరకు లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పెన్నులతో పరీక్ష రాయాలి. ఇతర పెన్నులు వాడితే వాటిని మూల్యాంకనం చేయరు.

 
 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024